కవితా స్రవంతి

చిరు కానుక

- డా . నీరజ అమరవాది

కల్లాకపటం లేని బాలల కోసం ,

కొత్త బంగారు లోకం తలుపులు తెరిచింది .

మాలాల , సత్యార్థీలు స్వాగతం పలుకుతున్నారు .

ఆనందంగా తిరిగే బాలలు ,

స్వేచ్ఛగా ఎదిగే బాలలు ,

పలుగూ,పారా పక్కన పెట్టి ,

పలకా , బలపం పట్టిన బాలలు .

వెట్టి చాకిరీకి చరమగీతం పాడుతూ ,

చిరునవ్వుల గేయాలాపనలు .

పేరేదైనా , దేశమేదైనా

ఏ భాషైనా , ఏ ఖండమైనా

ఉత్సాహంతో రేపటి భవిత

మాదేనంటూ ఏకమైన బాలలు .

అప్పుడే చిగుర్చిన మొక్కకు కూడా

ఆశలు , ఆశయాలు ఉంటాయని ,

జాతి , మత , కులాతీతంగా

గళం కలుపుతూ , కదం తొక్కుతూ ,

ఓనమాలు దిద్దే బాల్యం మా హక్కంటూ ,

నాయకుల మొద్దునిద్రను వదిలించారు .

అక్షరాలతో ప్రగతి బాటలు వేస్తాం .

పుస్తకాలే రథచక్రాలుగా , గురువులే సారధులుగా ,

అసాధ్యాలను సుసాధ్యం చేస్తాం .

ఆకాశాన్ని దున్నేస్తాం , రోదసీని ఏలేస్తాం

అంటూ చిన్నారులు ప్రతిన పూనారు .

వారికి అండగా అంతర్జాతీయ సమాజం

శాంతిని ‘ తోరణాలుగా ‘ కడుతూ

నోబుల్ బహుమతిని అందించింది .

కొత్త సంవత్సర ‘ చిరుకానుక ‘ గా

ఇది నూతన శకానికి ఆరంభం .

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)