కవితలు

మన్మధనామ ఉగాది

 

- ఒద్దిరాజు శ్రీకాంత్

ఊయలలూగే కాలంతో
ఊపిరి సలపని పోరాటంలో
ఊహల మాయాజాలంలో
ఉందనిపించే ఆరాటంలో
కోర్కెల సుడిలో జీవనరాపిడిలో
అపుడెపుడో ఇంకిన మనసు తడి
కనుకొలుకులలో ఆర్తిగా నిలబడి
కల్మషమెరుగని చెలిమితో బలపడి
గానుగెద్దులా బ్రతుకమనే లోకంపైనే తిరగబడి
పాషాణ హృది చీల్చుకు బయటపడి
నవ ‘మన్మధ’ వాసంతపు జతగూడి
చిగురించే ఆశల తో ముడిపడి
అన్నిట నిలిచెను తానై అమ్మ ఒడి
కాలానికి దిద్దెను నూతన ఒరవడిమీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)