సుజననీయం

 


- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చెన్నాప్రగడ కృష్ణ
 

గత పదకొండు సంవత్సరాలకు పైగా తెలుగు సాహిత్యానికి, ఇతర కళలకు ఇతోధికంగా సేవ చేస్తున్నది సిలికానాంధ్ర అంతర్జాల మాసపత్రిక సుజనరంజని. సారస్వతం శీర్షిక తెలుగుభాష, సాహిత్య చరిత్రపై జరిపే పరిశీలనాత్మక రచనలకు పెద్దపీట వేస్తున్నది. పద్యరచనలు, సాంఘిక నవలలు ధారావహికంగా వెలువడుతునే ఉన్నాయి. ఇక సాహిత్యానికి మకుటాయమానమైన కథ సంగతి సరేసరి. ప్రతినెల గతకాలపు ఒక మంచి కథని
నెమరువేసుకొంటూ, చేయితిరిగిన మరియు వర్ధమాన రచయితల కథలను ప్రచురిస్తున్నాము.

ఇక కవితల విషయానికొస్తే ప్రతి సంచికలో దాదాపు ఐదు కవితలు ప్రచురింపబడుతున్నాయి. పద్యం-హృద్యం శీర్షిక ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. ప్రతినెల ఇచ్చే సమస్యకు దేశవిదేశాలనుండి ఛందోబద్ధమైన పూరణలను చూస్తుంటే పద్యం పట్ల మక్కువ ఇంకా కళకళలాడుతున్నదని అర్థమవుతున్నది. కళల విషయానికొస్తే, సంగీతరంజని మరియు చిత్రరంజని శీర్షికల ద్వారా ఆయా కళలకు స్థానం కల్పించటం జరుగుతున్నది. ఈ నెలనుండి హాస్యరంజని కూడా మొదలుపెడుతున్నాము. చిన్నపిల్లలకు తెలుగుపట్ల ఉన్న ఆసక్తిని మనబడి శీర్షికలో చూబెడుతున్నాము.

ఇక అమెరికాలో పేరొందిన రచయితలు, ఉదాహరణకు మందపాటి సత్యం, వేమూరి వెంకటేశ్వరరావు లాంటి రచయితలు తమ రచనలను పంపుతూ సుజనరంజని స్థాయిని పెంపొందించటానికి సహాయపడుతున్నారు. లాభాపేక్ష లేకుండా, స్వచ్చందంగా తెలుగు సాహిత్యానికి జరుగుతున్న సేవ ఇది.

ప్రతిరోజు మాకు రచనలు పరిశీలనకు అందుతూనే ఉంటాయి. పాఠకులు తమ స్పందనలను పంపుతూనే ఉన్నారు. ఎందరో సహృదయులు! అందరికి వందనాలు!!

- తాటిపాముల మృత్యుంజయుడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)