కవితా స్రవంతి
తెలుగు పలుకు
- కృష్ణ అక్కులు

ఆలాపన

తెలుగు భారతి మకుటంబున...
వజ్రములై వెలగగా తెలుగు అచ్చులు
ధగధగా మెరయు నగలలో
ముత్యంబులై కాంతులు
వెదజల్లగా హల్లులు
తెలుగు తల్లి పదముల సుమములై
వొదుగగా మన తెలుగు పదములు
ఏ కాలాలో, ఏ లోకాలలో, ఏ శ్లోకాలు
వల్లించగా మన నాలుక కు కలిగెనో
తెలుగు పలుకు, పలుకు భాగ్యము!!

చరణం 1

కలువ పూల సొగసు
కమలముల నగవు
రామ చిలుక పలుకు
రమణి కులుకు
తళుకు బెళుకు లెన్నో
కలిగి యుండు పలుకు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు

చరణం 2

తెలుగు పలుకు పలుకుగ
మోము దివ్యంగా వెలుగు
తెలుగు పలుకు వినగ
చెవికి హాయి కలుగు
తెలుగు పలుకు చదవగ
యెదన బాధ తొలుగు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు

చరణం 3

కడలిలో ఊయలూగు
అలలు వోలె
గాలిలో తేలి యాడు
ఖగం వోలె
హాయి గొలుపు పలుకు
ఆనందపు పలుకు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు

చరణం 4

అమ్మ కమ్మని ప్రేమ
నాన్న చల్లని కరుణ
తోబుట్టువుల మమత
కలబోత ఈ పలుకు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు

చరణం 5

తెలుగులోన పిలువ
తెలుగులోనె కొలువ
వెలుగులు చిమ్ముతూ
వేలుపులే దిగిరారె
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)