మనబడి

మనబడి స్నాతకోత్సవం

 

 

లాస్ ఏంజిలిస్ సాంస్కృతికోత్సవం:

మనబడిలో తెలుగు నేర్చుకొనే చిన్నారులకి శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గతఏడాది అర్హత పరీక్షలు నిర్వహించింది. దేశమంతటా దాదాపు 500 మంది పిల్లలు ఈ పరీక్షలకు హాజరుకాగా, లాస్ఏంజెల్స్ లో పరీక్షలో పాల్గొన్న 40 మంది తెలుగు పిల్లలు, అందరూ అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు. మొట్టమొదటి సారిగా జరిగిన మనబడి స్నాతకోత్సవంలో స్థానిక మనబడి సంధాత డాంజి తోటపల్లి స్నాతకోత్సవం సంచాలకుడిగా వ్యవరించగా సిలికానాంధ్ర మనబడి కులపతి చామర్తిరాజు, మనబడి నిర్వాహకకార్యవర్గం సభ్యులు అనిల్ అన్నం ,స్నేహ వేదుల, శ్రీరాం కొట్ని తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి పట్టభద్రులకి పట్టాలు ప్రదానం చేశారు. తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో "సమస్యా పూరణం", "మనబడి పాట", "తెలుగు భాష పరిణామ క్రమము", "మీకు తెలుసా?", "పండుగలు", "బృందగానం", "చెప్పినట్టు చేస్తారా", "భారతదేశంలో రాష్త్రాలు", "అంత్యాక్షరి", "మనబడి గీతం", "నీటిఎద్దడి", "పువ్వులు", "శతకపద్య నాటకం" వంటి ప్రదర్శనలతో మనబడి విద్యార్ధులు తెలుగుభాషా సంస్కృతులపై తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. మోహన్ కాట్రగడ్డ, కిరణ్ సింహాద్రి, నరేంద్ర కవర్తపు, శ్రీధర్ బండ్లమూడి, సురేష్ చిలుకూరి, సురేష్ బాబు అయినంపూడిల సమర్ధవంతమైన నాయకత్వంలో ఈ సభ అత్యంత వైభవంగా జరిగింది. దోసప్లాజా అతిధులందరికి చక్కని తెలుగు భోజనం అందించింది.

 

శాన్డియాగో సాంస్కృతికోత్సవం:

మొట్టమొదటి సారిగా శాన్డియాగోలో మనబడి సాంస్కృతికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తేనెలొలికే పలుకులతో మనబడి గీతo, చెమ్మచెక్క, చుకుచుకురైలు పాటలు, దీపావళి వెనుక పురాణం, మిత్రలాభం, మిత్రభేదం, బూరెల మూకుడు, భువన విజయం, బంగారు గొడ్డలి నాటిక, పరమానందయ్య శిష్యులకథ, తెలుగులెస్స నాటికతో పాటు ఎన్నో కార్యక్రమాలు ప్రదర్శించారు. జవహర్ కంభంపాటి, హేమచంద్ర తలగడదీవి, మహేష్ కోయ, ఐశ్వర్య భారతిల నాయకత్వంలో శాన్డియాగో మనబడి కార్యవర్గం సమర్ధవంతంగా నడిపించారు. 8 ఎలిమెంట్స్ వారు భోజనం అందజేశారు. సిలికానాంధ్ర మనబడి ప్రాచుర్యం అధినేత, డాలస్సమన్వయకర్త రాయవరం విజయభాస్కర్ స్నాతకోత్సవ సభలో స్వాగతోపన్యాసం చేసారు.

“ఎన్నోఒత్తిడులకి తట్టుకొని మొదలు అమ్మానాన్నలు చెబితే విని తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టే పిల్లలకి, సిలికానాంధ్ర మనబడిలో తెలుగు నేర్చుకోవడం, ఒక బహుళార్థ సాధక చర్యలా మలచడమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తున్నామన్నారు. ఆకోవలో, తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అమ్మభాషని ప్రపంచభాషగా నేర్చుకోనే పిల్లలకి అత్యంత ప్రయోజనం కలగడం కోసం, విశ్వవిద్యాలయ పట్టాలని ఇప్పించే ఏర్పాటు, ఎన్నో ఏళ్ళ కృషి ఫలితం” అని పేర్కొన్నారు. డొక్కారామ్ పిల్లలకి ఈ పట్టాల స్వీకారం ద్వారా మరింత బాధ్యత పెరిగిందని చెబుతూ, పట్టభద్రులచే “భాషాప్రతిజ్ఞ” చేయించారు. మీరే భవిష్యత్తులో రచనలు చేస కవులు కావాలని కన్నెగంటి చంద్ర, తమ భాషా ప్రయాణాన్ని ఇంకా కొనసాగించాలని కే.సీ.చేకూరి, మనబడి గొప్పదనం గురించి ఆశువుగా అల్లిన పద్యం అందరితో పలికించి ఆచార్య పుదూర్జగదీశ్వరన్లు విద్యార్ధులను కోరి వారికి పట్టాలు ప్రధానం చేశారు. ఇటువంటి అత్యున్నతతీరులో పిల్లలకి పట్టాలు ఇవ్వడం ద్వారా, వారికి తెలుగు పట్ల అభిమానాన్ని మరింత పదిలం, మరింత పటిలం చెయ్యడంలో సిలికానాంధ్ర మనబడి దోహదపడుతోందని తల్లిదండ్రులు తమ హర్షం వ్యక్తం చేశారు. డాలస్ సమన్వయ కర్త సుసర్ల ఫణీంద్ర నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. ప్రముఖ సంగీత గురువు, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడెమీ అధినేత రామాచారి, మనబడి పట్టభద్రుల కోసం రచించి, స్వరపరచ గానం చేసిన ఉత్తేజ పూరితమైన “మనబడి అభినందన గీతం”ఆకట్టుకుంది.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)