కవితా స్రవంతి
కొన్ని కవితలు
- శిరిష్ శరత్

1) నేను
శ్రీ శ్రీ ను కాను నేను సిరి వెన్నెలను కాను
పిలువంగా పలుకంగా పరమ శివుడను కాను
శతకోటి మనసులు దోచేటి సంగీతమును కాను
కవితలోదిలే పాదాల చెంత చిరుకవిని కాను
ఈ కవిత చందవంగా స్పందిచు మీ మనసునే నేను

2) తెలుగు కవితలు
అందంకోసం ఆరాట పడ్డాయి కొన్ని అక్షరాలు ,
అలుపెరగక తిరిగాయి అందిన అన్నిలోకాలు ,
అలసట మరిచాయి ఆశ తీరేవరకు ,
అందమైనది తెలుగు భాషనీ తెలుసుకునాయి చివరకు,
ఆంధ్ర దేశాన్ని చేరాయి కలను నిజము చేసుకొనుటకు ,
అ అంటూ ఆ నేనంటూ ఒక్కొకటి మారాయి తెలుగే భువిలో అందమంటూ ,
ఆనందంతో మారిపోయాయి పదాలుగా స్వరాలుగా తమ ఆశ తీరేటట్టు,
ఆస్వాదిస్తూ మారిపోయాయి మన ఈ కవితలుగా చిరకాలం నిలిచిపోవాలంటూ,
అందుకే వుంటాయి మన తెలుగు కవితలు ఈ జగతికి వన్నెతెచేటట్టు.

3) రెప్ప పాటు జీవితం
రెప్ప పాటు జీవితానికి రెక్కలు ఎన్ని వున్నా ,
రేపంటే తెలియని మనిషికి స్వార్ధమే మిన్న ,
రేయి పగలు సంపాదన ఎంత వున్నా కళ్ళలో కన్నీరే చిన్న ,
మనసు ఎంత పెద్దదైన కొంత కుడా లేదు ప్రేమ.. ఇది ఏమి మనషి జన్మ


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)