కవితా స్రవంతి

సంస్కృతి గీతం

- డా|| దోముడాల ప్రమోద్ మరియు స్వర్గీయ దోముడాల సునంద


 

సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, ఇది మన భారతీయ సంస్కృతి|
సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి ఇదే మన భారతీయ సంస్కృతి||

త్రిమూర్తులను భక్తితో పూజించే సంస్కృతి|
నాల్గు వేదములను అనుసరించే సంస్కృతి|
పంచభూతములను సేవించే సంస్కృతి|
ఆరు ఋతువులను అనుభవించే సంస్కృతి|| || సంస్కృతి, సంస్కృతి ||

సప్త నదులను ఆరాధించే మన సంస్కృతి|
అష్ట దిక్కుల ప్రభావములు గల సంస్కృతి|
నవ గ్రహాలను ప్రార్ధించే సంస్కృతి|
దశావతారములతో పుట్టిన మన సంస్కృతి|| || సంస్కృతి, సంస్కృతి ||

కుల మత జాతి భాషా బేధాలున్నా కలిసిపోయే సంస్కృతి|
రక రకాల కళలను పాటించే సంస్కృతి|
కల కాలం భార్య భర్తలు కలిసియుండే సంస్కృతి|
తల్లి తండ్రులను , పెద్దలను గౌరవించే సంస్కృతి|| || సంస్కృతి, సంస్కృతి ||

పరదేశీయులు అనుసరించే సంస్కృతి|
విదేశాలలో పొగడ బడే సంస్కృతి|
ఈ తరతరాల సంస్కృతిని నేర్చుకుని పాటించవలసిన మన మహా భారతీయ సంస్కృతి|
పాటించవలసిన మన భారతీయ సంస్కృతి||
సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి| ఇదే మన భారతీయ సంస్కృతి|
ఇదే మన భారతీయ సంస్కృతి| ఇదే మన భారతీయ సంస్కృతి|
ఇదే మన భారతీయ సంస్కృతి| ఇదే మన భారతీయ సంస్కృతి|
ఇదే మన భారతీయ సంస్కృతి||

 


ఈ సంస్కృతి గీతం ను, స్వర సంగీత రాగాలు మరియు కదలిక చిత్రాలతో కూర్చి శ్రీమతి ఉమా కులకర్ణి గారితో గానము చేయించి "స్వర్గీయ దోముడాల సునంద" గారి పేరున సంస్కృతి పాఠశాల, అల్మాస్ గూడ, హైదరాబాద్ కు 31-12-013 రోజున అంకితం చేయబడింది.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)