సుజననీయం
సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చన్నాప్రగడ కృష్ణ

ఏమిస్తావ్ నీవు?
చెట్టుల్లన్ని కాయలిచ్చు - గుట్టలన్ని రాళ్లనిచ్చు
ఆవులన్ని పాలనిచ్చు - ఆకులన్ని నీడనిచ్చు
పసిడిభూమి పంటనిచ్చు - మబ్బులన్ని వాననిచ్చు
సూర్యుడేమో ఎండనిచ్చు - చందమామ వెన్నెలిచ్చు
పువ్వులన్ని వాసనిచ్చు - పుణ్యనదులు జలమునిచ్చు
చల్లగాలి హాయినిచ్చు - ఇంతసాయం పొంది నీవు
ఏమి ఇత్తువో తిరిగి నీవు - మంచిగ ఆలోచించి చూడు

 

పెద్ద బాలశిక్షలో పిల్లలు పాట ఇది. కాని అర్థం మాత్రం చాలా లోతైనది. 'పరోపకారార్థమిదం శరీరం' అన్న పరమార్థాన్ని బోధిస్తున్నది. ఈ పాటకు ప్రతిగా సిలికానాంధ్ర పిల్లలు స్పందించారు. సిలికానాంధ్ర కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకొన్న విషయం తెలిసిందే. అక్కడ పాఠశాలల్లోని సౌకర్యాలను మెరుగు పరచటానికి అమెరికాలోని పిల్లలు నిధులు సేకరించటానికి కొంగ్రొత్త ఆలోచనను అమలు పరిచారు. అదియే 'Skip for SKIP'. దాత ఇచ్చే ప్రతి డాలర్ కి అబ్బాయి/అమ్మాయి ఒకసారి తాడుపై ఎగిరారు. ఈ ఆటనే ఆంగ్లంలో Rope Jumping, Skipping అంటారు. విరాళానికి విరాళం, శరీరానికి వ్యాయామం, సంతోషానికి సంతోషం, తోటిపిల్లలకు చేతనైనంత సహాయం చేశామనే తృప్తి లభించాయి. ఈ నెల ముఖచిత్రంపై ఉన్న ఫోటోలు ఈ కార్యక్రమానికి సంబంధించినవే. ఈ పథకాన్ని వచ్చే నెలల్లో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోకి, ఇతర దేశాల్లొకి వ్యాప్తి చేయాల్లన్నది సిలికానాంధ్ర సంకల్పం. మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజెయ్యండి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)