కవితా స్రవంతి
సాహిత్యం - మానవత్వం
- తమిరిశ జానకి

కన్నీటికి నే తుడుపుని అవుతా
దుఃఖానికి నే భుజాన్ని అవుతా
ఆవేశానికి అడ్డంపడతా
అహం చూపితే దూరంపోతా
చిరాకుపడితే నిశ్శబ్దమవుతా
కొట్లాటకు నే విరోధినవుతా
మాటలశరాలు నీ సొమ్మయితే
మౌనభాషణం నా భూషణమంటా
హోదా గొప్ప నీదనుకుంటే
హుందాతనము నే చూపిస్తా
స్నేహానికి చేయి చాపుతా
చిరునవ్వుకి నే బదులే అవుతా
భావానికి లేవుకదా భాషా భేదాలు
సాహిత్యానికి లేవు సుదూరతీరాలు
మనిషి మనుగడకు మానవత అవసరం
తీర్చిదిద్దు వ్యక్తిత్వానికి మంచిసాహిత్యమవసరం
ఏ భాష అయినా ఏ రాష్ట్రమైనా
కావాలి మనిషికి మానసిక సౌందర్యం
అది ఇచ్చు మంచి పుస్తకసాంగత్యం
అందుకే చెప్పాలి ఎల్లవేళలా
అఖిలభారతీయభాషా సాహిత్య సమ్మేళనానికి
వందనం అభివందనం.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)