కవితా స్రవంతి
నాన్న లేని జీవితం
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

కన్నమమకారం కాటికెళ్ళిపోయింది,
అమ్మకాటుకను తనతో తీసుకొని మరీవెళ్లిపోయింది.
కన్నతండ్రి ప్రేమ నాకు కరువయ్యింది,
కంటిమీద రెప్పే బరువయ్యింది.
కంటిలోని నీరు చెరువయ్యింది,
సౌఖం ఇరుకయ్యింది,సత్యం ఎరుకయ్యింది.
బ్రతుకు బెరుకయ్యింది,
ఆహ్లాదం మరుపయ్యింది,ఆనందం మెరుపయ్యింది.
ధైర్యం ధైన్యమయ్యింది,శౌర్యం శూన్యమయ్యింది.
నాన్న ఉన్నఇంటిలో ఎంతధైర్యం!
నాన్న పక్కనుంటే ఎంతశౌర్యం!
ఎటు వెళ్ళిపోయారో,ఎక్కడని వెతకటం?
ఎందుకు వెళ్ళిపోయారో,ఎలా బ్రతకటం?
నాన్నలేని బ్రతుకు దండగ,ఇంకేదీ నాకు పండగ?


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)