1-844-626-BADI(2234)
Twitter
Youtube

సుజనరంజని

సామాన్య ప్రజానీకం క్రమంగా సాహితీ పత్రికలతోను, సాహిత్యంతోను, తనను తాను మెల్లిగా దూరం చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. కాలక్రమంలో సాహితీ పత్రికలు అంతరించి, చలామణిలో ఉన్న రాజకీయ పత్రికలలో సాహిత్యం ఏదో కొద్ది భాగంగా మిగిలి బిక్కు బిక్కుమంటూ ఉన్నది. అటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారికి సాహితీ సౌరభాలను అందించడానికి ఎన్నో ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తమైన తెలుగు సాహితీ దీప్తిని సమున్నతంగా ప్రకాశింపజేయడమే లక్ష్యంగా సాహితీ సంస్కృతుల పరిరక్షణా బాధ్యతను భుజానికెత్తుకున్న సిలికానాంధ్ర చేస్తున్న చిరు ప్రయత్నమే సుజనరంజని.

ఆశయం:

సమకాలీన తెలుగు సాహితీ రంగం సువర్ణ శోభితంగా అలరారడానికి, జనులను నిర్మాణాత్మకంగా ఆలోచింపచేస్తూ, రంజింపచేశ్తూ ఉన్నతమైన ఆదర్శయుత జీవనాన్ని పెంపొందించుకోవడానికి, సమాజ పురోగతికి దోహదం చేసే రచనలకు పెద్ద పీట వేసి ప్రోత్సహించడం.

ఈ మౌలిక అంశం అంతఃసూత్రంగా సాహిత్య-సామాజిక విషయ పరిజ్ఞానంతో, పలు దృష్టికోణాలలో విశ్లేషిస్తూ, పెక్కు భావజాలాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, సమాజం వైపు వస్తున్న ప్రతి క్రొత్తదాన్నీ విజ్ఞాన విశ్లేషణ, వివేచనా వడపోతలతో ముందుకు నడిపించగల రచనలను జన సామాన్యం దృష్టిలోకి పత్రికా ముఖంగా తీసుకురావడం.

సమాజం హితం చెడకుండా వ్యక్తిత్వ వికాసం పెంపొందించడం అన్న స్ఫూర్తితో ప్రాచీన-నవీన రీతులలో, ప్రక్రియలలోని మాధుర్యాన్ని జనులకు రుచి చూపిస్తూ తెలుగు భాషా పరివ్యాప్తికి మరింత దోహదం చేస్తూ తెలుగువారిలో సాహిత్యం చదివే అలవాటు ఇనుమడింప జేయడం.

ఈ ఆశయ సాధనకు సుజనరంజని ఎంచుకున్న ప్రధాన అంశాలు విజ్ఞానం – వినోదం – విలువలు. ఈ మూడు మూల స్థంభాల ఆధారంతో తెలుగు సాహితీ పతాక ఉన్నతంగా ఎగిరేలా అంశాలను ఏర్చికూర్చడం సంపాదక బృదం బాధ్యత. సమాజంలో వివేకం నిండిన విలువలు పెంపొందించడమే సుజనరంజని ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధనకై ప్రతి మాసమూ అంతర్జాల (ఇంటర్నెట్) పత్రికను ప్రతి మాసమూ ఆకర్షణీయంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది

సిలికానాంధ్ర. పత్రిక అంతర్జాలావాసం: