ప్రేమోపహారం

-- సంధ్యా దేవి

ఎదలోయల

ధ్వనించింది

ఒక పిలుపు

అది ఏమని

నీపై ప్రేమని

వలచి వలపించి

మురిసి మురిపించి

మనసునే ఇచ్చాను

మతిలేని నిముషాన

మంచి ముహుర్తాననిజమైనది

నా ప్రేమ

నువ్వు నమ్మినా

నమ్మకున్నా

ఏమివ్వగలను

ప్రేమోపహారంగా

గుభాళించే

కుసుమ సరాలలో

నా ప్రేమను నింపి

హారాలుగా వేయనా,

సోయగాల

ప్రమళాల

తరగలలో

నిను నింపివేయనా!!తోట గాలి

తెరలా

తొలిమబ్బురేకలా

ప్రఫుల్లతమై

నా తనూలత తేలిపోతుంది

నీ భావానంద

మధురవాహినీ

తరంగాలలో

విరహ వ్యాకులితమై

నా ఎద ఆగునేమో

నువ్వు కాదన్న

క్షణాన,

మధురవాహినీ

రసఝరిలో

తేలిపోతుంది

నా తనువు

నువు

అవునన్న నిముషాన!!!