పంచరత్నాలు

-- తల్లాప్రగడ రావు

ఇటీవల సిలికానాంధ్ర నిర్వహించిన "శతక పద్యధారా సమ్మోహనం" లో ఒక్క పూటలో శతక పద్యరచన చేసిన శ్రీ మేడసాని మోహన్ గారికి తల్లాప్రగడ రావు సమర్పించిన పంచరత్నాలుసీ.// అవధానధనదాన అనుదిన పద నద ధ్యానమందున ఈన ధన్యుడయ్యె!
మదనకథ కథన మధన విధమునందు, అవధాన ధ్యానమునందునుండు,
సావధానపుమది సదనవదనపు విధానము, ఎదల పొదల సొదలను
కదిపికుదుపు ప్రతి కదము, మోహనుడదే, విద్యాధరీపుత్ర విజయమిత్ర !తే.గీ.// అన్నమయ్యనెరింగెను భిన్నముంగ!
మంచి యాభావములను శోధించుకతడు,
పలుకు కీర్తనకీర్తుల పడగపొడవు,
ఆమడవ్వ పొగడనెలా రామచంద్ర!సీ.// ధరణైన కాదయా ధన్యము ఇంతటి పండితులందరన్ పట్టి మోయ!
ధారగ నొలికె నొందలవేల పద్యాలు, దారాలు పేనె పద్యాల తోనె !
ధారణ చేయగ తానే దిగును ఎంత బ్రహ్మయైన అపరబ్రహ్మమంచు
ధారణ బ్రహ్మము ధరనందు ఒకడేను, మేడసానికిసలాం మెడలు వంచి!తే.గీ.// పద్యభరితయాహ్లాదమే తధ్యమవగ,
హాస్యరససంభరితము యవస్యమవగ,
అచలిత లలితా విరసిత రచన చరిత,
మోహనాంగునకిటులనే మొక్కుతాము!తే.గీ.// సాహితీ నింగినాతడి సాటిలేదు,
స్వరసారస్వతీ సరస్వతి కుమార
మేడసానిమోహనొకడే కాడటయ్య
రాజ అవధాని నీకు శ్రీరామచంద్ర!