పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

ఆధారాలు :

నిలువు:

1. శచీదేవి భర్తగారి గుఱ్ఱం (4)

2. బంగారు పళ్ళెరానికైనా గోడ 'ఆసరా' అవసరం అన్నట్టు (2)

3. స్వంత ఆలోచన లేకుండా గొర్రెదాటుగా నడుచుకునేవాడు (7)

4. నరనారాయణులలో ఒకరు సృష్టించిన అప్సరస (2)

5. 'ఉపాయంగ' పైకి వెళ్ళాలి (3)

6. నమస్కరింపదగినవాడు (4)

7. జాతీయగీతంలో ఉన్న ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రం (3)

9. గెలవాలనే పట్టుదల (3)

11. దేవగాయకుడు (4)

13. దేశోపద్రవం (3)

16. బురదలో "కూరుకుపోవు" (4)

17. మచ్చలేనివాడు (5)

18. వసంతలో 'ఇవి' తిని కోకిల మధురంగా పాడుతుంది (5)

20. కాకిగూటిలో పొదిగి పెంచంబడింది. "మగదే" కాని కాకిపిల్ల కాదు (5)

22. ఒకటి నుండి పదిలోపు గల ఒక అంకె (2)

25. గంపగయ్యాళిలోనే ఉంటుంది విరోధం (2)

అడ్డం:

1. ఇదీ ఒక బంధమేకాని పశువుల కాళ్ళకు కడతారు (2)

2. గుళ్ళో దేవుడికి ఇలాగ ఉత్సవాలు చేస్తారు (7)

7. ఉన్నంతలో సహాయపడటానికి వాడుకలో ఉన్నమాట (5)

8. ప్రాణికోటి ఊపిరి ఈ"దేవుని"దయ (4)

10. అరిటాకు వెళ్ళి"ముల్లు"మీదపడ్డా నష్టపోయేది ఆకే (3)

12. దీనితో ఇల్లూ కట్టచ్చు లేక వేణువులూ చేయవచ్చు (2)

14. బొమ్మ, లేక విగ్రహం (3)

15. ఆడ తుమ్మెద (3)

17. జ్వరం వచ్చినపుడు "నోటికి హితవులేకపోవడం" (3)

19. జింక (3)

21. కుడితి, లేక బియ్యం కడిగిన నీరు (3)

22. ఆత్రం (2)

23. తోడపుట్టినవాడు (5)

24. ఆటలు ఆపేసి చదువుకోమంటే పిల్లలకి ముందు "నిద్రవచ్చు" (5)

26. రాసి ఉంటే ఎన్నిరకాలుగ "బాగు" చేద్దామన్నా కుదర్దు (2)

27. మోటారు పంపులు వచ్చాక బొత్తిగా కనుమరుగైపోయినవి (5)

ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారిని కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరిగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
సెప్టెంబరు 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత పదవిన్యాసం సమాధానాలు:జూలై మాసపు పదవిన్యాసంలో మాకు అందిన సమాధానాల్లో ఒక్కటీ పూర్తిగా సరైన సమాధానాలు ఉన్న పూరణలు అందలేదు. అందువల్ల జూలై నెల పదవిన్యాసం విజేతలుగా ఎవరినీ ప్రకటించుట లేదు.