కవితా స్రవంతి - నటేశ్వరం
మధురనాదాలు
- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ.

ప్రణవకుసుమం పరిమళించింది
భవ్యమంత్రాలు ప్రభవించాయి
'శతమానం భవతి' అంటూ
శ్రుతివీణలు పలుకుతున్నాయి
హితాలు సంహితలౌతున్నాయి
సత్తులు ఉపనిషత్తులౌతున్నాయి
అనుభవాలు ఆరణ్యకాలౌతున్నాయి
పురాణాలు మణిహారాలౌతున్నాయి
కావ్యాలన్నీ రత్నాలుగా మారుతున్నాయి
కవులందరూ కళల రవులౌతున్నారు
కవితలన్నీ పూలు చల్లినట్లు
రమణీయంగా కనబడుతున్నాయి
సాహితీకెరటాలతో
అక్షరసాగరం అందంగా కనబడుతోంది !
ఆద్యంతాలూ మధురగానం వినబడుతోంది!!

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)