జగమంత కుటుంబం
నిరంతర శ్రామికుడు - అమూల్య సంఘసేవ

గంగధర తిలక్ కాట్నం గారు ఇండియన్ రైల్వే లో 35 సంత్సరాల సుదీర్ఘ సర్వీస్ చేసి 2008 సంవత్సరములో పదవీ విరమణ పొందినారు. వారిది పశ్చిమ గోదావరి జిల్లాలోని యర్నగూడెం గ్రామము.ఒక సామాన్య రైతు కుటుంబం లో 1948 అక్టోబరు లో జన్మించినారు.

రైల్వే లో పదవీ విరమణ తర్వాత , 2010 జవవరిలో INFOTECH ENTERPRISES LTD. ( design Engineer) గా జాయిన్ అయినారు .

మొదటి రోజున తన కారు లో వెల్తుండగా, కారు చక్రం వర్షపు నీటితో నిండిన గోతిలో పడి, బురద నీరు స్కూలుకు వెళ్తున్న చిన్నారి పాప పై చింది, యూనిఫారం పాడైనది. ఆమెతో వెళ్తున్న ఆమె తల్లి పై కుడా బురద పడింది. అది చూసి కలత చెందిన తిలక్ తన కారు ఆపి క్రిందకు దిగి వారికి క్షమాపణ చెప్పి , తన ఆఫీసుకు వెళ్ళినారు. కాని, తన మనసంతా జరిగిన దానికి బాధ పడుతూనే వున్నది. ఆ సాయంత్రము ఇంటికి తిరిగి వస్తూ ఒక చోట, ఇంటిపనుల నిర్మాణము జరుగుచున్న చోట ఆగి , 6 ట్రక్కుల మట్టిని తెచ్చి పోయమని వారికి 5000/- రూపాయలు చెల్లించి , ఆ శని ఆదివారములు తాముకూడా కలసి ఇద్దరు కూళీలను పెట్టుకొని ఆ మట్టి రోడ్డులో వున్న మొత్తము సుమారు 60-70 గుంతలను పూడ్చి వేసినారు.

కొన్ని రోజుల తర్వాత LANGARHOUSE- NARSINGI రోడ్డు పై ఆఫీసుకు వెళ్తుండగా, ఆ రోడ్డు పై వున్న ఒక గుంతను తప్పించుకొనే ప్రయత్నము లో బైకు పై వెళ్తున్న ఒక యువకుడు పడిపోగా అతని కాళ్ళపై నుండి ఒక కారు వెళ్ళిపోగా , అతని రెండు కాళ్ళూ విరిగిపోయి తలకు కుడా బలమైన గాయాలు అయినాయి. మరి కొన్ని రోజుల తర్వాత అదే రోడ్డులో ఒక గొయ్యి కారణం గా ఆటోను , బస్సు గుద్ది ఒకరు చనిపోగా , ఇద్దరికి తీవ్రమైన గాయాలు తగిలినాయి . ఈ పై రెండు సందర్భాలలో కూడా , ఆ గుంతలు వలన ప్రమాదముంజరిగినట్లు వ్రాయమనని పోలీసులకు చెప్పగా అందులకు వారు సుముఖముగా లేరు.

ఈ గుంతల వలన జరుగు చున్న ప్రమాదములు చూసి చలించిన గంగాధర తిలక్ , అక్కడే రోడ్డు ప్రకన ఫుట్ పాత్ ల పై పడి వున్న తారు పెళ్ళలను తెచ్చి ఆ గోతిలో వేయగా అవి చక్కగా సెట్ అయిన విధానము గ్రహించి , ఆ రోజు నుండీ తన ఫియట్ కారు లో , పది ఖాలీ బస్తాలు పెట్టుకొని , ఫుత్ పాత్ ల పై కనిపించిన తారు పెళ్ళలను ఆ బస్తాలులో నింపుకొని , తనకు కనిపించిన ప్రతీ గుంతనూ పూడ్చము తన పనిగా పెట్టుకొని, వారంతమలో శని ఆది వారాలలో హైదరాబాదు నగరము లో రోడ్లపై గుంతలు పూడ్చు చున్నారు.

ఆ విధముగా ఒకటిన్నర సంత్సరము గుంతలు పూడ్చిన తర్వాత , తాను పూడుస్తున్న గుంతలు చాలా ప్రమాదాలను తప్పిస్తున్నాయి అని పూర్తి విశ్వాసము కలిగి , తాను చేస్తున్న సాప్టువేరు వుద్యోగము వదలి 2011 ఆగష్టు నుండి ప్రతి దినము గుంతలను పూడ్చే పని మొదలు పెట్టినారు .



మీరు 70,000/- రూపాయలు వస్తున్న వుద్యోగము ఎందులకు మానేసారు అంటే ఆయన సమాధానము:

"ఈ గుంతల వలన ప్రమాదము లో ఆ కుటుంబములో సంపాదనాపరుడైన వ్యక్తిని కోల్పోయిన చో ఈ 30 రోజులలో నేను సంపాదించిన మొత్తము ఇచ్చిన కుడా ఆ కుటుంబానిని ఆదుకొనలేము. అదే ముప్పది రోజులలో 30 పైగా గుంతలనుంపూడ్చ వచ్చును అనే ఆలోచన తో ఆ వుద్యోగము వదిలేసినాను అంటున్నారు" అదియును గాక, "ఈ గోతుల వలన కాళ్ళూ చేతులూ విరిగిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు విషయము బయటకు తెలుస్తాయి ,కానీ చాలా మంది నడుం నొప్పులు, మెడ నొప్పులు , వెన్నుపూసలు బాధలతో జీవచ్చవాలు గా బ్రతుకు వెళ్ళదీస్తూ , వైధ్యానికి లక్షలు ,లక్షలు ఖర్చు చేసినా ఫలితము లేక బాధలు అనుభవిస్తున్నారు" అందువల్ల నేను చేయగలిగిన పనిని నాశక్తికొలది చేసుకొంటూ వెళ్తున్నాను అంటున్నారు.

ఒక సంవత్సరము, ఈ విధముగా చేసుకొంటూ వెళ్ళిన తరువాత, ఫుట్ పాత్ ల పై వున్న తారు పెళ్ళలు అన్నీ తరిగిపోవటము వలన గుంతలు పూడ్చుటకు కావలసిన తారు కలిపిన మిశ్రమాన్ని రోడ్డు కాంట్రక్టరు వద్ద కొనటము మొదలుపెట్టేరు. ఆ మెటీరియల్ చాలా ఖరీదు అవటము వలన తన దగ్గర డబ్బుల హారతి కర్పూరము వలె కరగిపోయినవి. ఇబ్బంది గ్రహించిన తిలక్ గారి శ్రీమతి, వెంకటేశ్వరి గారు ఈ విషయాన్ని అమెరికా లో California "బే ఏరియాలో" ఉంటున్న తమ కుమారుడు, రవికిరణ్ కు ఫిర్యాదు చేయటము, తన నాన్నా గారితో ఆపని మానిపించాలనే నిర్ణయముతో రవికిరణ్ రావటమూ జరిగింది. గుంతలు నేను కూడా పూడుస్తాను అనే నెపముతో నాన్న గారి వెంట వెళ్ళిన రవికిరణ్ స్వయముగా ఒక ఏక్సిడెంటును చూడటము వలన తన నాన్నా గారు చేస్తున్న పనిని కొనసాగించండి అని చెప్పి , ఆ కుటుంబ పోషణ బాధ్యత తాను పూర్తిగా చుస్తున్నాడు. తిలక్ గారు తన పించను మొత్తము ఆ గుంతలు పూడ్చె పనికి ఖర్చు చేస్తునాడు .

ప్రభుత్వము చేయవలసిన పని మీ కుటుంబ భాద్యత అని ఎందుకు అనుకొంటున్నారు అంటే, తిలక్ గారి కుమారుడు రవికిరణ్ సమాధానము వినండి: " నేను నా కళ్ళ ముందే ఒక ఏక్సిడెంటు చూసేను. ఆ బైకు తో సహా ఆ పడిపోయిన వ్యక్తిని నేనే సహాయము చేసి పైకి లేపేను. చిన్న పాటి దెబ్బలు మాత్రమే తగిలినాయి. ఆ సమయములో కొందరికి పెద్ద పెద్ద దెబ్బలు కుడా తగులుతుంటాయి. ఒక పెద్ద ఆసుపత్రి కట్టించి ఆ విధముగా పడి కాలూ, చెయ్యి విరిగిన వానికి ఉచిత వైధ్యము చేయించుట కంటే ఈ గుంతలు పూడ్చుట మంచిది కదా అనే మా నాన్న గారి ఆలోచనలు నాకు కూడా నచ్చి మా కుటుంబం అంతా ఆయన వెనుకనే నడుస్తున్నాము".

ఈ విషయము తెలుసుకొన్న హైద్రాబాదు మునిసిపల్ కమీషనరు , కృష్ణ బాబు గారు గంగాధర తిలక్ చేస్తున్న శ్రమదానం పనికి కావలసిన మెటీరియల్ ను June 2012 నుండి సప్లై చెయటము మొదలు పెట్టేరు.

Jan 2010, లో మొదలు పెట్టిన తిలక్ గారు ఇప్పటి వరకూ 1132 గుంతలు పూడ్చినారు. మొదట తాను ఒక్కడే రెండున్నర సంవత్సరాలు 550 గుంతలు పూడ్చినారు. ఆ తరువాత ముఖ పుస్తకము ద్వారా పలువురికి తెలిటము వలన, పత్రికలు, TV చానల్సు ప్రచారము వలన , ఒక్కొక్కొక్కరు వచ్చి శ్రమదానం లో పాలు పంచు కొంటూ ఆ సంఖ్య నేడు వేలకు చేరింది.

తిలక్ గారి శ్రీమతి తో సహా ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఈ శ్రమదాన యజ్ఞం లో పాల్గొన్నారు. అని వర్గాల ప్రజలూ తమ హోదాలతో నిమిత్తము లేకుండా శ్రమదానం లో పాల్గొంటున్నారు. చాల NRIs కుడా తమ India trip లో శ్రమదానం లో పాలు పంచుకొని మాతృ భూమికి సేవ చేసి తరిస్తున్నారు.

తిలక్ గారి శ్రీమతి వెంకటేశ్వరి గారు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి:

"తనకు 70,000/- రూపాయలు వస్తున్న ఉద్యోగము మానేసేరని నాకు బాధకలిగలేదు. ఉద్యోగము చేసే రోజులలో కుడా ఆ డబ్బులు అనాధ శరణాలయాలకో, స్కూల్ పిల్ల పుస్తకాలకో , మొక్కలు వేయటానికో తనకు నచ్చిన దాన ధర్మాలు చేయటానికి సరిపోయేవి". "నడి వేసవిలో కుడా మిట్ట మధ్యాహ్నము ఎండల్లో నిలబడి పని చేస్తుంటే ఈ వయసులో ఆరోగ్యము పాడైపోతాదేమో అంటే పట్టించుకొనే వారు కాదు. నాకు దీనికి సంభంధించిన యంత్రాలు లేవు కదా, ఎండలో అయితే తారు అ వేడికి కరగి బాగా అతుక్కుంటుంది అని చెప్పేవారు .ఎండల్లో పని చేయటము మానిపించలేనందుకు బాధ కలుగుతుంది".

ఒక వ్యక్తి గా మొదలైన శ్రమదానం , నేడు ఒక మహశక్తిగా ఎదిగి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. మనము శత్రు దేశముగా భావించే పాకిస్తాను సైతము గంగాధర తిలక్ గారి శ్రమను గుర్తించి కొనియాడింది. దేశ విదేశాలలో మనకు తెలియని అనేక భాషలలో పత్రికలూ , రేడియోలు గంగాధర తిలక్ గారి సేవా నిరతిని బహు విధములుగా ప్రశంసిస్తున్నాయి. గంగాధర తిలక్ గారు మన తెలుగు వారు కావటం మనకు సంతోషము ,గర్వకారణం. తనకు రిటైర్మెంట్ సమయములో తన కుమారుడు కానుకలు గా ఇచ్చిన ఫియట్ కారుకు "Pothole Abulance" అని నామకరణం చేసి శ్రమదానం పనికి కావలసిన మెటీరియలు, పనిముట్లు ఆ కారులోనే రతలించు తారు. పెళ్ళికి వెళ్ళినా , పేరంటాలకు వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా , ఎక్కడైనా గుంత కనిపించగానే తన కారును, గుంత ప్రక్కన ఆపి, ఆ గుంతను పూడ్చి ముందుకు కదులుతారు.

తిలక్ గారు ఎవరి వద్దనుండీ విరాళములు స్వీకరిచకపోవటము ఆయన ప్రత్యేకత. మన దేశము లోని NGOs కి , మన దేశ నాయకులకూ ఆయన వద్ద ఒక సందేశము వున్నది.

" శ్రమదాన్ నా జన్మ హక్కు" అంటూ ముందుకు సాగుతున్న మన తెలుగు వాడు ఈ నవ తరం " బాల గంగాధర తిలక్"

మన అందరికి ఆయన సందేశము: " ప్రస్తుత కాలము లో మనము అందరమూ చాల బిజీ గా వున్న మాట వాస్తవము. అయినప్పటికీ కుడా మనము వారములో ఒక రోజు కాని, నెలలో ఒక్కరోజు కాని, సంవత్సరములో ఒక రోజు కాని శ్రమదానం లో పాల్గొంటూ మనము చేయగలిగిన , మనకు నచ్చిన మన సమాజానికి పనికి వచ్చే ఏదైనా ఒక పని చేసుకొంటూ మన దేశాన్ని ప్రపంచము లో అగ్రగామిగా నిలబెడదాము .కష్టపడి పని చేద్దాము. పని చేయని అధికారులను , నాయకులను ప్రశ్నించుదాము రండి."

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)