Sujanaranjani
           
  శీర్షికలు  
       తెలుగు తేజోమూర్తులు
 
 

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్. 

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


సంగీత విద్వాన్ ఇంద్రగంటి వెంకట లక్ష్మణ శాస్త్రి

సాంప్రదాయ సంగీతాన్ని పెంపొందించడమే ధ్యేయంగా పెట్టుకుని, కృషి చేస్తూ, సత్ఫలితాలను సాధించిన మహానుభావుడు, సంగీత విద్వాన్, కళా తపస్వి, కులపతి శ్రీ ఇంద్రగంటి వెంకట లక్ష్మణ శాస్త్రి (ఐ వి ఎల్) గారు. ముప్పై ఏళ్ళకు పైగా సంగీత జనకులం నిర్వహిస్తూ ఔత్సాహిక కళాకారులను రూపొందిస్తున్నారు. దాదాపు ఐదు వేల మంది కళాకారులు ఈ సంస్థలో సంగీతం నేర్చుకున్నారు. ఒక సారి చేరిన తరువాత మానేసిన వారు వ్వరులేరు అంటే ఎం శ్రద్ధా శక్తులతో నిర్వహిస్తున్నారో, లక్షం పట్ల ఎంత గురి ఉందో తెలుస్తోంది. తెలుగు నాట ఇలాంి సంస్థలు ఉండడం విశేషం. చాలా మందిని అబ్బుర పరచక తప్పదు!.

 

జననం, బాల్యం, ఉద్యోగం:

ఇంద్రంగంటి వెంకట లక్ష్మణ శాస్త్రి గారు మార్చ్ 25, 1927 లో ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లా నుగొల్లు లో జన్మించారు. వీరి తండ్రి శ్రీ ఇంద్రగంటి లక్ష్మినారాయణ గారు మంచి గాత్ర సంగీతజ్ఞులు, వీణా విద్వాన్ శ్రీ తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యుడు. వీరి తల్లి అన్నపూర్ణ.

మృదంగ కేశరి ..ముళ్ళపూడి లక్ష్మణ రావు శిష్యరికం చేసి మృదంగం నేర్చుకున్నారు. జిజ్ఞాసతో కంజీరా, వేణువు (ఫ్లూట్) కూడా నేర్చుకున్నారు శాస్త్రి గారు.

దక్షిణ తూర్పు రైల్వేస్ లో పనిచేసి విశ్రాం జీవిగా ఉంటూ, 1974 లో సంగీత సంస్థను నెలకొల్పారు. ఇది ఔత్సాహిక కళాకారులకు ఒక వేదిక గా మారింది. వారిలో ఉన్న ప్రజ్ఞా పాటవాలని వెలికి తీసి వెలుగులోకి తెస్తోంది; సంగీత జ్ఞానం ఆపాదిస్తోంది. సంగీత పరంపర పరివ్యాప్తి చేస్తూ వస్తోంది.

వీరి కుటుంబంలో వారంతా సంగీత కళాకారులే. వీరి సతీమణి శ్రీమతి సీతా రామాంజనేయమ్మ మంచి గాత్ర సంగీతజ్ఞులు; శాస్త్రి గారి కుమార్తెలు ..లక్ష్మి, డాక్టర్ సరస్వతి విధ్యార్ధి (ఆంధ్ర విశ్వవిద్యాలయం లో మ్యూసిక్ ఆచార్య, ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్), శారదా సుబ్రహ్మణ్యం కూడా మంచి సంగీత కళాకారులే. లక్ష్మణ శాస్త్రి గారి కుమారుడు కాళీ ప్రసాద్, మంచి కళాకారుడు (ఫ్లూటిస్ట్ ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్)

సంగీత జనకులం:

డబ్బు వ్యామోహంలేక, ఆ సిద్ధి కోసం సంగీత జనకులం నెలకొల్పారు. 1979 లో ఎక్కిరాల కృష్ణమాచార్యుల ఆశీస్సులతో ఆరంభమైన ఈ సంస్థకి కులపతిగా వ్యవహరిస్తూ యువతలో సంగీతం పట్ల అభిరుచి పెంపొందిస్తూ, ఎందరో సంగీత కళాకారులని రూపొందించి సంగీత లోకానికి అందించారు. తన వంతు కృషి ఇంకా కొనసాగిస్తున్నారు.

ఇక్కడ శిక్షణా తరగతులలో రాగ, తాళ జ్ఞానంతో పాటు, అలంకారాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, త్యాగరాజ దివ్యనామ కీర్తనలు, అన్నమయ్య, రామదా సంకీర్తనలు ఉన్నాయి.

ఒక్క గాత్రం లోనే కాక వయొలిన్, వీణ, ఫ్లూట్, మృదంగం, కంజీర నేర్పిస్తున్నారు, ఉచితముగా. ఒకటా, రెండా, ఇప్పటికి ముప్పై మూడు ఏళ్ళ పాటు ఇలా చేస్తున్నారు అంటే ఎంత వ్యయ ప్రయసలి గురైయ్యారో, వారి లక్ష సాధన, దీక్ష ఎంత ట్టివో చెప్పకనే తెలుస్తోంది. ఇప్పటికి, సుమారు ఐదు వేల విద్యార్ధులు ఈ సంస్థ నుండి వెలువడ్డారు అంటే ఆ ఘనత శ్రీ ఇంద్రగంటి లక్ష్మణ శాస్త్రి గారిదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

నెలకొకసారి సంగీత కచేరి శ్రీ రాఘవేంద్రా స్వామి మఠం (విశాఖపట్నం) లో నిర్వహిస్తూ విద్యార్ధులు, ఔత్సాహిక కళాకారులుగా రూపొందడానికి అవకా కల్పిస్తున్నారు.

సంగీతం పట్ల మమకారంతో శాస్త్రి గారి శిష్యుడు, అభిమాని డాక్టర్ వడ్డాది రమణ రావు (ప్రముఖ్య వైద్యులు) గారు, భార్య శేషగిరితో కలసి, శాస్త్రి గారి సారధ్యంలో ఏటా విశాఖపట్నంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. శాస్త్రి గారు ఐదు రోజులూ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. ఇంద్రగంటి శాస్త్రి గారికి కరహప్రియ, కాంభోజి, తోడి, కల్యాణి, శంకరాభరణం రాగాలు చాలా ఇష్టమట.

క్రీయాశీలకంగా, విభిన్న హోదాలలో సంగీతానికి తన అమూల్యమైన సేవలు అందిస్తూ వచ్చారు లక్ష్మణ శాస్త్రి గారు. వీటిలో:

సభ్యులు, సాంస్కృతిక శాఖ

అధ్యక్షుడు, సంస్కార భారతి

కార్యదర్శి, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్

సాంస్కృతిక సలహాదారు - కేంద్రీయ విద్యాలయం (విశాఖపట్నం)

పరిశీలకుడు (ఎక్జామినర్) - ఎం ఏ మ్యుసిక్, తెలుగు విశ్వవిద్యాలయం

సంస్థలు ఉన్నాయి.

 

గౌరవాలు, పురస్కారాలు:

ఇంద్రగంటి లక్ష్మణ శాస్త్రి గారు అందుకున్న గౌరవ పురస్కారాలు:

సంగీత వాచస్పతి

సంగీత ప్రవీణ

సంగీత కళా తపస్వి

పూర్ణ పురుష

సంగీతం గురించి:

ఒక్క సంగీతంలో మెళకువలే కాదు సంగీతం పూర్వోపరాలు, కాలానుగుణంగా సంగీతంలో చోటు చేసుకున్న మార్పులు తెలియజేయేస్తున్నారు. ఇలా చేయడంతో సంగీతం పట్ల అవగాహన కల్పించడమేకాక, అభిరుచి పెంపొందించడానికి కారణ హేతువవుతుంది.

సంగీతం గురించి అనేక విషయాలు తెలియపరిచారు. ఉదాహరణకి సమగాన లో ఏడు భక్తులు ..వాటిలో ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేశారు. వీటిని హిమకర (3 అక్షరాలు); ఆది (2); ఉపద్రవ (4); ప్రస్తావ (3); ఉద్గిత (3); నిధన (3); ప్రతిహార (4) గా నిశిదీకరించారు.

భక్తి ఆధారంగా, వరు పాడేదీ, ఏ క్రమంలో పాడేదీ, ఏ వర్గము ముందుగానే నిర్ణయించవచ్చు. హిమకర భక్తి ౠత్వికులు అందరు పూజాస్థలి సంప్రోక్షణకు పాడేవారని ఉదాహరించారు శాస్త్రి గారు.

ౠగ్, యజుర్ వేదాలలో అనుదాత్తం, స్పరితం, ఉదాత్తం అని మూడు స్వరాలు ఉన్నాయి. సమగానంలో ఏడు స్వరాలు ఉంటాయి; అవి మ గ రి స ని ద ప అవరోహణం క్రమం బట్టి ఉపయోగిస్తారు.

వీణలలో అనేక రకాలు ఉండేవని, అవి ఏకతార, చిత్ర వీణ, విపంచి వీణ, ఫణి వీణ, కర్కరి వీణ గా పరిగణించేవారని తెలిపారు. పర్కషన్ వాయిధ్యాలలో - మ్రుదంగం, దుంధుభి, భూమి దుంధుభి, డమరుకం ఇత్యాధులు ఉండేవని తెలిపారు.

ఇలా, నిగూడ శబ్దార్ధ లబ్దలు విశిధీకరించారు. ఇది శాస్త్రి గారి పాండిత్యానికి నిదర్శనం. అంతే కాదు, అందరికి సులువుగా అర్ధమయ్యేడట్టు విపుళీకరించారు ఏ వి ఎల్ శాస్త్రి గారు. ఇక్కడ నొక్కి వక్కాణించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటి అంటే కాలాణుగుణముగా సంగీతంలో వచ్చిన మార్పులను సవిస్తారంగా తెలుసుకోవటమే కాక వాటిని సులువుగా వ్యక్త పరిచారు శాస్త్రి గారు. అది వారికే చెల్లింది. ఎందుకంటే వారి సంగీతానుభవాన్ని క్రోడీకరించి ఆ విషయాలను, సూక్ష్మాలను, నిగూడార్ధలను జనాలకి సులువు చేశారు. చదివిన వారూ, విన్న వారు సంగీతం పట్ల ప్రభావితం కాక తప్పదు.

వయసుతో నిమిత్తం లేకండా తన సంగీత సాధన చేస్తూ వస్తున్నారు శ్రీ లక్ష్మణ శాస్త్రి గారు. సంప్రదాయ సంగీతాన్ని దిగ్ దిగంతాలు పరివ్యాప్తి చేయడానికి తన అవిరళ కృషి కొనసాగిస్తున్నారు. వేల మందికి సంగీత పట్ల అభిరుచి పెంపొందించి, అనేక కళాకారులను రూపొందించి సంగీత లోకాని అందిస్తున్న నిస్వార్ధ జీవి.

సంగీత జనకులం మొదలైనది లగాయితూ ఒక్క విద్యార్ధి కూడా సంగీతం నేర్చుకోవడం మానలేదు అంటే నిర్వహిస్తున్న వారి శ్రద్ధాశక్తులు, అభిరుచి ఎంత గొప్పవో చెప్పకనే చెబుతున్నాయి. తెలుగు నాట ఇలాటి సంస్థలు నడుస్తున్నందుకు అందరూ గర్వ పడాలి. ఇంద్రగంటి వెంకట లక్ష్మణ శాస్త్రి గారి జీవితం అందరికీ చక్కటి ఉదాహరణ. తెలుగు నాట ఇంకా ఇలాటి ఆణి ముత్యాలు దొరలుతాయి అని ఆశిద్దాం.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech