Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 2

విషయ పరిజ్ఞానాన్ని అందించిన పి. చంద్ అటవీ ప్రాంత కధలు

 

                                                                - పరిచయకర్త:  శైలజామిత్ర

 

 
   

పారిశ్రామిక విప్లవం క్రీ. శ. 1750 సంవత్సరంలో వేగవంతమయ్యింది. కాని భారత దేశం నుండి 1810 దాక చేతివృత్తుల, కుటీర పరిశ్రమల నుండి ఇతర దేశాలకు సరుకులు ఎగుమతి అవుతూ వచ్చాయి. ఈస్ట్ ఇండియా కంపెనీలు, బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేకంగా వారి మార్కెట్లను విస్తరింపచేసుకోవడంలో చేతి వృత్తులు మూల పడ్డాయి. కూటి కోసం కూలీలుగా, కార్మికులుగా మారవలసి వచ్చింది. రోడ్డు రైలు మార్గాల నిర్మాణాలకు కూలీలుగా, సముద్రపు ఓడరేవుల వద్ద సరుకులు దించి ఎక్కించే శ్రమ జీవన కేతనాలు అయ్యారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు తమ తమ వృత్తులు కోల్పోయి నగరాల్లో కార్మికులుగా చేరిపోయారు. కార్మిక వర్గ నాయకత్వం వీరినుండే ఎదగాల్సి వచ్చింది. ఇలా తర తరాలు తెలంగాణ ప్రాంత చేతివృత్తి కులాలు తమ వలసల ద్వారా ఆధునిక కార్మిక వర్గ చైతన్యంతో ముందుకు కదిలారు. గ్రామాలను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించారు

          పి. చంద్ అచ్చమయిన కార్మిక వర్గ రచయిత. కార్మికుల కష్టాలను, కడగండ్లను కళ్ళకు కట్టినట్లు చూపి రచించిన తీరు ఎంతో అభినందించ దగినది. ఒక విధంగా పి. చంద్ జీవితానికి మరోవైపు సాహిత్యానికి ఒక రకంగా చారిత్రిక ప్రయోజనం ఏర్పడింది. కాదల సంపుటిలో ప్రతి కధలో వస్తు వైవిధ్యం, శిల్ప వైవిధ్యం, ఉన్నాయి. ఎన్నికలు జరిగే విధానం నేడు మనందరికీ చాలా వరకు అవగతం అయ్యాయనే అనుకుంటున్నాం కాని బ్యాలెట్ బాక్స్ లు పేపర్లు ఎలా వెళతాయో వీరి ప్రజాస్వామ్యం కధలో నేపధ్యం, ఎన్నికల కోసం జోనల్ కేంద్రం నుండి అక్కడి సామాన్లన్నీ సంచుల్లోకి సర్దుకొని లారీలో ఎన్నికల అధికారులు కలిసి బయలుదేరడంలో ప్రారంభమయిన కధ మారు మూల ప్రాంతాల్లో కూడా ప్రజల ఓటు హక్కును భారత రాజ్యాంగం ఎలా వినియోగించుకుంటుందో, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎంతగా కృషి చేస్తాయో తెలిపినా ప్రజలు ఓట్లు వేయడానికి ముందుకు రారు. మొత్తానికి పోలీసు సహకారంతో బ్యాలట్ భాక్స్ లతో సహా తిరుగు ప్రయాణం అవ్వడం కధలోని ఇతివృత్తం

            రచయిత ప్రతి కధలో పాటకులకు ఏంటో విజ్ఞానాన్ని అందచేసారు. ప్రతి కధా ఒక ప్రత్యేక వస్తువుని కలిగి అందరికీ విషయ పరిజ్ఞానాన్ని పెంపోదిస్తుంది. ఒకనాడు ఎన్ టి రామారావు ౧౯౮౪-౮౯ వరకు కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చి ఒకవైపు జీవాలను జో కొట్టినా మరో వైపు మాత్రం బలహీన వర్గాల జీవితాలతో ఎంతగా ఆడుకున్నారో అనేది సన్నజీవాల కధ ద్వారా మనకు తెలియజేసారు. సత్యం అనే ఉద్యమ కారుని జైల్లో పెట్టి నానా చిత్ర హింసలు పెట్టి చివరకు సత్యం తల్లి తండ్రులు నానా తిప్పలు పది బెయిల్ కు ప్రయత్నించి బయటకు తీసుకుని వస్తే బయటకు రాగానే అక్కడి పోలీసులు సత్యం ను తీసుకుని ఎక్కడికి వెళ్ళారో ఏమి చేసారో తెలియని సందిగ్ధత నెలకొంది. ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు వందమంది దాకా విప్లవ కార్య కర్తలను, మిలిటెంట్లను, అరెస్టు చేసి బెయిల్ ఇచ్చినట్లే ఇచ్చి మాయం చేసారు. కనీసం ఎన్కౌంటర్ లో చనిపోయిన జాబితాలో కూడా వీరి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇలా మాయమయిన వారి గురించి తల్లి తండ్రుల వేదన గురించి వివరించిన కధే సన్న జీవుల కధ. ఓటు వేసి గెలిపించే పార్టీ అయినా ఎన్కౌంటర్ పేరిట హత్య చేసే నాయకులేనని వారి చరిత్రలను కధ రుజువు చేసింది. ఒక విధంగా కంట తడి పెట్టించింది. ఆకలి నుండి ఆవేశం వరకు ఎందుకు వస్తుందో అనేది తెలియజేసింది

          ఫారెస్ట్ ఆఫీసుర్ల పేరున అడవిని కాపాడతామని అధికారులు రావడం సగానికి సగం అడవిని కాజేయడం అలవారుగా ఎలా మారిందో గ్రంధం పేరుగల "గుమ్మస్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు" అనే కధ నేపధ్యం. రాష్ట్రంలో ఎక్కడ ఫారెస్ట్ ఆఫీసుర్లు ప్రవేశిస్తే అక్కడ అడవే మాయమవుతు వచ్చింది. అందులోని పాత్ర లింగాన్నకు అనుమానం కలుగుతుంది. తమ భూములు లాక్కుని ప్లాంటేషన్ పెట్టి స్వతంత్రంగా బతికిన వారిని కూలీలుగా మార్చడం వలన ఆదివాసులు ఎంతగా భాధ పడ్డారు? తర్వాత ఏమి చేసారో ఫారెస్ట్ అధికారుల అహంకారం ఎలా ఉంటుందో అనేది వివరించిన తీరులో రచయిత ఎంతో కృతకృత్యు లయ్యారు. ఆవేదన నేపధ్యంలో రచించిన కధలు ఎందరినో ఆలోచింప జేస్తాయి. కధలన్నీ వాస్తవ సంఘటనల సారాంశా లే ! విషయం ఏదో తెలియక జరిగిందని ఇందులు ఇయా జరిగందో అనుకునే వారిని ఎంతో విషయ పరిజ్ఞానాన్ని అందిస్తాయి.

            దేశాన్ని పట్టి పీడించే మరొక సమస్య సింగరేణి బొగ్గు గనులకు సంభందించినది. వెన్ కాస్టె గనుల వలన ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలోని భుమ్లు, అణుబాంబులు పడిన హీరో షీమ, నాగసాకి ప్రాంతాలకన్నా హీనంగా, దారుణంగా శతాబ్దాల తరబడి మరు భూములుగా ఎలా మారుతున్నాయో అనే నేపధ్యం పై భూమి పుత్రులు కధ రచించి సేవ చేసారు.

              ఇక అమ్మ అనే పాత్ర భూమిపైనే ఉద్దత్త మయినది అనడానికి వేరే పదాలు లేవు. కాని ఉద్యమ కారున్ల్ని కన్న తల్లులు తమ బిడ్డలని ఎలా కాపాడుకుంటారో, ఎందుకు అప్పగిస్తారో అనే విషయం అవ్వరికి అంతు పట్టదు. నా బిడ్డ అనే ఒక్క మాటలో సమస్త ప్రపంచాన్ని చూసుకుంటున్నా వీరికి వచ్చే  ఆలోచనలు ఎంతవరకు నిలబడతాయి. కాకుంటే జీవితం చెప్పుకోవడానికి చిన్నది. వినడానికి పెద్దది. ఉద్యంమం లో నిర్వహిస్తున్న అమ్మ పాత్రను అమ్మ కాషలో వివరించిన తీరు హృద్యంగా ఉంది

              గ్రంధంలో ఉన్న పన్నెండు కధలలో ఒక్కో కధా ఒక్కో ప్రపంచాన్ని చూపించాయి.వాస్తవ సంఘటనలకు ఆధారంగా తీర్చి దిద్దిన సంపుటి ఎప్పడికి సాహిత్య చరిత్రలో నిలిచిపోతుంది. రచయిత యాదగిరి పేరన్నా తన కలం పేరు మార్చడం మూలంగా తగినంత గుర్తింపు రాలేదని అనుకున్నా, వీరి కలం ఎప్పుడూ సమాజం దిశగా ప్రయాణించాలని కోరుకుంటున్నాను.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech