Sujanaranjani
           
  శీర్షికలు  
       మాస ఫలాలు
 

- రచన : బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి  విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు        

 

బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు వైదిక కుటుంబములో జన్మించి తన తండ్రిగారైన శ్రీ సుబ్బరామయ్య గారి వద్ద తొలిపలుకులు ప్రారంభించి, కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయమున పూజ్య గురుదేవులు శ్రీపాద భట్ గారి వద్ద సిద్ధాంత జ్యోతిషమును అభ్యసించి, తెలుగు విశ్వ విద్యాలయము నందు ఫలిత జ్యోతిషము నందు ఉత్తీర్ణులై గత పుష్కర కాలముగా ఆంధ్ర దేశమున జ్యోతిష పరమైన ముహూర్త, జాతక, సాముద్రిక మరియు వాస్తు శాస్త్ర సేవలందించుచున్నారు .వీరు ప్రస్తుతము కాలిఫోర్నియా ఫ్రీమాంటు హిందూ దేవాలయంలో అర్చకులుగా సేవలను అందిస్తున్నారు.

   

 

 

            మేషరాశి

అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు , కృత్తిక 1 వ పాదము


ఈ రాశి వారికి ఈ మాసం లో వ్యాపారం లో సామాన్య ధన లాభం కలుగుతుంది. ఋణాలు వసూలు అవుతాయి. స్త్రీ మూలకంగా సమస్యలు తలెత్తుతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. భార్యా భర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. వృత్తి  యందు కీర్తి లభిస్తుంది. ఈ మాస ప్రారంభంలో విద్యా, వివాహ విషయాలలో సమస్యలకు అవకాశం. మాసం మధ్యలో గృహంలో అశాంతిగా  ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. మాసాంత్యంలో బుద్ధి  చాంచల్యం, కోర్టు వ్యవహారములతో  ఇబ్బందిగా  ఉంటుంది .

   
 

వృషభరాశి

కృత్తిక  2 ,3 ,4  పాదములు,  రోహిణి    4 పాదములు ,  మృగశిర    1  ,  2   పాదములు 

 
ఈ  రాశి వారికి ఈ మాసం లో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది .ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు మానుకొనుట మంచిది .ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.సహోద్యోగులతో జాగ్రత్త అవసరం. నూతన కార్యక్రమాలు చేపడతారు. మాస ప్రారంభంలో ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపార లాభము, ఉద్యోగాభివృద్ధి. మాసం మధ్యలో వాహనయోగము, ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో తనకన్నా తక్కువ వారితో కలహములు వచ్చుటకు అవకాశం ఉన్నది.యత్న కార్యసిద్ధి కలుగుతుంది.
ఈ రాశి వారు రాహు - కేతు    పూజలు చేయుట మంచిది .

 
   
 

మిథునరాశి

మృగశిర 3 ,4  పాదములు,  ఆరుద్ర  4 పాదములు , పునర్వసు  1 , 2 ,3   పాదములు 


ఈ రాశి వారికి ఈ మాసంలో కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోపం అధికంగా ఉంటుంది. ఫై అధికారుల వత్తిడి అధికంగా ఉంటుంది. జాయింటు వ్యవహారాలలో సమస్యలు వచ్చిననూ చివరికి అధిగమించగలరు.అనవసరపు ఖర్చుఎక్కువగా ఉంటుంది. మాసం ప్రారంభంలో ధన లాభాలు, విద్యా, వినోదాలతో సంతోషంగా ఉంటారు. మాసం మధ్యలో శుభకార్య లాభము,యత్నకార్యసిద్ది. మాసాంత్యంలో  సంతాన సౌఖ్యం, అధికార ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.                  
 ఈ రాశి వారు సద్గురు పూజలు, పారాయణం  చేయుట మంచిది

   
 

కర్కాటక రాశి

పునర్వసు  4  వ  పాదము, పుష్యమి  4 పాదములు , ఆశ్లేష  4 పాదములు

 

ఈ రాశి వారికి   ఈ మాసంలో వృత్తి, ఉద్యోగాల యందు చికాకులు రావచ్చును. దొంగల వలన భయం కలగవచ్చును. వ్యసనాలకోసం వృద్ధాగా  ఖర్చు చేస్తారు. నీచులతో, దుర్మార్గులతో కలహాలు ఏర్పడుతాయి. మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. మాస ప్రారంభంలో వ్యవహారాలలో జయము, ధన లాభాలు కలుగుతాయి. మాసం మధ్యలో వృత్తి యందు తోటి ఉద్యోగస్తులతో కలహాలు ఉన్ననూ అధికారుల చేత ప్రశంసలు పొందుతారు. మాసాంత్యంలో దాంపత్య సౌఖ్యం, సంఘ గౌరవము, వృతి చికాకు, స్వల్ప ధనలాభం కలుగుతాయి .
ఈ రాశి వారు రుద్రాభిషేకాలు, శని శాంతి  చేయుట మంచిది.

 

   
 

సింహరాశి

మఖ  4 పాదములు,  పుబ్బ   4 పాదములు, ఉత్తర    1 వ  పాదము

ఈ రాశి వారు ఈ మాసంలో ఆరోగ్య దృష్ట్యా వైద్యాలయాలకు వెళ్ళవలిసి ఉంటుంది. వృత్తి విద్యల యందు శుభ పరిణామాలు ఉండును. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడును తద్వారా ఆర్ధికాభివృద్ధి కలుగును. పెద్దల సహకారం తో నిల్వఉన్న పనులలో జయము కలుగును. మాస ప్రారంభంలో సకల కార్యాలయందు జయము కలుగును. ఆర్యోగ్య విషయంలో కొంచం జాగ్రత్త అవసరం. మాసం మధ్యలో సామాన్య లాభాలు, ఉద్యోగమూ నందు ఉన్నత పదవులు కలుగును. మాసం చివరలో బంధు మిత్రుల కలహములు, జాయింటు సమస్యలు కలుగుటకు అవకాశం ఉన్నది.  
ఈ రాశి వారు సూర్య నమస్కారాలు, విష్ణు  పూజలు చేయుట మంచిది.
 

   
 

కన్యా రాశి

ఉత్తర   2 ,3 ,4  పాదములు, హస్త   4 పాదములు ,  చిత్త  1  ,  2   పాదములు 

 

ఈ రాశి వారికి ఈ మాసంలో కొద్దిపాటి లాభాలు వస్తాయి. వ్యాపారంలో అందోళనలు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలిసి ఉంటుంది. రాత్రులయందు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ద్విచక్ర వాహనాల  ప్రయాణంలో  కూడా  చాల జాగ్రత్తఅవసరం. మాస ప్రారంభంలో ధార్మిక చింతన, వ్యాపారము నందు ధన లాభములు ఉంటాయి. మాస మధ్య మందు కుటుంబ కలహాలు, స్ర్తీ మూలక సమస్యలు ఉంటాయి. మాసాంత్యంలో విదేశీ ప్రయాణాలు, గృహలాభం, శుభకార్యాలు చేస్తారు. మనసులో భయం ఉంటుంది .          
ఈ రాశి వారు శనివారం  మహావిష్ణు   పూజలు చేయుట మంచిది.
 
  

   
 

తులారాశి

చిత్త  3 ,4  పాదములు, స్వాతి   4 పాదములు , విశాఖ   1 ,  2,3  పాదములు 

ఈ రాశి వారికి ఉద్యోగంలో గాని ,వ్యాపారంలో గాని మార్పులు వస్తాయి.ఇబ్బంది కరమైన వార్తలు వింటారు.అనవసరమైన వాటి కోసం పరుగులు తీస్తారు.మాస ప్రారంభంలో దైవచింతన ,సుఖము ,ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం.మాసం మధ్యలో మీ గౌరవమునకు సంభందించి జాగ్రత్త వహించాలిసి ఉంటుంది.స్వల్ప ధన లాభం కలుగును.మాసాంత్యంలో ఉద్యోగంలో వ్యతిరేకత ,మాసిక వ్యధ ,జాయింటు వ్యాపారంలో గొడవలు వచ్చుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు శనివారం నాడు శనైశ్చరునుకి తైలాభిషేకాలు చేయుట మంచిది.

  

   
 

వృశ్చికరాశి

విశాఖ  4  వ  పాదము, అనూరాధ   4 పాదములు , జ్యేష్ట   4 పాదములు

ఈ రాశి వారు   ఈ మాసంలో ప్రతీ వ్యవహారంలో ఆచితూచి నడుచుట మంచిది. నేత్ర సంబంధ బాధలు వచ్చుటకు అవకాశం ఎక్కువుగా ఉన్నది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తారు. పెద్దలు,స్త్రీల పట్ల మర్యాదగా నడుచుకొనుట మంచిది. ఉద్యోగంలో కొంత మార్పులు సంభవిస్తాయి. మాస ప్రారంభంలో నేత్ర,ఉదర సంబంధించి బాధలు,కోర్టు వ్యవహారములు,వ్యాపార సమస్యలు ఉన్ననూ ధన లాభంగా ఉండును.మాసం  మధ్యలో మానసిక ఆనందము,గృహ సౌఖ్యము,ధన ప్రాప్తి కలుగును.మాసం చివరిలో వివాహ,విద్యా సమస్యలు,అధికార సందర్శనము కలుగును .                
ఈ రాశి  వారు రాహువుకి జప హోమాదులు   చేయుట మంచిది .
 

   
 

ధనూరాశి

మూల  4 పాదములు,  పూ.షా   4 పాదములు,  ఉ.షా    1 వ  పాదము

ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. ఆర్ధిక ప్రణాళికలు మెరుగ్గా ఉంటాయి. శ్రమకు తగ్గా ప్రతిఫలం లభిస్తుంది. గృహ నిర్మాణాల పనులు అనుకూలిస్తాయి. కొన్ని పనులలో రహస్య సమాచారాని సేకరిస్తారు. వ్యాపారంలో లావాదేవీలు మీ అదుపులోనే ఉంచుకోండి. మాస ప్రారంభంలో వ్యాపారమునందు ధన లాభాదులు, పుణ్యకార్యాదులు చేయుదురు.విద్యా భంగము, వృత్తి యందు ఋణములు ఏర్పడును. మాసం మధ్యలో విద్యార్ధులకు అధిక శ్రమ అవసరం. అనుకొన్న కార్యాలలో జయం కలుగును.సాహసయాత్రలు చేయుదురు.మాసాంత్యంలో విదేశీ ప్రయాణములు,బంధు మిత్రులను  కలుసుకొనుట జరుగును.       
 ఈ రాశి వారు గురువారం అయ్యప్ప స్వామి   పూజలు  చేయుట మంచిది .
 

   
 

మకరరాశి

ఉ.షా  2 ,3 ,4  పాదములు, శ్రవణం   4 పాదములు , ధనిష్ఠ    1  ,  2   పాదములు 

ఈ  రాశి వారికి ఈ మాసం యందు స్వజనుల వలన కొన్ని అనుకోని ఇబ్బందులు కలుగుతాయి.ఎవరితో  ఏది మాట్లాడిన పెద్ద సమస్యగా మారుతుంది.కష్టకాలం మొదలైనట్టుగా  ఉంటుంది.మీ యొక్క కీర్తిని పతనము చేయుటకు కొంతమంది కనిపెట్టుకొని ఉంటారు.ధర్మనిరతి తెలుసుకొని నిదానంగా పనులు చేసుకొనుట మంచిది.మాస ప్రారంభంలో శుభ కార్య ప్రాప్తి ,ఉద్యోగులకు ధన లాభాదులు కలుగుతాయి.మాస మధ్యమందు కుటుంబ సమస్యలు, జాయింటు వ్యాపారంలో వైరములు తలెత్తును.మాసాంత్యంలో శారీరక బాధ, ఋణ బాధ, అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది . 
ఈ రాశి వారు శివ  పూజలు చేయుట మంచిది.
 

   
 

కుంభరాశి

ధనిష్ఠ     3 ,4  పాదములు, శతభిషం   4 పాదములు ,  పూ.భా   1  ,  2 ,3  పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసం లో గత మాసం కంటే వ్యాపారంలో లాభాలు వచ్చుటకు  అవకాశం ఉన్నది. ఉద్యోగంలో మార్పులు వచ్చును. కొన్నిసమయాలలో వృత్తి యందు ప్రమాదాలు వచ్చుటకు అవకాశం ఉన్నది. మిషనరీ వర్క్స్ వారికి ప్రమాదాలు జరుగుటకు అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ మాసం లో నష్ట సూచనలు అధికంగా ఉన్నవి.మాస ప్రారంభంలో ఆరోగ్యలోపం, ఆపదలు,కొన్ని ఇబ్బంది కరమైన వార్తలు వినవలిసి వచ్చును. మాసం మధ్యలో స్త్రీ లచే బాధలు, అధికారప్రాప్తి, శత్రు బాధలు కలుగును. మాసాంత్యంలో స్థాన చలనము,ఉద్యోగ విరోధములు ఏర్పడుటకు అవకాశం ఉన్నది.  
ఈ రాశి వారు ఆరోగ్యం కోసం మంగళవారం అంగారక,,సుబ్రమణ్య స్వామికి  అర్చనలు  ,పూజలు చేయవలెను.
 

   
 

మీనరాశి

పూ.భా    4  వ  పాదము, ఉ.భా   4 పాదములు ,  రేవతి   4 పాదములు 

ఈ రాశి వారు ఈ మాసంలో క్రిమినల్ కేసుల వలన చికాకుగా ఉండును. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా ఉండును.  రావలిసిన ధనం వచ్చును. రాజకీయ వాదములు ప్రారంభమగును. రాజకీయ జనులతో మిత్రత్వం కుదురును. ధనాదాయం విషయంలో మిశ్రమ ఫలితాలు వచ్చును. మాస ప్రారంభంలో వ్యాపారము యందు సామాన్య లాభాలు,మానసిక బాధలు మనఃక్లేషములు కలుగుటకు అవకాశం ఉన్నది. మాసం మధ్యలో అధికారుల వత్తిడి,ఋణ బాధలు,గౌరవ మర్యాదలు,ధన హానీ కలుగుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో ధనాదాయము,వివాహప్రాప్తి,వాహన యోగము,దాంపత్య సుఖము కలుగుటకు అవకాశం ఉన్నది.   
ఈ రాశి వారు రుద్రాభిషేకాలు  చేయుట మంచిది.
 

 

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech