Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  రహ దారు(ణా) లు
 

- రచన :  సింహాద్రి జ్యోతిర్మయి

 
   

నరకానికి తెరిచిన వాకిలి

నల్లని తారు రోడ్డు 

సజావుగా సాగుతున్న ప్రయాణంలో 

బ్రతుకునావను కబళించే 

మృత్యు కెరటం - ప్రమాదం 

ఒక నిర్లక్ష్యం 

ఒక ఏమరపాటు 

ఒక కునికిపాటు 

ఒక తొందరపాటు 

ఒక భాధ్యతారాహిత్యం 

కారణమేదైనా కానీ 

అది సామూహిక మరణాల స్మశాన వీధి

అక్కడ రెప్ప పాటులో 

తలరాతలు మారతాయి 

విధి విసిరిన ఇనుప పంజాలో చిక్కి 

ఆర్తనాదాలు అంతిమ శ్వాసలు విడుస్తాయి 

చిద్రమైన  దేహాలు 

రక్తమాంస ఖండాల 

భీతావహ దృశ్యాలు 

అయిన వారికి ఆచూకీ దొరకని 

అనాధ శవాలు

జీవితం క్షణికమన్న సత్యాన్ని 

నిరూపించే నిదర్శనాలు 

అది మరుభూమికి మరో రూపం 

శవాల సాక్షిగా 

మాంగల్యాలు  తెగి పడతాయి 

ఆశల దీపాలు ఆరిపోతాయి 

బాల్యాలు అనాధలవుతాయి 

వృద్దాప్యాలు  జీవచ్చవాలవుతాయి 

అక్కడ వేదనా స్వరం విన్నా 

కలచి వేసే కన్నీటి గాధలు 

ఇన్ని గుండె కోతలనూ తనలో 

ఇముడ్చుకున్న రహదారి 

సాగిపోయే వాహనాల పాదాలకు

మిగిలిపోయిన రక్తపు మరకలంటించి 

మలినాన్ని కడుక్కుంటుంది

నల్లబడ్డ మొహంతో 

మౌన సాక్ష్యం లా నిలుస్తుంది

ఆప్తులను జ్ఞాపకాల అంపశయ్యపై 

నిర్దాక్షిణ్యం గా విడిచి 

మరణ శాసనాలు రాసే 

మధ్యంతర ముగింపులో 

నేరమెవరిది శిక్షలెవరికి
 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 






సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech