Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  ఎందరో జీవులు
 

రచన:  రమాకాంతరావు చాకలకొండ

 
 

పల్లవి : ఎందరో జీవులు పుట్టెదరు పోయెదరు,
కొందరే కీర్తితో వాసికెక్కుదురు   ||ఎందరో ||

అనుపల్లవి : నామ ధేయము లోన చిన సత్యమే గాని,
అమోఘ నాట్యమున అతి దొడ్డ వీరు  ||ఎందరో ||

1. కూచిపూడి గ్రామ చంద్రులై ఉదయించి,
అచలిత దీక్షతో అంకిత భావనతో,
కాచి వడబోసి నాట్య శాస్త్రము నేర్చి
స్వఛ్ఛముగ వెలిగెడి సుర నాట్యబ్రహ్మలు  ||ఎందరో ||

2. కూచిపూడి కళపై కుంచెను తిప్పి
అచ్చెరువు గొల్పెడి అద్భుత కల్పనతో
విచిత్ర ప్రతిభతో దివ్య చిత్రము గీయు
శోచింప జాలని చిత్రకారులు వీరు  ||ఎందరో ||

3. లక్ష్మీనారాయణ శిష్యులై ఎదగి
పక్షి వాహనునిపై నాట్య రచనలు చేసి
శిక్షణాలయము సంస్థాపన చేసి
దీక్షగ శారదను కొలచిన ఘనులు  ||ఎందరో ||

4. పట్టుదలకు వీరు పెట్టినది పేరు
గట్టి నిర్ణయముతో పాద యాత్ర చేసి
నాట్య సేవకై నడచి చెన్న పురికేగిన
దీటు దివ్యాత్మలు వెంపటివారు  ||ఎందరో ||

5. నాట్య సాగరమునే ఔపాసనపట్టి
మేటి కూచిపూడి పేరు నిలబెట్టి
సాటి వారి తోటి సత్కారములు పొంది,
దీటుగ వెలిగిన దివ్య మూర్తులు మీరు ||ఎందరో ||

6. శారద పుత్రులను సుమ కళా ద్రష్టలు
సరస నాట్య శాస్త్ర ప్రతిభావంతులు
నేరి, జ్ఞాన సూరి, నిష్ణాత గురువులు
వీరి సాటి ఎవరు ఆచార్య పుంగవులు?

||ఎందరో ||

7. సంగీత, సాహిత్య, నృత్య, నాట్య శాస్త్ర
పొంగారు జ్ఞానులు, ప్రతిభావంతులు
జంగమయ్యకు ప్రియులు, జగములో ఘనులు
మంగనాథుని మది గెలచెడి ధీరులు  ||ఎందరో ||

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 





సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech