Sujanaranjani
           
  కథా భారతి  
 

ఒక కుర్రాడు -- ఆలోచన

 

 

                                                                         రచన:పి. బాలు

 

 

ఆ రోజు శుక్రవారం, సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలు అయుంటుంది. ప్రక్కనే ఉన్న ATM లో డబ్బులు డ్రా చేసుకుని నల్లటి బ్యాగుతో కొయంబత్తూర్ రైల్వే స్టేషన్లోకి అడుగు పెట్టాడు ఓ పాతికేళ్ళ కుర్రాడు. వచ్చీ, పోఏ, ప్యాసెంజర్స్ తో పవర్ స్టార్ సినిమాకి మొదటి రోజు గుమి కూడిన జన త్సునామిలా ఉంది ఆ ప్రదేశం. చిన్నగా బుజాన ఉన్న బ్యాగుని సరి చేసుకుంటూ, ఒక్కోకరిని తప్పుకుంటూ ఒకటో నెంబెర్ ప్లాట్ఫారంకి చేరాడు. అప్పటికి సమయం ఐదు గంటల పది హేను నిమిషాలు అయింది. తాను వెళ్ళాళ్సిన రైలు ఇంకా రాకపొవడంతో, ప్రక్కనే ఉన్న బుకింగ్ హోతంకి వెళ్ళి, షాపు అంతా చూసి చివరికి ఈనాడు పేపర్ తీసుకుని వెళుతూ, వెళుతూ కేప్ ముంబాయ్ ఎక్ష్ప్రెస్స్ ఒకటో నెంబర్ ప్లాట్ఫర్మే కదా, అని అడిగాడు షాపు యజమానిని ! ఆమ ! అన్నాడు ఆ షాపు యజమాని. పేపర్ తీసుకుని ప్రక్కనే ఉన్న కుర్చీ వరుస లో ఒక కుర్చీ కాలిగా ఉండడం చూసి అటు వెళ్ళగా, ఎవడు ఈడు, తెలుగు పేపర్ పట్టున్న మోడెర్న్ ప్రబుద్ధుడు అన్నట్లుగా చూసాడు ప్రక్క కుర్చీలో ఉన్న అతను. అది గమనించిన ఆ కుర్రాడు జాలిగా అతని వైపు చూసి కాళీగా ఉన్న ఆ కుర్చీ లో కూర్చుని, తెచ్చుకున్న పేపెర్ చదవడం మొదలెట్టాడు.

ప్రపంచంలో కొత్త కొత్త విషయాలన్నీ ఇక్కడే చూస్తున్నట్లు, ఆ పేపర్ చదవడంలో లీనమయి పోగా, దయచేసి వినండి ట్రైన్ నెంబర్ 16382 కన్యాకుమారి నుండి ముంబై వెళ్ళవలసిన కేప్ ముంబాయ్ ఎక్ష్ప్రెస్స్ మరి కొద్ది సేపట్లో ఒకటో నెంబర్ ప్లాట్ఫారం కు వచ్చును అన్న అనౌన్స్మెంట్ వినపడింది. దాంతో చదువుతున్న ఆ పేపర్ తీసి బ్యాగులో పెట్టుకుని, బ్యాగు బుజాన వేసుకుని ముందుకు నడవసాగాడు.

రావలసిన రైలు రానే వచ్చింది, రైలు ఎక్కి కూర్చున్న ఆ కుర్రాడికి అసలు పరీక్ష మొదలయింది. అదే నండి, ఈ రైలు ప్రయాణంలో, కాలక్షేపం ఎలా చేయాలన్న ఆలోచన ?

రైలు అంతా పిల్ల రాక్షసులను సముదాయించే పెద్దల అరుపులతో, మరణమృదంగం వాయిస్తున్నట్లు ఉంది. టికెట్టు తీసి బె ర్తు నెంబర్ చూసుకున్న ఆ కుర్రాడికి, ఎదురుగా ఆరు పదుల వయసు కలిగిన యువకుడు, తాను కూర్చోవలసిన బెర్తుకి పైన, క్రింద అంతటా తనదే అన్నట్లుగా లగేజ్ పెట్టి తాళం వేశాడు. ఆ కుర్రాడు రాగానే ఆహ్వానించి కూర్చోమనగా, తన బ్యాగు ఎక్కడ పెట్టాలన్న అయోమయంలో ప్రక్క సీట్ కింద పెట్టి, తెచ్చుకున్న యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన శారద డైరీ అను నవల చదవడం స్టార్ట్ చేశాడు.

కర్మని అనుభవిస్థున్న పాత్రలతో, సమాజంలొని మంచి చెడులను కలబోసి, భగవధ్గీతలోని కర్మ సిద్దాంత్థాన్ని తెలియచేస్తున్నట్లుగ రాసిన ఆ నవల బాగా ఆలొచింపచేస్తోంది.

నవల చదువుతున్న ఆ కుర్రాడిని ఎవరో వచ్చి, బలంగా చెంప చెళ్ళుమన్నట్లు టికెట్టు అని అరిచాడు, టికెట్ కలెక్టర్. తన టికెట్టుని చెక్ చేసిన తర్వాత, తిరిగి నవల చదవడం మొదలు పెట్టాడు. ఇంకా రైలు కదల లేదు. నవల బాగా ఇంటెరెస్టింగా ఉండటంతో పేజీలు మీద పేజీలు తిప్పుతున్నాడు. ఇంతలో ఒక చక్కటి అమ్మాయి రైలు కదల బోయే సమయానికి ఎక్కుతూ, తనతో పాటు ఒక పెద్దావిడిని కూడా ఎక్కించింది. ఎక్కీ ఎక్కగానే, సార్ ఒరు బెర్తుకుడుత్రిక్యెంగె అని టికెట్ కలెక్టర్ని అడిగింది(తమిళంలో). అంత వినమ్రంగా అడగడంతో కరిగిపోయిన టీ.సి, బెర్తు లేకపోతే తన బెర్తుని ఇచ్చేయడానికి కూడా సిద్ధ పడిపోయినట్లు ఒక బెర్తు కంఫర్మ్ చేశాడు. తనకు టికెట్టు తీసుకోవడమే కాక, తనతో పాటు రైలు ఎక్కినా పెద్ద ఆవిడకు కూడా కంఫర్మ్ చేయించింది. ఇదంతా చూసిన ఆ కుర్రాడికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే బాగున్ను అన్న ఆలోచన తట్టింది. ఇంతలో టికెట్టు తీసుకున్న ఆ అమ్మాయీ అక్కడ నుండి బెర్తువెతుక్కుంటూ వెళ్ళిపోయింది.

" హూం, గడియారంలో టైం అన్నాక తిరగ కుండా ఉంటుందా, రైలులో పరాయి అమ్మాయి అన్నాక వెళ్ళకుండా ఉంటుందా ? “
అమ్మాయితోపాటు రైలు కూడా కదిలింది. అంతే, ఆ కుర్రాడి ఆలోచనలు కూడా నెమ్మదిగా పుస్తకం మీదకు మళ్ళాయి. సమయం ఆరు గంటల ముప్పైనిమషాలు, చీకటి పడుతోంది. అప్పటికి, భోజనం తరవాత సేద తీరినట్లుగా, అందరూ కుదుటపడ్డారు. వ్యాపారం చేసేవాళ్ళు ఎప్పుడూ ఎందుకు ప్లేసు, టైము, చూస్థుంటారో, రైలులో వెండర్లు టీ,కాఫీ, తీసుకొచ్చినప్పుడు అర్ధమయింది. కర్రెక్ట్ గా, అందరూ కాస్త కుదుటపడగానే టీ, కాఫీలు అంటూ వచ్చేశారు.

నవల చదువుతూ అప్పుడప్పుడు ఎదురుగా కూర్చున్న ఆ పెద్ద ఆయన్ని చూసి నవ్వుతుండగా, ఒక సారి నీ పేరేంటి బాబు, ఎక్కడ వరకు అని అడిగాడు. అలా జరిగిన ఆ పరిచయంలో తానొక కళ్ళ జోడ్ళ వ్యాపారి అని చెప్పారు, ఆ పెద్దాయన. తనది, నెల్లూరు అని చెప్పినా కుర్రాడితో, నేను కూడా నెల్లూరుకు అప్పుడప్పుడు ఈ కళ్ళ జోడ్ళ ఫ్రేంసును డిస్ట్రిబ్యూట్ చెసే పని మీద వస్తుంటాను అని అన్నాడు.

ఎక్కడ, ఏ,షాపుకి వస్తుంటారు అని అడగగా, శ్రీ రామ ఆప్టికల్స్ అని చెప్పాడు. పరధ్యానంలో నవ్వుతూ, ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు, ఆ కుర్రాడు. ఈ వయసులో ఆయన చేసే ఉద్యోగం, అది కూడా దేశంలో నలు మూలల తిరుగుతూ, ఎందుకంటే తాను ఉండేది ముంబైలో, కానీ, కేరళ నుండి ముంబైతో పాటు నెల్లూరు లాంటి చిన్నచిన్న నగరాళ్ళతో సహా ఆ కళ్ళ జోడ్ళ ఫ్రేంసుని డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం ఆ కుర్రాడిని ఆలోచింప చేసింది. ఆయన ఈ ఉద్యోగం మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఎంత కష్ఠపడి ఉంటాడో అన్నఆలోచనలు ఆ కుర్రాడి మదిని తవ్వుతున్నాయి. అప్పుడే టీ, టీ, అని అరుస్తున్నాడు ఒక వ్యక్తి . చూపు తన మీదకు మళ్ళింది. రైలులో ఆ చివర నుండి ఈ చివర వరకు టీ, కాఫీలు మోసి ఇనుప చువ్వళ్ళా మారిన వాళ్ళ చేతులను చూసి, వీళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారో అన్నమరో ఆలోచన !

ఈ కష్టమంతా నెల తిరిగే సరికి వచ్చే ఆ నాలుగు పైసలు కోసమే కదా అని, అనుకుంటుండగా, ఒక ముసలాయన జామాయలు సీసాలు అమ్ముతున్నాడు. ఇలా వాళ్ళు, బ్రతుకు బండిని లాగ డానికి ఎలా కష్టపడుతున్నారో చూసి, సర్రిగ్గా పాతికేళ్ళ వయసులో ఉన్న తన కష్టం గురుంచి మొదలయిందో ప్రశ్న.

ఇన్ని ఆలోచనలతో, అలా ఆ కిటికీకి ఆనుకుని బయటకు చూస్తుండగా, అప్పుడే ఆ కుర్రాడి ఆలోచనలో మరో కోణం మెరుపు వేగంతో కాకపోయినా, గ్రహణం వీడిన చంద్రుడిలా, నిదానంగా కారు మబ్బుల చాటు నుండి బయటపడగానే, తన చల్లటి కిరణాలు ఎంత వేగంగా మన కంటి చూపుని తాకుతాయో అంతే వేగంగా చిన్న మెదడు నుండి గుండెను తాకాయి.

వీళ్ళందరికి వస్తువులను అమ్మడం తెలుసు, అంతకు మించి పడే కష్టం, దానికి లభించే ప్రతిఫలం, హూం, ఏమాత్రం పొంతన లేదు. ఇంత కష్టపడి ఏమైనా కూడబెట్టారా అంటే అదీ లేదు. ఈ రోజుళ్ళో నెలకి ముప్పైవేలు వచ్చినా సరిపోవట్లేదు, ఇక కూడబెట్టే ఆలోచన అంటారా, వదులుకోవడమే! డబ్బులని కాదండి, ఆలోచనని!

అంటే మనం సంపాదించినదంతా తినే తిండికి, నిత్యావసరాలకు పోగా, ఏమి మిగలదు. ఇక, నాలుగు రాళ్ళు వెనకేసుకోవలంటే, హా, వేసుకోవచ్చు, చిళ్ళర కాదు , చిళ్ళర రాళ్ళు. చిల్లర వేసుకోవాలంటే,
బాగా సంపాదించాలి. కానీ ఎలా ?
“నెలకి ముప్పైవేలు సంపాదించడానికి ఒకరి క్రింద ఉద్యోగమే చెయనక్కర్లేదు " అంటూ మెదడును గుండు సూదులతో గుచ్చినట్లు తడుతోంది. మరి ఏం చేయాలన్న ప్రశ్న ?
బిజినెస్ !
హా , బిజినెస్ ! కాని, ఏం బిజినెస్ చేయాలి,
పెట్టుబడి ఎంత పెట్టాలి ఎలా తేవాలి ? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు తడుతున్నాయి.

“కాలి నడకన వెళ్ళే బాటసారికి, నాలుగు దారులు ఎదురైనప్పుడు, ఏదారిన పొవాలనేది కూడా ఒక ప్రశ్నే. ఎదురైన ప్రశ్నకు సరైన దారిని ఎంచుకోకపోతే గమ్యం చేరుకోడనేది ఎంత సత్యమో, ప్రశ్నలతో మొదలయిన తన ఆలోచనలకు ఒక రూప కల్పన చేయకపోతే, కార్యరూపం దాల్చదనేది కూడా అంతే సత్యం" !

ఆ కుర్రాడి ఆలోచనల్లాగే, రైలు కూడా వేగంగా ఈరోడ్ చేరింది. సమయం రాత్రి 8 గంటలు, ఏదైనా తినడానికి తీసుకుందాం అంటూ బండి దిగి, కావలసినవి తీసుకుని ఎక్కి కూర్చున్నాడు. ఎదురుగా కూర్చున్న ఆ పెద్దాయన్ని చూసి, వీళ్ళందరు చేసే పని కూడా తన లాగే జీతం కొసమై ఉండొచ్చు కానీ వాళ్ళ నైపున్యాన్ని వాడుకుంటున్నా కనిపించని బిజినెస్ మైండ్ తనను ఆలోచింపచేస్తోంది. రైలులో టీ , కాఫీలు, బట్టలు చివరకు జామాయిల్ సీసాలు కూడా అమ్ముతున్నారు. ఎదురుగా కూర్చున్న పెద్దాయన కళ్ల జొడ్ళ ఫ్రేంస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇలా కళ్ల జొడ్ళ ఫ్రేంస్ దగ్గర నుండి కార్ల వరకు ఎన్నో వస్తువులను ఈ దేశంలో అమ్ముతున్నారు. ఆ కుర్రాడు వీళ్ళందరిని గమనించి చేసిన విశ్లేషణ చూస్తుంటే , వాళ్ళు చేసిన, చేస్తున్న, పని గురుంచి కానట్లుంది. వాళ్ళు అమ్మే వస్తువులు, వాటిని అమ్మి డబ్బు సంపాదించే విదానం, ఇలాంటి వాళ్ళను ఉపయోగించుకుంటున్న ఆ బిజినెస్ మాన్ గురుంచి. ఏదో పుస్తకంలో చదివినట్లు, బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలి అంటే మనం కష్టపడనక్కర లేదు , తెలివితేటలు, పనిలోని నైపుణ్యం ఉన్న వాడ్ని ఉపయోగించుకుంటే చాలు అని. అదే, బిజినెస్ లో పెట్టుబడి కూడా.

ఉదాహరణకు, ఒక సెలూన్ తీసుకుందాం. ఏమి చదువుకోని వ్యక్తి ఒక సెలూన్ ఓపెన్ చేసి, ఆ పనిలో నైపున్యం ఉన్న, నలుగురు కుర్రాళ్ళని పెట్టాడు. వాళ్ళ పనితనం అందరికి నచ్చటంతో ఆ సెలూన్కి రెగులర్ కస్టమర్లు తయారయ్యారు. అతి కొద్దిపాటి కాలంలోనే బిజినెస్ బాగా జరగడంతో, నాలుగైదు బ్రాంచీలను కూడా ఓపెన్ చేశాడు. ఇలా బాగా డబ్బు సంపాదించడమే కాకుండా, నలుగురికి ఉపాదిని కూడా కల్పించాడు. ఇందుకు తాను చేసిందళ్ళా, ఆ పని తెలిసిన నలుగురు కుర్రాళ్ళను పనిలో పెట్టుకోవడమే.
రైలు ప్రయాణం చాలా దూరం సాగి, శేలంకి చేరింది. చేతిలో ఉన్న పుస్తకం మీద ధ్యాస మళ్ళి కూడా చాలా సేపు అయింది. ఇక తన దగ్గర ఉన్న మ్యూజిక్ ప్లేయర్ తీసి పాటలు వినడం మొదలు పెట్టాడు. అప్పుడు సమయం తొమ్మిది అయినట్లుంది ఎవరికి , వాళ్ళు తెచ్చుకున్న బోజన పొట్లాలను తీసి తినడం మొదలు పెట్టారు. శేలం నుండి రైలు కదలడం తో స్టేషన్ లో ఉన్న ఆ కోలాహలం దూరం పోయే కొద్ది, వినికిడి తగ్గుతోంది. అప్పుడే మొదలయింది !

పూరి జగన్నాధ్ సినిమా లోని ముమైత్ ఖాన్ డాన్సు చేసిన పాట అఫ్ కోర్సు, గీతామధురి పాడిన పాట కూడా,
"పుడుతూనే ఉయ్యాలా, నువ్వు పోతే మొయ్యాల
ఈ లోపే ఏదో చెయ్యాలా .....!
ఎలాలే, ఏలాల, దునియానే ఏలాల
చక చక చడుగుడు ఆడాలా ! "

ఆ పాట కూడా తన ఆలోచనలికి ఆద్ధ్యం పోసినట్లుగా , మళ్ళీ మళ్ళీ అదే పాటను వింటున్నాడు, అప్పటికప్పుడే ఏదో ఒకటి సాధించాలని. బహుశా, మనిషి ఆలోచనలకి అడ్డూ అదుపూ ఉండదనే, దేవుడు ఆటుపోట్లను శృష్టిస్తుంటాడేమో ..!
ఇలా ఏదో చేయాలని, సాధించాలన్నఆలోచనలు ప్రతి కుర్రాడికి, రైలు ప్రయాణంలోనో, రోడ్డు ప్రక్కన నడుస్తున్నప్పుడో ఏదో ఒక చోట వచ్చి ఉంటాయి. అలా వచ్చిన ఆ ఆలోచనలను ఒడిసి పట్టి ఆచరణలో పెట్టిన వాళ్ళే అంబానీలు అవుతారు అనేది జగమెరిగిన సత్యం. లేకపోతే, ఆ కుర్రాడి లాగ రైలు ప్రయాణాన్ని ఒక జ్ఞాపకంగా గుర్తించుకుంటారు ..!
ఆలోచనే ఒక పెట్టుబడి, గుర్తించుకోండి..!

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదండోయ్ , ఈ కథా రచయిత

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech