సిలికానాంధ్రుల సంబరాలు

"పుట్టిన రోజు చేసేను చిట్టి పాపాయీ..."

సిలికానాంధ్ర కార్యక్రమలకు కుటుంబమంతా తరలివచ్చిపాల్గొని ఉత్సాహనంగా గడిపే కుటుంబాల్లో పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం, పద్మ బిందు గార్లు అగ్రగణ్యులు. అక్టోబరు సంరంభం హడవిడిలో వారి పాప ప్రహర్షిత, సుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా పాల్గొంటునే కొత్తగ ఈమధ్యే తమ కుటుంబానికి లభించిన చిన్న కన్నయ్యని అందరికీ పరిచ్యం చేశారు. బంధు మిత్రుల సమక్షంలో ప్రహర్షిత జన్మదినోత్సవం జరుపుక్కుని తన చిట్టి తమ్ముడు ప్రతీక్ ని అందరికీ పరిచయం చేసింది. ఈ చిరంజీవులిద్దరూ ఆయురారోగ్యాలతో చక్కగా పెరగాలని ఆశీర్వదిద్దాం

"గృహమేకదా స్వర్గసీమ.."

ప్రతి నిత్యమూ చిరునవ్వుతో పలకరిస్తూ ఉండే సిధ్ధార్థ-స్వాతి గార్లు ఈ మధ్యే నూతన గృహప్రవేశం చేశారు. సాన్ హొసే లోని వారి కొత్త ఇంటికి గృహప్రవేశం చేసి బంధు మిత్రులందరితో కలిసి సెప్టెంబరు 16వ తేదీన "హౌస్ వార్మింగ్" చేసుకున్నారు. ఇలా ఇళ్ళు కొనేవారుంటే ప్రస్తుతం మార్కెట్టు పడిపోకుండా ఉందన్న ధీమా మనకు తృప్తినిస్తుందని వేరే చెప్పాలా!