పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

ఆధారాలు :

నిలువు:

1. వేళకురాని ప్రియుడికై విచారించే నాయిక (4)

2. పంపించు (5)

3. నవగ్రహాల్లో ఒకటి (2)

4. మా నాన్నగారి అమ్మానాన్న (5)

5. త్రివేణీ సంగమ స్థానం (3)

9. సరాసరిలోని సగం కృష్ణుడు (2)

10. దిక్కు (2)

11. ఆచరించు (2)

12. పిల్లలకి (.."దీని" యందే ఎక్కువ శ్రద్ధ (4)

13. అనవసర ప్రసంగి (6)

14. సూర్యచంద్రులూ నక్షత్రాలు ఉన్నంతకాలం (6)

15. మంత్రపూర్వకంగా అరచేతిలోకి తీసుకున్న నీళ్ళు తాగటం (4)

16. మొహమాటంతో (5)

17. బ్రహ్మగారు చేసే "ఒకపని" (5)

18. నశించు, క్షీణించు (2)

20. వంశానుక్రమం; పుట్ట "చివర" (2)

22. వినయం ఉన్నవాడు (4)

26. అంతా విన్నాక కూడా ఏమీ కామా? అంటే ఎట్లా? (2)

27. లిఖించు (2)

అడ్డం:

1. డంబాలు, కోతలు(10)

6. దద్దమ్మ (3)

7. గతి;ఉండేచోటు (3)

8. నటీనటులు (4)

11. చేటుకాలం (4)

12. కోరిక (2)

13. విడుచు, చల్లు (2)

14. ఎక్కువున్న క్రీడ (4)

19. ఈకాలంలో చాలామంది తాగే ఒక చల్లని పానీయం (4)

21. ప్రసిద్ధికెక్కిన కాకతీయ సామ్రాజ్య పురాణి (5)

23. పాలరాయి (5)

24. రాగం, పల్లవిల మధ్య బందీ (2)

25. చూడుము వాని చేష్టలు (2)

26. కాళీపట్నం మాస్టారే (2)

27. 27 నిలువు లోనిదే (2)

28. పాలూ, పెరుగవ్వాలంటే 'ఇదీ కావాలి (2)

29. ఈ 'చిన్నవాడూ చిరంజీవి (5)

ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారిని కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరిగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
అక్టోబరు 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత పదవిన్యాసం సమాధానాలు:సెప్టెంబరు మాసపు పదవిన్యాసంలో మాకు అందిన సమాధానాల్లో ఒక్కటీ పూర్తిగా సరైన సమాధానాలు ఉన్న పూరణలు అందలేదు. అందువల్ల సెప్టెంబరు నెల పదవిన్యాసం విజేతలుగా ఎవరినీ ప్రకటించుట లేదు.