మార్పు

-- ముప్పాళ్ళ శ్రీరామచంద్రమూర్తి


"కిరసనాయలు దీపాల వెలుగు
విద్యుత్కాతిగా రూపాంతరం చెందినా,


తప్పొప్పుల తడబడులను తుడిచేసిన
నాన్న కంచుకంఠధ్వని దూరమయినా


చెప్పులెరుగని అరిపాదాలు
కార్ల క్లచ్‌లపై కదలాడుతున్నా


చుక్కలు చూస్తూ నిద్రపోయే నులకమంచపు పడక
ఫాన్ రెక్కలకు కళ్ళు త్రిప్పుతున్నా


సామాజిక సాలీడు బూజులకు సాగుతూ
ముందుకు నడుస్తున్న ఆపాదాల,
తడి ఆరకముందే, మార్గం మారింది"