సుజననీయం
చరిత్ర ఒక వాస్తవం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

బాపూజీ నడిచిన 'ఉప్పు సత్యాగ్రహం' ఒక తెలుపు నలుపుల చలనచిత్రంలో చూస్తుంటే మనకు ఒళ్ళు గగుర్పాటుకు లోనౌతుంది. ముందు గాంధీగారి చకచక నడక, అతని వెనకాల వేలమంది అనుసరించడం చూసి సంతోషిస్తూ 'ఓహో ఇదన్న మాట చరిత్ర ' అనుకుంటాం. మరి అప్పుడు ప్రత్యక్షంగా ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నవారు ఎంతటి ఉద్వేగానికి లోనయ్యారో? 'నేను సైతం' అనుకొంటూ తమవంతు కృషిని అందించి ఎంతటి తృప్తిని పొందారో?

అలాంటి సంఘటనే మొన్న ఆక్టోబర్ 2న జరిగింది. 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం' స్వంత భవనాన్ని విదేశీగడ్డపై సంపాదించుకొంది. డా.లకిరెడ్డి హనిమిరెడ్డి మహాదాతగా, కొందరు ఔత్సాహిక సిలికానాంధ్ర కుటుంబసభ్యులు 'ఉడుతా భక్తి 'గా చేసిన సహాయంతో ఒక పెద్దకల నిజమైంది. అందులో పాలుపంచుకొన్న నాకు, మిగతావారికి సిలికానాంధ్ర చరిత్రలోని ఈ కమనీయ ఘట్టం చిరకాలం ఒక కమ్మని గుర్తులా మిగిలిపోనుంది.

"చారిత్రక విభాత సంధ్యల
మానవ కథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించినదే పరమార్థం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గులకీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?"

పై విధంగా అంటారు శ్రీశ్రీ "దేశ చరిత్రలు" అన్న కవితలో. అవును నిజమే, మన భారతదేశ చరిత్రలో భాష, సంగీతం, సాహిత్యం, నాట్యం మొదలగు కళలు ప్రధానపాత్ర వహించాయి. ఈ చరిత్రనే మనం సంస్కృతి అంటున్నాం. ఆలాంటి భారతీయ సంస్కృతి కేంద్రంగా 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం' ముందుకు సాగిపోనున్నది. మున్ముందు, ఈ చరిత్రకు ఆధునికతను జోడిస్తూ కొత్త పుంతలు తొక్కనుంది. అందుకు 'Computational Lingustics'ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ప్రతీ ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమౌతుంది. మరి, మొదటి అడుగు పడింది. ఇక, ముందున్నది అతిపెద్ద ప్రయాణం. గమ్యం ఒక moving target. మీ అందరి ఆశీస్సులను కోరుకుంటున్నది సిలికానాంధ్ర.

- తాటిపాముల మృత్యుంజయుడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)