కవితా స్రవంతి
యోధుడు
- పి. వాణి

వాడొక ఉవ్వెత్తున లేచే కెరటం
మృత్యువుకి ఎదురెళ్ళే వేటగాడు
వాడు ధైర్యానికి ప్రతీక
బ్రతుకుబండిని లాగడానికి
కులవృత్తిని నమ్ముకున్న బైరాగి
ప్రశాంతంగా ఉన్న కడలి కల్లోలమైనా
గాలిసైతం కన్నెర్ర చేసినా
వర్షం వెన్నులో గుచ్చినా
వెరవక నిలబడే సత్తావాడిది
నీటినే నమ్ముకున్న యోధుడు
అతడు ఏ ప్రళయాన్నైనా ఎదుర్కొనే వీరుడు
అతడే నావకి సేనాని
నీటిలో అమ్మని, వెన్నెల్లో ఆలిని చూస్తాడు
గాలి గుసగుసల్లో పిల్లల కబుర్లు వింటాడు
అన్నీ అనుభవిస్తూ ఒంటరిగా పోరాడతాడు
అతడు గొప్ప మేధావి
ఋతువుల్ని ఎదుర్కొంటాడు
ఆటుపోట్లతో, వేగుచుక్కతో కాలాన్ని లెక్కిస్తాడు
అతడు బాహువుల్ని కత్తులు చేసుకొని పోరాడతాడు
అతడు కళ్ళతో చీకట్లను చీల్చుతాడు
జావళీలతో జలపుష్పాలను ఏరటాడు
మర్మమెరుగని వాడికి లోకమంతా తేటనీరే
వాడు మాత్రం ఉప్పునీటి కయ్యలో కొట్టుమిట్టాడుతాడు
అతడు కోట్లకోసం నీటిని కబళించలేదు
అతడు ఏ సామ్రాజ్యాన్ని శాసించలేడు
బ్రతుకుకోసం అనుక్షణం పోరాడతాడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)