సుజననీయం
సిలికానాంధ్ర పెద్దపండుగ - 'ఆంధ్ర సాంస్కృతికోత్సవం'
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చన్నాప్రగడ కృష్ణ


సిలికాన్ వ్యాలీలో జరిగే తెలుగు కార్యక్రమాల్లో అతిపెద్దది సిలికానాంధ్ర 'ఆంధ్ర సాంస్కృతికోత్సవం'. ఆరు గంటలకు పైగా నిడివి, మూడువందలకు పైగా కళాకారులు, మూడు నెలల ప్రణాళిక సమీకృతమే ఈ ఉత్సవం. ఆడా-మగా, పిల్లా-పెద్ద, తాతయ్య-మనవరాలు కలిసి చేసుకునే పండుగ ఇది. పిల్లల ఆటపాటలు, సంగీత గానామృతాలు, కూచిపూడి నాట్య విలాసాలు, జానపద నృత్యాలు, పౌరాణిక నాటకాలు, వైవిధ్యమైన కళారూపకాలు, వీటన్నింటీనీ పూసగుచ్చితే ఏర్పడేది తెలుగు కళామతల్లి మెడలో వేసే గజమాల.

కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఔత్సాహిక కళాకారులకు ఇదే మా పిలుపు. నవరసభరితమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇదే మా ఆహ్వానం. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' శీర్షిక చూడండి.

 

సుజనరంజని మాసపత్రికను మరోమెట్టు పైకి తీసికెళ్లటానికి ప్రణాళిక రూపొందించబడుతున్నది. ఈ ప్రయత్నంలో సాహితీకారుల, అంతర్జాల సాంకేతిక నిపుణుల సహకారం ఎంతగానో అవసరం. ఈ విషయానికి సంబంధించిన వివరాలను వచ్చే సంచికలో ప్రచురిస్తాము.

- తాటిపాముల మృత్యుంజయుడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)