|
"సమస్యాపూరణం:
ఈ
క్రింది
"సమస్యని"
అంటే
ఆ
వ్యాక్యన్ని
యదాతధంగా
ఒక
పద్యంలోకి
ఇమిడ్చి
వాడుకుంటూ
రాయాలి.
ఒకవేళ
పద్యం
కాకపోయినా
ఒక
కవిత
రాసినా
కూడా
వాటిని
మేము
సగౌరవంగా
స్వీకరిస్తాము.
మీ
జవాబులు
ఈ-మెయిల్
(విద్యుల్లేఖ)
ద్వారాకాని
(rao@infoyogi.com)
ఫాక్స్
ద్వారాకానీ
(fax: 408-516-8945)
మాకు
అక్టోబర్
20వ
తారీఖు
లోపల
పంపించండి.
ఉత్తమ
పూరణలను
తరువాయి
సంచికలో
ప్రచురిస్తాము.
ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క
దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు
ఈ మాసం సమస్యలు
తే.గీ.||
జోకు
రాని
తెలుగు
వాడు
జోకరేను
కం.|| శూన్యమె ఆనందమయ్యి శోభిలు భువిలో!
క్రితమాసం
సమస్యలు
ఆ.వె||
దొంగ
కాని
వాడు
దున్నపోతు
!
కం||
కారులు
ఉంటే
నడకల
కసరత్తు
యగున్
ఈ
సమస్య
లకు
వచ్చిన
ఉత్తమ
పూరణలు
ఇలా
వున్నాయి.
మొదటి పూరణ - వేదుల బాలకృష్ణమూర్తి, శ్రీకాకుళం
ఆ.వె.|| నేర్పు విద్య యందు నిపుణతకై పని
దొంగ కాని వాడు దున్నపోతు
వలెను కష్టపడిన ఫలితము అనుభవించు
బాలకృష్ణ మాట పసిడి మూట
ఆ.వె.|| దున్నపోతు నేల దున్నగ కష్టించు
దొంగతనము చేయు దొంగ, కాని
వాడు దున్నపోతువలెను శ్రమించడు
తెలుగు కవితలోని జిలుగులెవియె
రెండవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,
కం||
భారీ దేహపు బాధతొ
సరిమార్గము జూపుమనిన సన్నితుడనియెన్
కారుల దిరుగక జోరుషి
కారులు వుంటే నడకల కసరత్తు యగున్
ఆ.వె|| మదిని కోర్కెలెరిగి మారుమాటాడక
మగడు సర్వమనెడి మగువ యెడల
ప్రేమమర్మమెరిగి ప్రియముజూపు మనసు
దొంగ కానివాడె దున్నపోతు
మూడవ పూరణ - యం.వి. సుమలత
ఆ.వె|| మాయ దూడ మదిని మాధవు కొల్లగ
దొంగ. కాని, వాడు దున్నపొతు
మర్మ మెల్ల తెలిసి మదియించి వేయగ
దొంగ క్రూలె, వాడె దున్నపొతు
కం|| జోరుగ పెరిగెడి కాయపు
భారము వలదని తలంచి బాగుగ చాలా
మారులు జాలీ గాను షి
కారులు వుంటె నడకల కసరత్తు యగున్
నాల్గవ పూరణ - మణి శాస్త్రి, టెక్సాస్
కం|| నారుల మన్నన జూడని
దారుల పయనించు దుష్ట దానవ చేష్టల్
తీరుగ పరువను దురహం
కారులు ఉంటే నడకల కసరత్తుయగున్.
ఆ. వె.|| మనసు దోచిన దొర మగనిగా భావించి
బ్రతుకు నామె అతడె భర్త యనుచు
దొరతనాలె భువిని దొంగ తనములెల్ల
దొంగ కాని వాడు దున్నపోతు
ఐదవ పూరణ- జగన్నాథ రావ్ కె.ఎల్
ఆ.వె.|| దోవ కాచి ధనము దోచుకుతినువాడు
దొంగ, కాని, వాడు దున్నపోతు
చాల ధనము మింగి జామాత కట్నము
చాలదనుచు చెయ్యి చాపినాడు
కం.|| కోరలు చాచిన మాంద్యం
కారణముగ భారమయ్యె కారు ప్రయాణం
కారులతో పని లేని షి
కారులు ఉంటే నడకల కసరత్తు యగున్
ఆరవ పూరణ - తల్లాప్రగడ రావు
కం|| కోరిన సీయెం (CM) మాయము!
జారుతు పేలిన విమాన జాడయె లేదా?
తీరుగ వెదకని మన అధి
కారులు ఉంటే నడకల కసరత్తు యగున్
ఆ.వె|| బుంగమూతిపెట్టె తింగరోడు యొకడు
చేయుకొద్ది పనిని చేయ మనగ!
చేయువానిచేతె చేయించరా? పని
దొంగ కాని వాడు దున్నపోతె! |