 |
|


దొంగను పట్టినవాడు |
| |
ఆనందపురంలో సోముడు అనే గజదొంగ వరుసగా దొంగతనాలు హత్యలూ చేస్తూ
రాజ భటులకు దొరకకుండా తప్పించుకుంటూ వచ్చాడు. అందుచేత రాజు
నిక్షేపరాయుడు వాడిని పట్టినవారికి వంద వరహాలు ఇస్తానని
చాటింపు వేయించాడు.
ఒకరోజు ధర్మయ్య అనే రైతు చీకటితో పొలానికి పోతున్నాడు. ఆ
సమయంలో ఊరికేసి వస్తున్న ఇద్దరు ప్రయాణికులను ఎవడో దొంగ
అటకాయిమ్చి దోచుకోవడం అతని కంటపడింది.
వాడే గజ దొంగ సోముడు అయిఉంటాడని ధర్మయ్య ఒక చెట్టు చాటున
దాగాడు. దొంగ అటుగా రాగానే తన భుజం మీద ఉన్న పగ్గం విసిరి,
దొంగను పట్టుకున్నాడు. వాడిని లాక్కుని రాజుగారి వద్దకు
బయలుదేరాడు.
ధర్మయ్యకు దారిలో కామయ్య అనే మరో రైతు ఎదురయ్యాడు. విషయం
ఏమిటని అడిగాడు. తాను గజదొంగ సోముడిని పట్టుకున్నాననీ, రాజు
నిక్షేపరాయుడి తనకు వంద వరహాలు ఇస్తాడనీ చెప్పాడు ధర్మయ్య.
వెంటనే కామయ్య ధర్మయ్య నెత్తిమీద తన చేతి కర్రతో బలంగా కొట్టి
స్పృహ తప్పించాడు. దొంగను తీసుకుని రాజుగారి వద్దకు తానే
బయలుదేరాడు.
కామయ్యకు రాజసభలో ప్రవేశం దొరకడానికి ఆలస్యం అయ్యింది. ఈ లోపల
ధర్మయ్యకు స్పృహవచ్చి రాజసభకు చేరాడు.
దొంగను ఇద్దరూ నేనంటే నేను పట్టుకున్నానని అనటం చూసి
నిక్షేపరాయుడు మంత్రి వివేకుడికేసి చూశాడు.
వివేకుడు దొంగను దగ్గరకు రప్పించుకున్నాడు. అతడిని పరిశీలనగా
చూశాడు.
వీడు దొంగ కాడు మహారాజా! మన ఆస్థాన జ్యోతిష్యుడి కొడుకు!
అన్నాడు. వెంటనే కామయ్య కంగారు పడ్డాడు. దొంగకానివాడిని తెచ్చి
దొంగ అని చెప్పినందుకు తనకు శిక్షపడుతుందని భయపడ్డాడు. దొంగను
పట్టుకున్నది తాను కాదనీ ధర్మయ్యేననీ చెప్పాడు.
నిక్షేపరాయుడు కామయ్యకు ఇరవై కొరడా దెబ్బలు, ధర్మయ్యకు నూరు
వరహాలు మంజూరు చేశాడు.
సమస్యను తేలికగా పరిష్కరించిన వివేకుడిని నిక్షేపరాయుడి ఘనంగా
సత్కరించాడు.
|
|
| |
చొక్కాపు వెంకటరమణ :
స్టేజి మీద మేజిక్ చాప్లిన్ గా మేజిక్ కార్యక్రమాలుచేస్తూ,
పిల్లల కోసం అనేక కధలు వ్రాసిన బాలల రచయిత, ప్రతిభకల
చిన్నారులతో ఎన్నో రికార్డు ప్రోగ్రాములు చేయించిన మేజిక్ ఫన్
స్కూల్ నిర్వాహకుడు, బాలభవన్ లో ఉద్యోగిగా ఎన్నో రచనలు
అందించిన సంపాదకులు, పిల్లల మనోవికాసం కోసం ఊయల పత్రిక
నిర్వహించిన పత్రికాధిపతి......ఊయల కమ్యునికేషన్స్ అధినేత..ఆల్
రౌండర్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం చొక్కాపు వెంకట రమణ
ఆంధ్ర్ర ప్రదేశ్ బాలల అకాడెమీవారికి అనేక పిల్లల పుస్తకాలు
వ్రాసారు. వాటిని జవహర్ బలభవన్ ఇటీవల పున:ప్రచురుంచింది.
చొక్కాపు వెంకట రమణ ఆధునిక పరవస్తు చిన్నయ సూరి గా అందిస్తున్న
నీతికధల సమాహారం 'నిక్షేపరాయుడి కధలు ' ధారావాహికంగా బాలరంజని
లో నెల నెలా వెన్నెల..
|
|
|
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ
క్రింది పెట్టెలోతెలపండి. (Please leave your opinion here) |
|
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో
మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ,
సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please keep comments
relevant.) |
| |
|
|
Copyright
®
2001-2009 SiliconAndhra. All Rights Reserved. సర్వ
హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech |
|