| |
'జత' దినోత్సవాలు
ఊరంతా ఒకటే హడావిడి..హైదరాబాద్
లో ఆర్ టీ సీ క్రాస్ రోడ్డులో ఒక ధియేటర్ లో అంతా హడావిడి గా
ఉంది.
బానర్లు రెప రెపలాడుతున్నాయ్.
అభిమానులు గోల గోల గా తిరుగుతున్నారు.
పూల దండలు.కొబ్బరికాయలు,
పాటల సౌండు..ఒకటేమిటి
అంతా రచ్చ రచ్చ.అన్నిటికీ కారణం ఒక పెద్ద హీరోగారి అబ్బాయి మొదటి సినిమా
రెండోరోజు
కావడమే.
ఇవన్నీ 'జత
'
దినోత్సవ వేడుకల హడావిడి.
సినిమా రిలేజు కాకముందే..మా
సినిమా 100
రోజులు ఆడేస్తుంది..అని
'హ్రుదయం
'
ఇంటిపేరుగా మారిపోయిన నిర్మాత గారు ప్రకటించేసారు.
ఆయనకి ఇది వరకు డిస్టిబ్యూటర్ గా అనేక సినిమాల 100
రోజుల షీల్డులు అందుకున్న అనుభవం తో...అలా
చెప్పారు.
ఇండియాలో.ఫారిన్
లో కలిపి ఎన్నో? (వాళ్ళకి
కూడ తెలీదు)
ప్రింట్లు రిలీజు చేసి...తిరిగొచ్చిన
డబ్బాలు..తిరిగి
రాని డబ్బాలు(డబ్బులు
అనాలేమో?)
లెక్క కట్టి మొత్తం వందరోజులు అనుకోవచ్చో?
లేక అన్ని ధియేటర్లూ కలిపి..ఆడిన
రోజులులెక్క కట్టాలో మరి.
వెనకటికి ఆత్రేయగారు ఒక సినిమా నాలుగు వారాలు ఆడుతుంది అని
చెప్పారట!
తీరా చూస్తే ఆ సినిమా నాల్రోజుల్లోనే ఎత్తేసారట.
అదేంటండీ అంటే నేను చెప్పింది నిజమే నాయనా,,నీకర్ధం
కాలేదు...శుక్ర
వారం,
శని వారం,
ఆదివారం,
సోమ వారం మొత్తం నాలుగు వారాలు అంటూ 'ముసి
ముసి '
నవ్వులు నవాడట మనసు కవి.
ఇహ ఈ సినిమా విషయానికొస్తే,,,,జత
దినోత్సవ ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి ...కారణం
..సదరు
హీరోగారి తండ్రిగారు...హీరోయిన్
గారి తల్లిగారూ,
హీరో..హీరోయిన్ను.
మ్యూజిక్ ఇచ్చినాయన..ఇలా
అందరూ వస్తున్నారట.
మర్నాడు విజయ యాత్ర కూడా ఉండడం తో..హడావిడి
అలా ఉంది.
అందరూ ఎదురు చూస్తున్న టైము రానే వచ్చింది..హీరో
అండ్ బాచ్ వచ్చేశారు.నడుస్తున్న
సినిమా ఆపేసి..దండయాత్ర
కార్యక్రమం అదే దండలు వేసే
కార్యక్రమం..అయిపోయాక..హీరో
గారి తండ్రి గారు..ఇన్నాళ్ళూ
నన్ను భరించారు ఇక మా అబ్బాయిని మీ మీదకి వదులుతున్నా .
ఇక మీ ఇష్టం అంటూ చేతులూపాడు.
హీరోయిన్ తల్లి..మాట్లాడుతూ...హీరోగారి
ఫాదర్ తో నేను ఇంతకు ముందు హీరోయిన్ గా చేసా ఇప్పుడు మా
పిల్లలు కలిసి చేస్తుంటే 'ఆ
'
రోజులు గుర్తొస్తున్నాయి అంటూ తెగ సిగ్గు పడిపోయింది.
హీరోయిన్ స్టేజి మీద కి వచ్చింది..ఆవిడ
ఎటు చూస్తోందో కెమెరా వాళ్ళకి కూడా అర్ధం కాలేదు.ఆమె
మొదలెట్టింది.
అమ్మా వాడు నిండా పెద్ద హీరోయిన్ ఉంది..అప్పుడు.
అంకుల్ నాకు హీరోయిన్ చేసినందుకు హాప్య్..అండ్
తాంక్స్..హీరో
చాలా కోపరేటివ్....నేను
ఒక కన్ను టాలివుడ్..ఒక
కన్ను కోలివుడ్(తమిళ
సినిమా)
మీద పెట్టా అందుకనే ఇలా కనిపిస్తుంది అని మెల్లగా తన మెల్ల
రహస్యాన్ని చెప్పింది
ఇక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ,,, when I heard the
story , I was inspired and gave music in one day
అంటూ హిందీ సినిమా కోసం చేసి హైద్రాబాద్లో తన ఆల్బం మర్చిపోయిన
తన పీ యే ని తిట్టుకుంటూ ....చెప్పేసాడు.
ఇక హీరోగారి వంతు...ఈ
రోజు కోసమే..ఈ
రోజు కోసమే 23
ఏళ్ళు గా ఎదురుచూస్తున్నా..చదువుకుందామనుకున్నా..అబ్బలేదు..స్పోర్ట్స్
మెన్ అవుదామనుకున్నా కష్టపడలేను..బిజినెస్
చేద్దామనుకున్నా చేతకాలేదు...అందుకే
ఇక హీరో అవుదామనుకున్నా...అయిపోయా....తాంక్స్
టు తాత,,,,నాన్న...తాంక్స్
టు హృదయం అంకుల్ ....తాంక్స్
టు మీకందరికి...అంటూ
ఇంగ్లీషు..తెలుగు
కలిపి అనేసి చెయ్యి చూపించేసి..బయలుదేరాడు.
తనకి సినిమా సినిమాకీ గుండెపోటు వస్తుంది కాబట్టి హృదయం
ప్రొడ్యూసర్ అంటారు అనీ...ఆ
సినిమా తీసినందుకు కాదని చెబుదామనుకుని...తనకి
చాన్స్ రాకపోవడం తో రేపటి విజయ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు
చేసుకోవడానికి బయలుదేరాడు ఆ ప్రొడ్యూసర్.
ఏమో శత దినోత్సవాల రోజులు పోయి ఇలా జత దినోత్సవాలు వస్తాయేమో
కూడా
చూశారా మరి.
- - -
'తుమ్మెద'
'తుమ్మెద'
అంటే .....అదేదో
పూల మీద వాలే 'తుమ్మెద'
అనుకునేరు.
ఇది జలుబు వల్ల వచ్చిన వైరస్ తో కూడిన తుమ్ము...'తుమ్మెద'
అంటే...నాలుగు
మైళ్లు పరిగెడుతున్నారు..ప్రజలు.
భారత దేశం లో అస్సలు పారిసుద్ధత ఉండదు...అంతా
చెత్త...ఇక్కడ
జనాలకు ఆరోగ్య సూత్రాలు తెలీదు అనే విదేసీయుల్ని...కొందరు
స్వదేశీయులనీ చూస్తుంటే ఆస్చర్యమేస్తుంది.
ఎందుకంటే...ఈ
మధ్య వచ్చిన జబ్బులు ఐడ్స్,
బర్డ్ ఫ్లూ,
ఆంత్రాక్స్,
స్వైన్ ఫ్లూ ఇంకా కొన్ని రకాల జబ్బులు..అన్నీ
విదేశియులు మనకిచ్చిన కానుకలే..అవి
అక్కడ నుంచీ దిగుమతి ఐన మహమ్మారులే.......మనవి
కావు అని మనవి చేస్తున్నా.
సుబ్బరంగా వయసు వాచ్చాక పెళ్ళి...ఒకరే
పెళ్ళాం,,,,హాయిగా
సంసారం...పిల్లలు..ఇదీ
మన సంప్రదాయం...కొన్ని
రోజులు కలిసుండీ...ఒక్కోసారి
ఏళ్ళతరబడి కూడా..నచ్చితే
పెళ్ళి...నచ్చకపోతే...చెల్లు..అంటూ
వదిలేసే డేటింగు వాళ్ళ విధానం..దేనివల్ల
నష్టం....ఐడ్స్
కష్టం..అన్నది
జనాలే నిర్ణయించుకోవాలి.
చిన్నప్పటినుంచీ తుమ్మొస్తే..చెయ్యి
అడ్డం పెట్టుకోమని మనం పిల్లలకి నేర్పుతాం,..ఇప్పుడూ
అదే చెబుతున్నారు...కాకపోతే..చెయ్యి
స్థాయి నుంచీ...మాస్కు
స్థాయి వరకు వచ్చింది..ఇంకా
ఇప్పుడు అవతల వాడు తుమ్ముతుంటే..మనం
అడ్డు పెట్టుకోవాల్సి వస్తోంది..దీనికి
మందు...మన
హోమియోలోనే ఉందిట..ఎప్పుడూ
పాస్చాత్యుల్ని చూసి ఇన్ ఫ్లు యెన్స్ అవుతామనఒ ఏంటో దాని పేరు
కూడా ఇంఫ్లుయెంజా...ట..అంతే
కాదు..తులాసాకు,
వేపాకు వేడి నీళ్లలో వేసి వాసన చూసినా తగ్గుతుందట...మరి.
ఈ మధ్య వస్తున్న చాలా జబ్బులు..పేర్లు
కూడా కొన్ని తెలీవు..కిడ్నీ
లో రాళ్ళు,
గాలిబ్లాడర్ లో రాళ్ళు,,.ఊబకాయం
వొళ్ళు....ఇంకా
చాలా.....
కేవలం ఆహార పద్ధతుల వల్లే పెరుగుతున్నాయట.
క్యాబేజీ...టమాటా....లాంటివి
ఎక్కువేసి చేసిన...సాండు
విచ్(ఇసుక
దెయ్యం అనొచ్చేమో),
చీజ్ వేసిన బర్గర్లు..పిజ్జాలు...లాంటి
ఫుడ్డు ఎక్కువయ్యాకనే ...ఇలాంటి
జబ్బులూ పెరిగాయి అని చెప్పడానికి సర్వేలు అక్కర్లేదేమో..
లావు తగ్గడానికి ఏమి చెయ్యాలి డాక్టర్ అని పేరొందిన..కార్పొరేట్
హాస్పిటల్ లో ఫారిన్ లో ట్రైన్ అయి ఫ్లైట్ లో వచ్చిన డైటీషన్
ని అడిగితే...ఎల్
డీ ఎల్...వీ
డీ ఎల్,,హెచ్
డీ ఎల్...లిపిడ్
ప్రొఫైల్ లాంటి వంద టెస్టులు చేసి..
ఫాట్ ఫూడ్డు తగ్గించండి..ఆయిల్స్
తినకండి...పచ్చి
కూర ముక్కలు..కీరా..కారట్
తినండి...మొలకెత్తిన
ధాన్యాలు తినండి..రాగి/ఓట్స్,
లేక పోతే ఆకుకూరల గంజి తాగండి (ఇంగ్లీసులో
సూప్ అంటారు)...రోజూ
నడవండి...అంటూ
కారులో వచ్చిన వాణ్ణి ఫీజు గుంజి...స్వంత
కాళ్ళ మీద నడిపిస్తారు...
సో నే చెప్పొచ్చేదేంటంటే..మన
పద్ధతుల్లో మనం ఉంటే.....ఏ
ప్రాబ్లెంసూ రావు.
కష్టం లో ఉన్న భూమిని (పంది)
వరాహ రూపం లో ఆదుకున్న వేద భూమి మనది...పందుల
వల్ల స్వయన్ ఫ్లూ...వ్యాపింపచేసే..విదేశీ
అనుకరణలొద్దు మనకి.
|
|