Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 3

చింతలవలస కథలు

 

                                                                                 - సమీక్షకులు ; వేమూరి వేంకటేశ్వరరావు

 

bookrelease

రచయిత: డా. మూలా రవికుమార్

 
 

 

తెలుగు కథలలో కొత్తదనం వెతికే వారికి సంపుటం లోని కథలు నచ్చవచ్చు చాల కాలం పాటు తెలుగు కథలు ఇజాల గజిబిజిలో పడి కొట్టుకున్నా, ఇటీవలి కాలంలో కొన్ని కొత్త పంథా కథలు కానవస్తున్నాయి. శాస్తజ్ఞులు, సాంకేతిక నిపుణులూ, వైద్యులూ, మొదలైన వారు కలం పట్టి ఆయా వృత్తులకి సంబంధించిన కథాంశాలతో కథలు రాస్తున్నారు. సంపాదకులు మూస కథలకే కాక వైజ్ఞానిక కల్పనలకి కూడ తావిస్తున్నారు. ఇలా కొత్తరకం కథలు రాసేవారిలో చటుక్కున జ్ఞాపకం వచ్చేవారు కవన శర్మ, ఎలక్ట్రాన్ అనే కలం పేరుతో రాస్తూన్న పింగళి వెంకట రమణరావు, ఈమధ్య పెద్ద వైజ్ఞానిక కల్పన నవల రాసిన చిత్తర్వు మధు. కోవలోకి డా. మూలా రవి కుమార్  చేరేరు.

కథలు చాల వరకు ఉత్తరాంధ్రలో చింతలవలస అనే కుగ్రామం నేపధ్యంలో జరుగుతాయి. పుస్తకంలోని 18 కథలలోను చాల మట్టుకు పాలపరిశ్రమ వేళ్లూనుకుంటూన్న కొత్త రోజులలో జరిగినట్లు అనిపిస్తాయి నా చిన్నతనంలో, పెరట్లో పాడి లేని వారికి నీళ్లు కలియని పాలు, చిక్కటి మజ్జిగ ఎలా ఉంటాయో తెలిసేది కాదు అంటే అది అతిశయోక్తి కాదు. అంతవరకు ఎందుకు? నేను అమెరికాలో మొట్టమొదట కాలు మోపిన మొదటి రోజు, 1961  లో, ఒక కృష్ణా జిల్లా తెలుగువాడు తారసిల్లి, వాళ్లింటికి తీసుకెళ్లి కాసింత చారు అన్నం, మజ్జిగ అన్నం పెట్టేడు. అన్నంలో  మజ్జిగ పోసుకుంటూ, "ఇదేమిటయ్యా మజ్జిగ ఇలాగుంది?" అన్నాను. నేరకపోయి అన్నాను. "నీళ్ల మజ్జిగ తాగి, తాగి అసలు మజ్జిగ ఎలా ఉంటుందో మరచిపోయావు కాబోలు. నిజం మజ్జిగ ఇలాగే చిక్కగా ఉంటుంది," అంటూ చురక వేసేడు మా ఊళ్లో ఆవుని ఇంటికి తోలుకొచ్చి గుమ్మం ముందు పాలు పితికినా మీటరు వేసి చూస్తే అవి నీళ్లపాలే అయేవి. ఇదేమి అన్యాయం అని అడిగితే, "ఖాళీ చెంబులోకి పాలు పితకకూడదయ్యా, ఆవు ఒట్టిపోయి పాలివ్వదు" అనే వాడు పాలవాడు. "పాలల్లో నీళ్లు కలపటం నా జన్మ హక్కు" అని అప్పుడు పాలవాడు అన్నట్లే "మీటరు లేకుండా విద్యుత్తుని వాడుకోవటం నా జన్మ హక్కు" అని కాలపు వాళ్లు అంటున్నారు అన్ని రంగాలలోను దోపిడీ వ్యవస్త మూడు పువ్వులు, ఆరు కాయలులా వర్ధిల్లుతూన్న మనదేశంలో ఇటువంటి కథలు రాయటం తప్ప మనం చెయ్యగలిగేది ఏమీ లేదమో అనిపిస్తూ ఉంటుంది.

కథలలో దరిదాపు సగం కథలు రచన మాసపత్రికలోనూ, మరికొన్ని కౌముది అంతర్జాల పత్రికలోనూ ప్రచురితం అయాయి. ఒక కథకి కథాపీఠం సత్కారం కూడా లభించింది.

అమెరికాలో కాని, పాశ్చాత్య దేశాలలో ఉన్నవారు కాని కినిగి సంస్థ వారు ప్రచురిస్తూన్న -పుస్తకం అతి చవక ధరకి కొనుక్కోవచ్చు. ఒక డాలరు కంటె తక్కువ ధరకి అద్దెకి తీసుకుని చదవొచ్చు. మంచి సినిమాలుకథలు వచ్చినప్పుడు ప్రజలు వాటిని ప్రోత్సాహపరచి పోషించటం ప్రజాస్వామ్యంలో ప్రజలు చెయ్యవలసిన పని.  

ప్రాప్తి స్థానాలు: ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పెక్కు పుస్తక విక్రయశాలలు

అంతర్జాలంలో: kinige E-pustakaM. కొనుగోలుకి రూ. 95/= అద్దెకి రూ. 30/=
http://kinige.com/kbook.php?id=989name=Chinthalavalasa+Kathalu
                         


                    

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech