Sujanaranjani
           
  శీర్షికలు  
       మాస ఫలాలు
 

- రచన : బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి  విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు        

 

బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు వైదిక కుటుంబములో జన్మించి తన తండ్రిగారైన శ్రీ సుబ్బరామయ్య గారి వద్ద తొలిపలుకులు ప్రారంభించి, కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయమున పూజ్య గురుదేవులు శ్రీపాద భట్ గారి వద్ద సిద్ధాంత జ్యోతిషమును అభ్యసించి, తెలుగు విశ్వ విద్యాలయము నందు ఫలిత జ్యోతిషము నందు ఉత్తీర్ణులై గత పుష్కర కాలముగా ఆంధ్ర దేశమున జ్యోతిష పరమైన ముహూర్త, జాతక, సాముద్రిక మరియు వాస్తు శాస్త్ర సేవలందించుచున్నారు .వీరు ప్రస్తుతము కాలిఫోర్నియా ఫ్రీమాంటు హిందూ దేవాలయంలో అర్చకులుగా సేవలను అందిస్తున్నారు.

   

 

 

            మేషరాశి

అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు , కృత్తిక 1 వ పాదము


ఈ రాశి వారికి ఈ మాసం లో పుత్ర, పుత్రికల సబంధించి నిర్ణయాలు తీసుకొనుటలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామి విషయాలలో కూడా జాగురూకత అవసరం. మనసులో ఏదో ఆందోళనగా ఉంటుంది .వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది.కొత్త వస్తువుల కోసం ఖర్చు చేస్తారు.మాస ప్రారంభంలో దైవ చింతన ,యాత్రలు చేస్తారు .మాసం మధ్యలో మనోవ్యధ, అధికారుల వత్తిడి,శత్రు బాధలు. మాసాంత్యంలో వాహన యోగము దేశాంతర ప్రయాణాలు, శుభ కార్య ప్రాప్తి కలుగుటకు అవకాశం ఉన్నది .
ఈ రాశి వారు ఆదిత్య హృదయం పారాయణ చేయుట మంచిది .

   
 

వృషభరాశి

కృత్తిక  2 ,3 ,4  పాదములు,  రోహిణి    4 పాదములు ,  మృగశిర    1  ,  2   పాదములు 

 
ఈ రాశి వారికి ఈ మాసం లో భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చుటకు అవకాశం ఉన్నది .పిల్లలు చదువులో కొంచం వెనుక పడుటకు అవకాశం ఉన్నది .ఋణ సమస్యలు కలగ వచ్చును. వృత్తి లో విరోధాలు ఏర్పడును .వ్యాపారంలో మిశ్రమ ధన లాభాలు కలుగుటకు అవకాశం ఉన్నది. మాస ప్రారంభంలో యత్న కార్యసిద్ది, స్థాన చలనం ,ఆర్యోగ్య భంగము జాయింటు వ్యాపార విషయాలలో సమస్యలు కలుగుటకు అవకాశం ఉన్నది.మాసం మధ్యలో వాహనయోగము, హృదయానందం ,వృత్తి యందు ధన లాభాలు వచ్చుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో విద్యార్ధులకు అధిక శ్రమ అవసరం.మృష్టాన్న భోజనం కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు దుర్గా దేవి పూజలు చేయుట మంచిది .

 
   
 

మిథునరాశి

మృగశిర 3 ,4  పాదములు,  ఆరుద్ర  4 పాదములు , పునర్వసు  1 , 2 ,3   పాదములు 


ఈ రాశి వారికి ఈ మాసంలో సోదరీ, సోదరుల వలన సమస్యలు వచ్చుటకు అవకాశం ఉన్నది .గతంలో మీకు మోసం చేసిన కొందరిని కలుసుకోవలిసి వస్తుంది.దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగము నందు అనుకొన్న పనులు పూర్తి చేస్తారు .ఆరోగ్యము చక్కగా ఉంటుంది . మాసం ప్రారంభంలో భోజన సౌఖ్యము,విద్యా విషయాలలో జయము, శారీరక శ్రమ కలుగుటకు అవకాశం ఉన్నది. మాసం మధ్యలో వాహన యోగము, అధికారుల వత్తిడి మానసిక ఆందోళనలు ఉంటాయి. మాసాంత్యంలో గృహ సౌఖ్యము వ్యవహార విజయము శత్రు బాధలు, నేత్ర సంబంధ బాధలు కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు చేయుట మంచిది

   
 

కర్కాటక రాశి

పునర్వసు  4  వ  పాదము, పుష్యమి  4 పాదములు , ఆశ్లేష  4 పాదములు

ఈ రాశి వారికి ఈ మాసంలో వృత్తి , ఉద్యోగాలయందు అకారణ విరోధాలు వచ్చుటకు అవకాశం ఉన్నది. కుటుంబ వ్యవహారాలూ సవ్యముగా ఆనందముగా ఉండును. బంధు,మిత్రులను కలుసుకొంటారు. ఆకస్మిక వార్తలు వింటారు. మాస ప్రారంభంలో ఉద్యోగంలో ప్రమోషన్స్, స్త్రీ సౌఖ్యము, మానసిక ఆందోళనగా ఉండును. మాసం మధ్యలో వివాహ, విద్య విషయాలలో మంచి జరుగుటకు అవకాశం ఉన్నది.వృత్తి యందు కీర్తి , కార్య సిద్ది,దేశ సంచారం కలుగుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో అధికారుల వత్తిడి,మంచి కీర్తి, శత్రువుల కారణంగా ధన వ్యయం ,వృధా కాలక్షేప పనులు చేయుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు రాహు-కేతు శాంతి చేయుట మంచిది.
   
 

సింహరాశి

మఖ  4 పాదములు,  పుబ్బ   4 పాదములు, ఉత్తర    1 వ  పాదము

ఈ రాశి వారు ఈ మాసంలో కోర్టు వ్యవహారాలలోలాభసాటిగా వింటారు. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు, స్థలాల గురించి చర్చలలో, వస్తువులు ఖరీదు చేయుట యందు అభిప్రాయ బేధాలు వచ్చుటకు అవకాసం ఉన్నది. జాయింటు వ్యాపారుల వైరములు తొలగిపోవును. గృహములో అనారోగ్య ఛాయలు ఉండును. మాస ప్రారంభంలో సంతాన ప్రాప్తి ,అధిక శ్రమ,స్వల్ప సుఖముగ ఉండును. మాసం మధ్యలో తొందరపాటు చర్యలు, స్థాన చలనము, బంధు మిత్రుల సమాగమనము కలుగును. మాసం చివరలో గృహ సౌఖ్యం, ప్రయాణ లాభం, వ్యాపారద్వేశాలు హెచ్చును. పెద్దవారిని కలుసుకొని ఆశీర్వచనములు పొందుదురు.

ఈ రాశి వారు సుబ్రమణ్య స్వామి పూజలు చేయుట మంచిది.

 

   
 

కన్యా రాశి

ఉత్తర   2 ,3 ,4  పాదములు, హస్త   4 పాదములు ,  చిత్త  1  ,  2   పాదములు 

 

ఈ రాశి వారు ఈ మాసంలో ఆలయాలను దర్శించెదరు. ఆసక్తికరమైన సమాచారాలు వచ్చును. అప్రయత్నంగా వ్యాపారమునందు ధన లాభాలు కలిగే అవకాశం ఉన్నది . శ్రమకు తగ్గ ఫలితం ఈ మాసంలో పొందగలరు.కోర్టు వ్యవహారాలలో కొంచెం నిరుత్సాహంగా ఉంటాయి. మాస ప్రారంభంలో తొందరపాటు చర్యలు ధన నష్టము, శక్తి సామర్ద్యముల గుర్తింపు ,శారీరక శ్రమ,స్త్రీ భాధలు ,కంటికి సంబంధించి బాధలు కలుగుటకు అవకాశం ఉన్నది. మాస మధ్య మందు ప్రమాదములు కలుగుటకు అవకాశమున్నది. ప్రభుత్వము తరపున బాధలు .కుటుంబ సమస్యలు, కొన్ని పనులలో జయము కలుగును . మాసాంత్యంలో ఋణ బాధలు హెచ్చును .స్వల్ప ధన లాభములు ,జాయింటు విషయాలలో కొన్ని మార్పులు కలుగుటకు అవకాశం ఉన్నది .
ఈ రాశి వారు శనివారం విష్ణు సహస్ర నామ పారాయణ,పూజలు చేయుట మంచిది.
 
  

   
 

తులారాశి

చిత్త  3 ,4  పాదములు, స్వాతి   4 పాదములు , విశాఖ   1 ,  2,3  పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసం లో రాజికీయ ఒత్తిడి ఎక్కువుగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేస్తారు. విందూ, వినోదాలలో పాల్గొనే ముందు జాగ్రత్త అవసరం ,మాట పడే అవకాశం ఉన్నది. కొన్ని ఋణములు తీర్చే అవకాశాలు ఉన్నవి. మాస ప్రారంభంలో క్రొత్త విషయాలు చర్చకు వచ్చును. బంధు మిత్రులతో విరోధము కలుగుటకు అవకాశం ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చుటకు అవకాశం ఉన్నది.మాసం మధ్యలో కార్య సిద్ధి ,శుభ కార్య ప్రాప్తి,సంతానాది సౌఖ్యము కలుగుటకు అవకాశం ఉన్నది .మాసాంత్యంలో వాహన యోగము,దాంపత్య సౌఖ్యము ,కుటుంబ కలహములు కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు శనివారం నాడు శనైశ్చరునుకి తైలాభిషేకాలు చేయుట మంచిది.

   
 

వృశ్చికరాశి

విశాఖ  4  వ  పాదము, అనూరాధ   4 పాదములు , జ్యేష్ట   4 పాదములు

ఈ రాశి వారు ఈ మాసంలో స్త్రీ వలన సమస్యలు వచ్చుటకు అవకాశం ఉన్నది. అధికారులతో మాట పడుటకు అవకాశం. ఉద్యోగంలో మార్పుకు అవకాశం, గృహములో వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది.ధనాదాయములు సామాన్యముగా ఉంటాయి. మాస ప్రారంభంలో విశేష వస్తు లాభములు, సుఖము, సంతాన విషయ చర్చలు కలుగుటకు అవకాశం ఉన్నది. మాసం మధ్యలో విద్యా,వివాహ ప్రాప్తి, అనుకొన్నది సాధించలేక పోవుట, విలాస జీవిత విశేషాలు ఉద్యోగాభివృది, శత్రు బాధలు కలుగుటకు అవకాశం ఉన్నది.మాసం చివరిలో వివాహాది శుభకార్యప్రాప్తి,మానసిక ఆందోళన,దుర్వ్యయము కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు దుర్గా మాతకి హోమాదులు చేయుట మంచిది .

 

   
 

ధనూరాశి

మూల  4 పాదములు,  పూ.షా   4 పాదములు,  ఉ.షా    1 వ  పాదము

ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంటియందు శుభ కార్య ప్రస్తావన, వ్యాపారము నందు కొత్త పెట్టుబడులు పెట్టగలరు.కీళ్ళకు సంబంధించి బాధలు అధికంగా ఉండును. ఔషధ వాడకం అధికంగా ఉండును. పరిచయ వ్యక్తులతో ప్రయాణాలు చేయుదురు. మాస ప్రారంభంలో తల్లి సౌఖ్యము, శత్రువులచే సమస్యలు, దూరదేశ ప్రయాణములకు అవకాశం ఉన్నది. మాసం మధ్యలో అధికారుల వత్తిడి ,దుర్వ్యసనములతో వృధా ఖర్చు, స్వల్ప ధన లాభములు ,ఉన్నత పదవి పొందుటకు అవకాశం.మాసాంత్యంలో శత్రు మూలకంగా ధన నష్టము ,పుత్ర, పుత్రికల వివాహ చర్చలు ,మనోవ్యధ కుటుంబ సౌఖ్యమునకు అవకాశం ఉన్నది .
ఈ రాశి వారు గురువారం దత్తాత్రేయ స్వామి పూజలు చేయుట మంచిది .
 

   
 

మకరరాశి

ఉ.షా  2 ,3 ,4  పాదములు, శ్రవణం   4 పాదములు , ధనిష్ఠ    1  ,  2   పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసంలో వివాహ శుభ కార్యాలకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు .ఉద్యోగ విధి నిర్వోహణ చాకచక్యంగా నిర్వహించి కీర్తి సంపాదించగలరు. ఆరోగ్యం సామాన్యంగా ఉండును. నూతన వస్తువులు సేకరించెదరు. భాగస్వామ్య వాదములు ప్రారంభమగును. ఋణములు తీర్చెదరు. మాస ప్రారంభంలో అధికారుల ప్రశంస్యలు పొందెదరు. కార్య విఘ్నం. సాహస యాత్రలు చేయుదురు. మాస మధ్యమందు పుత్ర,పుత్రికల వలన బాధలు ,అధికారుల ఒత్తిడి ,ధార్మిక పనులు నెరవేర్చుట ,మనోవ్యధగా ఉండుటకు అవకాశం ఉన్నది.మాసాంత్యంలో స్త్రీల బాధలు , భార్యా,పుత్రులతో విరోధములు, నేత్ర బాధలు వచ్చుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు చిత్ర గుప్త పూజలు చేయుట మంచిది .

 

   
 

కుంభరాశి

ధనిష్ఠ     3 ,4  పాదములు, శతభిషం   4 పాదములు ,  పూ.భా   1  ,  2 ,3  పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసంలో సంసారిక విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి .ఆదాయం బాగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో ఇబ్బందులు వచ్చుటకు అవకాశం ఉన్నది. మీ పిల్లల పనులు విషయంలో శుభ పరిమాణం కోసం చేసే ప్రయాణాలు విజయం కాగలవు.మాస ప్రారంభంలో ఆరోగ్యలోపం, స్తానచలనము, మాసం మధ్యలో స్త్రీ లచే బాధలు, శుభ కార్య ప్రాప్తి వ్యాపారంలో స్వల్ప నష్టం.మాసాంత్యంలో స్థాన చలనము,గుమస్తాలతో విరోధములు, వాక్కాట్టిన్యముగ ఉండును.ఉన్నత పదవులు పొందుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు ఆదివారం ఆదిత్యహృదయం పారాయణాలు , అర్చనలు ,పూజలు చేయవలెను.

   
 

మీనరాశి

పూ.భా    4  వ  పాదము, ఉ.భా   4 పాదములు ,  రేవతి   4 పాదములు 

ఈ రాశి వారు ఈ మాసంలోఆరోగ్యం గురించి చర్చించుట మంచిది తక్కువ ప్రయాణాలు చేయుట మంచిది. వివాహ జీవితంలో జాగ్రత్త అవసరం.సమస్స్యలు వచ్చుటకు అవకాశం ఉన్నది.శ్రమ అధికంగా ఉండును. మాస ప్రారంభంలో సామాన్య లాభాలు,ఇష్టకార్య సిద్ది,వివాహ చర్చలు వస్తాయి.మాసం మధ్యలో అధికారుల ఆగ్రహానికి గురి అవుటకు అవకాశం ఉన్నది.మానసిక ఆందోళనలు,స్థానచలనము,.మాసాంత్యంలో వ్యతిరేకతలు, వ్యాపారమునందు ధనాదాయము, నీచులతో స్నేహం గౌరవ భంగము కలుగుటకు అవకాశం ఉన్నది.
ఈ రాశి వారు లలితాసహస్ర పారాయణ చేయుట మంచిది.

 

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech