కవితా స్రవంతి  
      నిరంతరం తానే .......?

- రచన : నెల్లుట్ల సుదర్శన్ రావు

 

కురు వృద్దులు
గురు వృద్ధులు
పతి వీరులు చూడగా
పరాభావమాయెను పాంచాలి !

అన్రుతమాడని
ఆయనగారి వలన
అమ్ముడయిపాయే
అతివ చంద్రమతి !

అపరాత్రి కూసెను
కుక్కుట మొకటి
పరాజితాయెను
పడతి అహల్య !

పైవన్నీ పురాణాలయితే
ఆధునికంలో కూడా
అంగట్లో తూకమాయే
ఆడదాని జీవితం !!

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech