Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  బాలవేదన
 

- రచన :  బుదవతి శివనారాయణ

 
 


బాలలం బాలలం
భగవంతుని దూతలం
భాగ్య విధాతలం
భావి ప్రపంచ నేతలం
నవసమాజ నిర్మాతలం
విశ్వమాత బిడ్డలం
విశ్వకవి విద్యార్ధులం
బాపూజీ వారసులం
చాచాజీ గుండెపై గులాబీలం

బ్రహ్మ సృష్టించాడు అపురూపమైన అమ్మని
అమ్మ సృష్టించింది అందమైన ఇంటిని
అదిఒక ప్రేమమందిరం
అమ్మ ప్రేమదేవత
నాన్న వరాలిచ్చే దేవుడు

బ్రతుకుకొక్కటే బాల్యం
మనిషికదెంతో మధురం
మరువలేనిది తిరిగిరానిది
అది జీవితపు వసంతం
చిగురించే ఆశల కదంబం
చింతలు ఎరుగని ఆనందం

పక్షుల్ని పలకరించాలని
గువ్వలా ఎగరాలని
చేపలా ఈదాలని
స్వాతిముత్యాన్ని తాకాలని
ఇసుక గూళ్ళు నిర్మించాలని
ఆకాశమంత కోర్కెలు పెంచుకున్నాం
ఆశలపందిరి వేసుకున్నాం

కాని మాకేమిచ్చిందీసమాజం
దారిద్ర్యపు దేవతలు
కాలుష్యపు రక్కసులు
రోగాల మహమ్మారులు
మూడాచార పిశాచాలు
యుధ్ధాల మారణ హోమాలు

అనాధ బాలలం
అభాగ్యజివులం
దిక్కులేని పక్షులం
తింటానికి కూడులేదు
వుంటానికి గూడులేదు
వంటినిండా గుడ్డలేదు
కాలే కడుపులు
నోచుకోని చదువులు
బాల్యపు వెట్టివాళ్ళం
బలవంతపు భిక్షగాళ్ళం

బాల కార్మికులం
బలవంతపు శ్రామికులం
అమ్మానాన్న ఉన్నవాళ్ళం
పనికిపోయే పెద్దవాళ్ళం
వయసుకు మించిన వృత్తులు
ప్రాణాపాయపు పనులు
అరకొర సౌకర్యాలు
అన్న్యాయపు వేతనాలు
మాచేతులు కందిపోయెను
మానవ్వులు నల్లపడెను
మాభావిత బుగ్గి ఆయెను

కాన్వెంటు బాలలం
కవాతు జవానులం
మమ్మీల డాడీల డ్యూటీలు
ఆయాల ఆలనలు పాలనలు
అందరున్న అనాధలం
ప్రేమకు నిరుపేదలం
బడంటే భయమేస్తుంది
ఒక ఆనందం లేదు అనుభూతి లేదు
బామ్మల కబుర్లు లేవు
తాతయ్యల కధల్లేవు
వారి బాల్యం మాకేది

బాలికలం బాలికలం
భ్రూణ హత్యలతో ప్రారంభం
మా బాధల కదంబం
తొలిచూలు పుత్రికైతే
కనేవారే కలియుగ కంసులౌతారు
బతికి బట్ట కట్టిన
లింగవివక్ష చూపుతారు
ఆడపిల్లకు చదువెందుకని
ఆదిలోనే బడి మాన్పిస్తారు
గుండెలమీద కుంపటని
బాల్య వివాహాలకు బలిచేస్తారు
వరకట్న పిశాచాలకు ఎర వేస్తారు

బాలికల బతుకంతా బాధలు
ఆడపిల్లంటే తల్లివంటిది
ఆదిమాత లేకుంటే ఈ జాతి వుండేద
జనని లేకుంటే ఈ జగతి వుంటుందా
 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech