Sujanaranjani
           
  కవితా స్రవంతి  
 

శివోహం

 

రచన: - వికాస్ విన్నకోట

 
 

పిచ్చుకలు కనపడితే బ్రహ్మాస్తాలు
జుట్టు దొరకని మరుక్షణం కాళ్ళు
భస్మాశురుడు చెయ్యిఎత్త్తలనుకున్నడు
రవణాసురుడు పేగులనే మీటాడు
అరచేతిలో వైకుంఠాలూ ఉంటాయి
నుదుటిమీద బ్రహ్మరాతలూ ఉంటాయి
త్రిగుణాలున్నా మనిషిదొకటే గుణం
సమయం సందర్భాల సందుల్లో తిరగడం
గౌతమన్యాయాలు గంగలొకలుపుతాం
మళ్ళీ అదే గంగలో మునుగుతాం
మౌనవ్యాఖ్యలు చేసినవాడు
మకిలి మనోగతాలెరుగడా?
వైక్లాబ్యాలు విక్రుతాలు
వికరాలు వ్యగ్రతలూ
అన్నీ గరళతుల్యం
అంతా శివోహం.

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech