Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  జీవితం
 

రచన:  వరకురు గంగా ప్రసాదు

 
 

 

నీళ్ళు రాని కళ్ళు లేవు
పుళ్ళు లేని కాళ్ళు లేవు
రాళ్ళు పడని ఇళ్ళు లేవు
గుచ్చుకోని ముళ్ళు లేవు
పెళుసు కాని మనసు లేదు
వెలిసి పోని వయసు రాదు

కానని దే కాటు లేదు
కాగల దే చేటు లేదు
యాతనలకు లోటు లేదు
వాతలకిక చోటు లేదు
పతనమవని మోజు లేదు
మథనమవని రోజు రాదు
జీవితం... ఓ.. జీవితం.. నీవొ కథా సాగరం..

కథలు కథలు వ్యథలేనా?
కవితలన్ని సొదలేనా?
దారులన్ని పొదలేనా?
బ్రతుకు రథం కదిలేనా?
కదలని కథ మొదలైనా
మొదలు రొదలు మదిలోన
మదినిండా చెదలేనా??
చెదలంటే మనమేనా??
మనమంటే మన మేనా?? మనమంటే మనమేనా??
మనకు మనం మహనీయం, మనుగడనే మననీయం
మనతో మన రణం రణం, మనకన్నీ తృణం తృణం..
జనం తృణం, కాననం తృణం,
మనమున జనగణ మననం తృణం,
కరుణారుణ గుణం తృణం, ధరణీ రుణ పణం తృణం,
వన ధనమున ధగ ధగ నగు, ఖగ మృగ మగు,
జగముకు తగు మొగమెరుగక దిగజారిన రోగమేగ మనం?? భవరోగమేగ మనం??
 
మనముంటే కనదేదీ??
మనముంటే మనదేదీ??
మనకంటూ తగదేదీ??
మనకంటే మృగమేదీ??
 
అందుకనే కాబోలు.. మనకు నుదుటి రాతలు
అందుకనే కాబోలు.. మనకు నుదుటి వాతలు
జీవితం... ఓ.. జీవితం.. కాదు కథా సాగరం.

పనీపాట లేని శక్తి రాసిన పుటలే ఐతే
ఆటుపోటులన్ని ఆటపాటలుగా తీసుకో..
నడకలు నేర్పేందుకు నిన్నెంటాడే వేటే ఐతే
వడివడిగా పరిగెడుతూ బాటవై సాగిపో..
గుంతల్లో సాగుతున్నా పడకుండా పట్టుకుని,
కలతల్లో వేగుతున్నా కడదాకా హత్తుకుని,
కనులు మూసి తీసికెళ్ళే.. ఆ  చేతులు అమ్మవి ఐతే,
చీకటిలో చందమామ చూపుటకని తెలుసుకో.
ఆసాంతం అశాంతం మాపుటకని నడచిపో..
జీవితం... ఓ.. జీవితం.. నీవే నా స్థావరం..
జీవితం... ఓ.. జీవితం.. నీవె కదా నా వరం..

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 





సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech