Sujanaranjani
           
  శీర్షికలు  
 

దేవుడనే ఆ పరమ శక్తి ఎందుకు లేదు?

మానవుడు అల్పుడేమీ కాదు. కాని యీ బ్రహ్మాండ విశ్వంలో ...స్వల్పుడే 

        

 

 - రచన : చెట్టూర్ శివశంకర్  

 

 

నాస్తికులైనాఆస్తికులైనా ఒకేరీతిగా సృష్టింప బడినవారే.  ఎంత చర్చించుకున్నా, ఒకరినొకరు మన్నించుకోవాల్సిందే. మరి నాస్తికవాదాన్ని చదువడానికిగాని, వినడానికిగాని ఆస్తికులు జంకుతారు, ఇన్నేళ్ళు నమ్మిన తమ విశ్వాసాన్ని కోల్పోతామేమోనని. చదువరులకుగాని పండిత,శాస్త్రజ్ఞులకు గాని అలాటి జంకు అవసరమేలేదు అని చెప్పడానికే యీ కొద్ది మాటలుమామూలు మాటలు. మరో కారణం ఎవరికి  వారే ఆలోచించుకోవాలని.   

దేవుడెక్కడ? వున్నాడని నమ్మితే అది గుడ్డి నమ్మకమే అని నాస్తికుల ధోరణి గమనించిన  తర్వాత, ఇంతమంది నమ్మిన "దేవుడెందుకు లేడు? అనే తర్కం స్పురణకు వస్తుంది. కొత్తవి లేవుఅందరికి తెలిసిన విషయాలేమరి

దేవుడనేవాడున్నాడా? ఎందుకు లేడు? ఇవి సామన్యుని ఆకళింపులో  తెగే అంశాలు కావుగదా?.   ఎవరినైనా నమ్మించే యావ నాకెందుకు?  ఆధారాలు, రుజువులు ఎక్కడఅడ్డంగా తర్కాలు వస్తే, తట్టుకోవడం తమాషా కాదు.  అబ్బో, అని ఆలోచించడానికి ముందే భౌతికంగా, మానసికంగా అలసిపోతాం.

విషయమైనా  భౌతికాతీతమై  గణనకు అసాధ్య మైనప్పుడు, "ఇన్ఫినిటీఅనే  పదాన్ని వాడతారు.   పైన,  తర్వాత... "అనంతం"..  అన్న వుహతీత భావనలకు  "ఇన్ఫినిటీ"   అన్న మాటనే ఊతగా తీసుకుంటారు. అట్లాగేఅనంతుడుపరమేశుడు. .ఇత్యాది మాటలు ఆయామతాల భావనలో, పరమాత్మ శక్తికి REFERENCE గా ప్రయోగించబడి,  ఆద్యంత శక్తిపరిమాణాన్ని  స్పురిమ్పజేయడానికి,   ఆధ్యాత్మిక   ప్రసంగాలలో ప్రామాణికాలుగా నిర్దేశ మైనవి

విశేష మైన  పరిశోధనా ఫలితాల సముదాయమే "సైన్సు". అలాటి భౌతికాది శాస్త్రాలతో  మానసిక శక్తి, ప్రక్రియలను,  ఆధ్యాత్మికాన్నీ కొలతలు చేయబోయిసైన్సు ఒప్పుకోదే, అనే ధోరణి సరైనది కాదుగదా. దేవుదనబడే పరాకాష్ట శక్తి స్వరుప చ్గైతన్యాలను అంచనా చేయడానికి , యీ విశ్వంలో మానవుడు నిర్మించిన సైన్సు సంపూర్ణము కాదుసరైన పరికరమూ కాజాలదు మరెంతో మరెంతో...ఒక "ఇన్ఫినిటీ"గా  ఆయా  దిశల్లో ప్రగతి సాదించినా, అది అంతే.!

మన  దేహమెలా వచ్చింది, దానికి జీవమేలా  వచ్చింది? యీ  విషయం మనమే తెలుసుకోలేమా?  పక్కనున్న వార్నో, శాస్త్రజ్ఞులనో అడిగితే సరిపోతుందా? లేదూ, మనకు మనమే సృష్టి కర్తలమా ఒక  గీత   నేరుగా   గీయలేని  మన పెద్దలే  మనల్నింత  సుందరంగా తయారుచేసి  ప్రసవించారు గదా? వీరందరూ  సృష్టి కర్తలే అని చంకలు గొడతామా

సింహాలను పెద్దపులులను సంకరం చేసి దరిమిలా జన్మించిన జీవిని మనమే ఆధునిక  శాస్త్రవిజ్ఞాన పాటవంతో   సృష్టించామని  ఆపాదించుకోగాలమా?    కృర్త్రిమ గర్భధారణ చేయిన్చినంతనే, మరే శక్తి లేదూబిడ్డను  సృష్టించామని ఎలా అనగలం

పుట్టుకతో, మన ఎరుకలేకుండా వచ్చిన ప్రాణం,దేహం, మెదడు, ఆలోచనలతోనే  ఎన్నో సంగతులు కనుగొని  INVENSIONS  చేసినంత మాత్రాన,మానవులమైన మనమే  సృష్టి కర్తలుగా ఎలా చలామణి ఔతాం?.       నోరు, నాలుక, పళ్ళు  మనవేఎలా నమలాలి, ఎలా నాల్కను ఆడించాలి, పంటి కింద పడకుండా;  మరి జీర్ణ క్రియనైనా  మన  స్పృహతో  మన బుద్ది, జ్ఞాన  ఆదేశాలతో వీటిని నిర్వహించ గలమా? యీ ప్రశ్న అవసరం లేదుజవాబు తెలిసిందే. కాని మహా శక్తి వునికి ఇంతే అని, అంతే అని తేల్చివేయడం  మానవునికి అసాధ్యమే.

మందులతో  శస్త్ర చికిత్సతో ఎనలేని స్వస్థతలు  లభిస్తున్నవి వాటికోసం అంచలంచలుగా ఆసుపత్రులుఅంత మాత్రాన ఆధునిక వైధ్యులైనా ప్రాణ దాతలుగా ఎవరైనా  చలామణి కాగలరా?    విగత జీవికి ప్రాణమివ్వగల పరమాత్మ శక్తి కాగలరా? 

మరి మరణం సంగతేమిటి. మరణించే వారికి తెలీడం లేదు. మరణిస్తున్నవారు  చెప్పడమూ లేదుమరణించేముందు భౌతికమైన  తన వస్తువులేమవుతాయనే  తపనతోనే  మరుగై పోతారు. మరణం సంగతంతే. ఒకవేళ  మరణ రహస్యం ముందుగా తెలిస్తే,  అనాహుతం చేయక మానముగదా? తెలీకుండా ఉండడమే క్షేమమేమో. విశ్వంలో ఎన్నో గోళాలు, గ్రహాలు నక్షత్రాలు ఒకే శక్తి   నియంత్రణలో   సమన్వయ  అవగాహనలతో  మనుగడ  సాగిస్తున్నవి; జీవుల పుట్టుకలు, మరణాలు మనుగడలు సాగుతున్నాయి.పండితులు వాదులాడితేనో, ఆస్తికులు, నాస్తికులు చర్చించు కొంటేనో  ఇంకోలానో   పరిష్కారమయ్యే విషయ మేమికాదు.    అదికాదులే, మతానికొక్క టిగా విడి విడి పమాత్మ శక్తులు వున్నాయి అని డబాయిస్తే, అలాటి శక్తులు,వాటితోబాటు ఖగోళాలు కుస్తీలు పట్టకుండా ఊరికే   కూర్చోవుగదా..  


సనాతనమున మతకుత్సితాలులేని   నిష్ఠగా  పరమాత్మవేషణ సాగినదిఆధునిక నాగరికతా  పోకడే   తుదిజ్ఞానమని  తలచకసత్యమేమనిసమదృష్టితో సంస్కారయుత కృషి జరిగితేనే జిజ్ఞాసు మార్గామౌతుంది.  ఆస్తికులు, నాస్తికులు   అపహాస్యం  ధోరణి వదలి సరైన పంధాలోనే అన్వేషణ, పరిశోధన సాగించడం న్యాయం.నాస్తికులైనా, ఆస్తికులైనా ఒకేరీతిగా  సృష్టింప బడినవారే. ఒకరినొకరు మన్నించుకోవాల్సిందే

 

దేవుడున్నాడా అన్న ఆలోచనలో, పరమాత్మ ఏమని, భారతీయ సంస్కృతిలోని   ఉపనిషద్  ధోరణి   ఏమని  అధ్యసించవలసి వున్నది కదా?   జిజ్ఞాస పథంలో వివిధ ధోరణులతో ఎంతటి   తర్కానికైన సబబైన సమాధానమివ్వగల  సమర్థులుప్రముఖు లెందరెందరో!   వారి చేయూత ఎంతో అవసరం       

 

నాస్తికులపై అభిశంశగాకాక,   నాస్తిక వాదానికి సమాదానమేమనే , నాకు తటస్థించిన  'దేవుడు లేడ' నే ధృడమైన నాస్తికవాద సరళికి    'దేవుడనే పరమేష్టి శక్తి' ఎందుకు లేదని ఆస్తికులతోబాటు నాస్తికులూ గమనించాలని మరిన్ని అంశాలను  యీ క్రింద పొందు పరచాను                              

                                      భగవతుదనబడే  ఆ పరమ శక్తి ఎందుకులేదు?

1          దేవుడున్నాడా అన్నఅంశం క్లిష్టమైనది. దేవుడులేడని నాస్తికులు ఒక్క మాటలో తెగేసి చెప్పేది కాదు. జిజ్ఞాసు తత్త్వం  అవసరం. దేవుడున్నాడా అన్న పధంలో జిజ్ఞాసు అన్న పదాన్ని ఆసక్తి,  inquisitive అంటే 'ఊరికే విచారించే' అన్న అర్థాలకు వాడడం సబబు కాదు. తెలుసుకోవడం' అన్నది   కేవలం సరళ  పదం  ఒక సత్యాశం అనిగాక జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆశించు,అన్వేషించు అన్నస్థాయీ  అర్థాలే   సరిపోగలవు. 

2        దేవుదేక్కడున్నాడు, చూపగలరా అని ప్రశ్నించే వారిని, ఎందుకులేడని తిరుగు ప్రశ్నవేస్తె , ఒక ప్రశ్నకు  తిరుగు ప్రశ్న ఎన్నటికి సమాధానం కాబోదంటారు.     

              అటువంటి భావన  అన్నిసందర్భాలలో సరికాదు. ప్రశ్నించిన వార్ని 'మీరుగా ఆలోచించుకోండి', 'తెలుసుకోండి', 'అదెలా' అనే ప్రశ్నలే సబబైన జవాబులయ్యే సందర్భాలు వుండనే ఉంటవి.  దేవుడున్నాడనేవారు ఎంత అన్వేషణచేయాలో, లేడనేవారు అంతే అన్వేషిన్చుకోవాలిగాని  అవతలివారే చూపించాలని భావిస్తే అది భాద్యతకు దూరమే.

౩        భగవంతుడు లేడని వాదించేవారు తమ కళ్ళకే కనబడ లేడని,తమ ఇంద్రియాలకు బుద్దికి  దేవుడున్నట్లు ఆధారాలు లభించలేదు కాబట్టే  దేవుడు లేడని చేసే  వుద్గాటన చేస్తారు. 

           జీవరాసులలో కేవలం ఒకడైన  మానవుడు  ఎంతటి ప్రగతినిచేరినా, తనకే, తనఇంద్రియాలకే, మనసుకే  అన్ని విషయాలు తెలిసిపోవలసినదే అన్న పోకడ బుద్ది జీవికి తగనిది.  అన్ని శక్తులకు అతీతమైన ప్రామాణాలు మానవునికే వున్నవనే భ్రమతో, అనువుగాని ఆలోచనతో తను సాధించిన  భౌతికాది శాస్త్రాలే జ్ఞానమని, వాటితోనే  ఆధ్య్యత్మికాన్ని కొలతజేయబోయి సైన్సు ఒప్పుకోలేదే అనే తోసివేసే పోకడ సమ్మతించదగనిది.

            భగవంతుదనబడే  ఆపరమ శక్తి ఏది? ఎక్కడ? అనే అన్వేషణలో  ఆధ్యాత్మిక  జ్ఞానుల సోదనా ప్రక్రియలేమిటి?  వాటిని  ఎవరివద్ద నేర్వాలి? సాదారణ భక్తులు, పూజారులు,సన్యాసులు, సిద్దాన్తులు, డంబాల బాబాలు చెప్పగలరా?   సంపూర్ణ  ప్రయత్నమేమి  చెయ్కుండా, చేసిన ప్రయత్నం  పరిపుర్ణమా అనే రుజువు లేకుండా, అన్వేషణాపోకడ,  స్థోమతలు  మరేవొ వుండ వచ్చనే  ఆలోచనలేకుండా , దేవుడో, దేవుదనబడే పరమ శక్తి  లేదని  తుది నిర్ణయంగా  ప్రకటిస్తే ఔనౌననే వారుండరు. 

           సత్యాన్వేషణా పథం తెలిసినవారెవరైనా, వారి నుండి అభ్యసించే అర్హత వున్న వారు లేరని నిర్ధారించి వుండ వచ్చు. విశ్వమంతటి సృష్టికి, దాని మనుగడకు దేవుదనబడే  ఒకేఒక  పరమేష్టి శక్తి  మాత్రమే. బ్రహ్మాండాన్ని పరుమానువు అంచనా వేయజాలనట్లే, పరమేష్టి శక్తిని ఉజ్జాయింపు జేయగల సామర్థ్యము మానవుని మేధకు మించినది.  దేవుడు లేడని రుజువులుతేగల  నాస్తికుడు లేడు. 

            సత్యమేదో తెలియాలని పట్టుబడితే, అవితెలిసేందుకు మానవుడు సరిపోగలడా అన్నది ప్రధానం. ప్రపంచమంతా ఎందఱో పెద్దలు. ఇలా వ్రాశారని, అలా చెప్పారని చదువుతూ పోతే., మన ఆలోచనలు sabotage ఐపోతవి. తుది నిజమేమని తెలియజేయడానికి  క్లిష్టత ఉండనవసరం లేదు. చిన్న చిన్న నిరూపణలైనా, స్పష్ట మైనవిగా వుంటే చాలు.   

4       దేవుడున్నాడనేందుకు వేరే రుజువులెందుకని, మనల్ని సృష్టించిన వాడే భగవంతుడు అనే ఆస్తిక వాదులు ముందుగా భగవంతుడున్నాడని రుజుపర్చాలని  నిలేస్తారు నాస్తికులు. అంతేకాక ప్రతి దానికి ఒక సృష్టి కర్త వుండి తీరాలన్నపుడు, ఆ భగవంతునికి  మాత్రం సృష్టి కర్త ఉండాల్సిన అవసరం లేదా, అనికూడా  ప్రశ్నిస్తారు.

        ఎంతటి ప్రముఖ నాస్తికునికైనా, కనీసం  తానెట్లా పుట్టింది, జీవ   మేలా వచ్చింది, ప్రాణమెలా వెళ్లి పోతుంది అన్న సంగతులుకుడా తెలియ నప్పుడు, ఆ పరమ శక్తి ఏది లేదనే  భ్రమ ఎందుకు? విశ్వమంతా గాలించాము, శోదిన్చాము ..దేవుడు లేడు.  అనే వారు  లేడని రుజువు పర్చనప్పుడు, నమ్మిన వారు మాత్రమే  ఆ పరమ శక్తి  వున్నట్టు రుజువు చేయాలనడం సమబద్దం,  న్యాయం  ఎలా ఔతుంది?  కేవలం  సాదారణ భక్తులనో , పూజారులనో, సన్యాసులనో,, సిద్దాన్తులనో, బాబాలనో,    పట్టుకుని ఒక్క వూపు వుపితే, ఝడుసు కుంటారు . దాంతో  దేవుడో, ఆ మూల శక్తో లేదుపో అంటే ఎలా పూర్తవుతుంది?   లేదని వాదించే వారిలో ఎంత  పస  వీరిలో అంతే వుంటుంది...దేవుడున్నాడో లేడో....ఎవరికి తేలక పోయినా  అలానే  వుంటాడు. లేడు అనే విమర్శ,వాదనలు ఏకోవకు చెందినవైనా  ఆ పరమాత్మ గణనకు  ఎలావస్తవి?

5     "ఛీ..ఛీ..భగవంతుడికి ఒక సృష్టికర్త ఉండడం ఏమిటి? అతడే అన్నిటికీ మూలమైన స్వయంభూ అయితే?" అని ఆస్తికులంటారని,  అలా భగవంతుని 'ఒక స్వయంభూ' అని ఊహించుకోగలిగిన ఆధ్యాత్మిక వాదులు, పదార్ధం కూడ 'స్వయంభూ' అని నాస్తికులంటే మాత్రం అంగికరించరు,ఇదెంత విడ్డూరం!" అని నాస్తికులు విడ్డూర పడతారు. 

        మరి నాస్తికులు అట్టి పదార్టమే 'స్వయంభుసృష్టికర్త'కు సమమని వాదిస్తే, మరి భగవంతునివలె అట్టి పదార్ధం తానుగా  ఏమేమిటిని  సృష్టించిందన్న ప్రశ్నకు జవాబు వుండదు గదా ... 

6       స్వయంభూ అయిన పదార్ధం, అంటే పదార్థాల పరమాణువులకు  సృష్టికర్త లేడని, పరమాణువుల సంఘాత విఘాతాలతో  ఏర్పడిన విశ్వమంతా 'స్వయంభూ' అని నాస్తికులంటారు.

         మరి ఒక నిర్ణీత క్రమానికి గాని, క్రమంలో జరిగే సంఘాత విఘాతాలకుగాని  చైతన్య శక్తి ఎలావచ్చిందనే తప్పనిసరి యోచన అవసరమే గదా . వుహాతీతమై, మానవ మేధకు ఆకళింపుకాని, విశ్వమంతటి మనుగడకు కర్త అయిన  ఆ పరమశక్తినే పరమేష్టి అనిగానీ భగవతుడనిగాని ఆరాదించక దుయ్యబడితే  అది  సభ్యతా పథం కానేరదు. 

7      ఆ పరమాణువుల లో  ఉన్న ప్రోటాన్లు,ఎలక్ట్రాన్లు,న్యూట్రాన్లు వగైరా పార్టికిల్స్ వివిధ పరిమాణాలలో కలవడం చేతనే దృశ్య ప్రపంచం లోని పదార్థాలు ఏర్పడ్డాయని నాస్తికులంటారు.

        అలా అంత సులువుగా నిర్ధారణ జరుగదుకదా. ప్రోటాన్లు, ఎలెక్ట్రాన్ తదితరాలు ఆరీతిలో కలవడానికి, చైతన్యం కలుగడానికి  కారణమైన  శక్తి ఏది అన్న విశేషం తెలియాలి గదా? ఆ పరాకాష్ట శక్తినే దేవుడని గౌరవించక తప్పదు కదా.  

      నాస్తికులు మరోమాట చెబుతారు.. "పదార్ధం అంటే తయారుచేయబడ్డ వస్తువు కాదు.ఏదైతే ఈ విశ్వానికి మూలమో,ఏది శక్తికి నిలయమో, ఏదైతే రూపం మారడం తప్ప నశించడం ఉండదో,  ఎల్లప్పుడూ గమనం లేక గతి కలిగి ఉంటుందో, ఆ కారణంగా ఏది నిత్య పరిణామ శీలమో, దేని పరిణామ ఫలితంగా జీవమూ, ఆ తరవాత మెదడు, నాడీ మండలం, వివేచన , వివేకం వరుసగా ఏర్పడ్డాయో, దేని మీద ఆధారపడి భావం, ఆలోచన మనగాలుగుతున్నాయో, అదీ  పదార్ధం అంటే"అని.    

            అలా ఆస్తికులు వచించే " పరమాత్మా శక్తి" నే మరో పేరుగా, పదార్థమని  నాస్తికులుచేసే  యీ విశ్లేషణ కొంతమేరకు బాగున్నది. కాని " పదార్ధం"  అన్న మాటలో  గరిమలేదు. అన్నింటిని నిర్మించి నిర్దేసించేది  ఆ పరమేష్టి శక్తి ఒక్కటే. నాస్తికులు ఇంకో మాట కూడ చెపుతారు,"ఈ విశ్వాన్నంతటినీ నడిపే ఒక శక్తి ఉంది-- అని ఆస్తికులంటారని, కాని  పదార్ధం బయట ఏ శక్తీ లేదు; అనశ్వరమైన పదార్థంలోనే ఆ శక్తి ఇమిడి ఉంది" అని.  పదార్థమనే ఆపాదనగాక,వుహాతితమై తుదిగావున్నఆ పరమేష్టి అనబడే శక్తి లోనే అన్ని ఇమిడి వున్నై అనే ఆస్తికుల భావన వేరు కాదు.

9          నాస్తికుల పరిగణలో, "ఎంత గొప్పదైనా ఆ శక్తికి విచక్షణా పూర్వకమైన చైతన్యం లేదు. ఉదాహరణకు విద్యుత్ శక్తి.  విధ మార్గాలలో ఉత్పాదన చేసిన విద్యుత్ ను కావలసిన ప్రాంతానికి పంపిణీ చేసి వినియోగించుకుంటున్నారు.ఆ విద్యుచ్చక్తి పరిమాణం ఎన్ని వేల వోల్టు  లైనా  ఆ శక్తి మానవుడు చెప్పినట్లే వింటూ ఊడిగం చేస్తూనే ఉందికదా?" అని.

            మానవునికి శరిరంతోబాటు జీవమనే ప్రాణం , మెదడు లభిచినవే కానీ,తనకు తానుగా ప్రాణ ప్రతిష్థ చేసుకోలేదు. అట్లా లభించిన చైతన్యంతోనే మెదడును పదను బెట్టుకొని  అవసరాన్ని బట్టి  ఎన్నో  పరికరాలు , యంత్రాలు కనుకొన్నాడు. ప్రయోగాలలో తటస్థ పడిన ప్రక్రియలతో విద్యుత్ శక్తి వంటి శక్తి ప్రక్రియలు కనుగొని , అవసరాలకనుగుణమైన, తన నియంత్రణలోనే ఉండగల   ఎన్నో యంత్రాలను ఇంవెంట్ చేసుకున్నాడు., అంటే,కనుగొన్నాడు. భేష్! అంతమాత్రాన ఏ INVENTOR తనే సృష్టికర్తనని గొప్పలు పోలేదు. మానవుడు తను  నిర్మించిన యంత్రాలను  తనే నియంత్రించ గలడు. 

            ఎరుకకు వచ్చే నిజమేమిటంటే , ప్రక్రుతి  శక్తులన్నీ Super Human Correlation తో , అంటే, మానవాతీత అనుసంధానంతో,    వ్యవహరిస్తాయి. ఒకే మహాశక్తి నియంత్రణలో వుంటై. అలాకాక  యితరంగ  వుండి వుంటే,  ఒకటి కొకటి డీకొని ఊహించని స్థితీ  ఏర్పడేది. అప్పుడు  మనం,మన చర్చలు ఉండేవికాదు, హాయిగా. మనమెరిగిన విద్యుత్  తదితర శక్తులు ఎంతటి బలీయములైనా , ప్రక్రుతిశక్తుల ముందు అల్పమైనవి. 

10 ,11      ఆ విద్యుత్ శక్తినే  ఆస్తికులు 'భగవంతుడు'  అంటారా, మరితెలివిగా లోబరుచుకుని వినియోగించుకుంటూ దాని చేత అరవ చాకిరీ చేయిస్తున్న మానవుడు' సూపర్ గాడ్' కాదద అని నాస్తికులు ప్రశ్నిస్తారు.

             అలాటి ప్రశ్నకు తావులేదు. వుహకందని ఎన్నో చైతన్యాలకు కర్త భగవంతుండు. అలాటి ఒక చైతన్యం పొందినది మాత్రమే విద్యుత్ శక్తి. వెనుకటి పేరాలలో తెలిపినట్లు,ఏ INVENTOR (పరిశోధకుడు)తనే భగవంతుడని, సూపర్ గాడ్ అని, సృష్టికర్తనని గొప్పలు పోయిన దాఖలాలు లేవు.వుండవు.

12         వదలకుండా నాస్తికులు ఇలా అడుగుతారు,"విద్యుచ్చక్తి ఎంత గొప్ప శక్తి అయినా దానికి విచక్షణాయుతమైన స్వంత చైతన్యం లేదు.అది ఎంత పాపులనైనా ఇన్సులేటర్లు వాడి జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ చేయలేదు.ఎవరైనా పుణ్యాత్ముడైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే షాక్ కొట్టి ప్రాణాలు తీస్తుంది.మరి  కర్మఫలదాతగా భగవంతుడికి ఉండాల్సిన యుక్తాయుక్త విచక్షణ లేనట్టి ఈ శక్తిని భగవంతుడని ఎలా అంగీకరిస్తారు ఆస్తికులు? ఏనుగుకు ఎంత శక్తన్నా ఉండనివ్వండి.అది యుక్తిపరుడైన మావటీడు యొక్క  అంకుశానికి లోబడి ఉంటుంది.అలాగే ఒక యుక్తా యుక్త విచక్షణ లేని  పోట్లగిత్త తనని సమీపించిన వారినందరినీ కుమ్మేస్తుంది..దానికి పుణ్యాత్ముడూ, పాపాత్ముడూ అనే ఎరుక ఉండదు.పదార్ధం లో ఇమిడి  వున్న  ఆ గొప్ప ప్రకృతి శక్తి,  పైన చెప్పుకున్న పరిమితుల కారణంగా భగవంతుడు కానేరదు".

          ఒక కరెంటు విషయంలో  పాపులు,పుణ్యాత్ములే కాదు సాంకేతిక నిపుణులుకూడ అప్రమత్తులై వుండాల్సిందే. కేవలం విద్యుత్ శక్తినే భగవంతుడని సృష్టి కర్త అని విజ్ఞు లెవ్వరు అనరు.  విద్యుత్తులోని చైతన్యానికి కారకుడు ఎవరనే అన్వేషణే ముఖ్యం. ఇతరులు, పుణ్యాత్ములు ...వీరిసంగతెమో గాని ,  మావటికి లొంగిన  ఏనుగే మావటిని మర్దించిన సందర్భాలు, సాదువుగావున్న పొట్ల గిత్తలు కొల్లలు. భగవంతుడున్నాడా అన్న మీమాంసలో  కరెంటు, ఏనుగు, పోట్లగిత్త వంటి దృష్టాంతాలు కేవలం అల్పమైనవి.   

13       సూర్యుడికి పూజలూ పునస్కారాలూ చేయడం నిరర్ధకం అనే అభిప్రాయంతో ప్రత్యక్షంగా అందరు ఎరిగిన ప్రక్రుతి శక్తి, సూర్యుడిని నాస్తికులు ఘాటుగానే  ఇలావిశ్లేషిస్తారు :

         "సూర్యగోళం కేవలం ఒక మండే వాయు గోళం.అక్కడ నిరంతరం హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియంగా మారే ఫ్యూషన్ ప్రక్రియ అక్కడ సాగుతూ ఉంటుంది.ఆ చర్య సందర్భంగా అపారమైన ఉష్ణ శక్తీ, కాంతీ వెలువడుతాయి.అక్కడి నుంచి భూమిపైకి కిరణాలద్వారా ప్రసరించే వేడీ, వెలుతురూ భూమి మీది జీవజాలానికి ప్రాణ ప్రదమైనవి. అయినంతమాత్రాన, సూర్య నారాయణుడి పేరిట కొందరిచే ప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న అపార శక్తి స్వరూపుడైన సూర్యుడికి  స్వంత చైతన్యం, యుక్తాయుక్త విచక్షణ ఉండవు.తన నుంచి కాంతీ, వెచ్చదనం బయటికి రాకుండా చేయగల శక్తిగానీ , తనలో నిత్యం జరుగుతున్న పరమాణు సంఘాతం కారణంగా ఉత్పత్తి అవుతున్న వెలుతురు, వేడిమిల ఉత్పత్తిని నిలిపివేసే సామర్థ్యము గానీ  ఆయనకు లేవు.మనమేదో ఆయనకు రుణపడి ఉన్నామని ఆయన్ని ఆరాధించడం అవసరం మాత్రం కాదు.చెప్పులువేసుకుని, గొడుగు నీడన వెళ్ళే ఒక పాపిని మార్తాండుడు ఏమీ చెయ్య లేడు. అలాగే పుణ్యా త్ముడే అయినా ఒక వ్యక్తి మండు వేసవిలో కాళ్ళకు  చెప్పులూ, తలపై గొడుగూ లేకుండా వెళుతూ ఉంటే  సూర్యుడు తన కిరణాలతో  ఇబ్బంది పెట్టకుండా ఉండనూ లేడు.మండు వేసవిలో  ఆయన తాను ఇష్టపడే వారికి శీత మయూఖుడు(చల్లని కిరణాలు ఇచ్చేవాడు)కాలేడు.తనకు నచ్చని వారికి ప్రత్యేకించి చండ ప్రచండుడు కాలేడుఆ విచక్షణ సూర్యుడికి లేదు కనుక ఆయన భగవంతుడు కానేరడు.సూర్యుడికి పూజలూ పునస్కారాలూ చేయడం నిరర్ధకం"

        మానవునికి ప్రత్యక్షంగా అగుపడుతున్నసూర్యుడే సృష్టి కర్త ఎలాఔతాడు? చైతన్యం ఇవ్వబడిన సూర్యుడు సృష్టిలో భాగం మాత్రమే. కనబడే శక్తిస్వరూపమైనా, కనబడనిశక్తులైనా మానవుడు దండాలు పెడితే అన్ని ఇచ్చేయాల్సిందే అని అపోహ పడడం గాని. అలా దండాలు పెట్టేవారిని విమర్శించడం ఉత్తమం కాదు.      

          సూర్యుడు ఏ ఏ ప్రక్రియలతో ఉంటాడో అలానే వుంటాడు. అలా వుంటాడు, ఇలా వుండాలి ,అలా వుండాలి అని  శాస్త్రీయం పేరిట విమర్శించినా , ప్రయుజనమేమి? మానవుడు సూర్య రస్మిలో తెలివిగానే బదుకుతున్నాడు, ప్రయోజనాలు పొందుతున్నాడు . కృతజ్నుడుగా  ఉండకపోతే  అతనిదేకోవకు చెందిన సభ్యత?  అన్నంపెట్టి ,పెంచి ,పోషించే  కుటుంబ పెద్దకు రోజూ దండాలు పెట్టి పుజిస్తామా?  అంతకు మించిన విధేయత  కృతజ్ఞతలతో  వుంటాం. నీదో గొప్పా?  నీకు వుద్యోగమిచ్చిన వాడిది గొప్ప. అని కించ పరచ గలమా? 

14    "ప్రకృతి శక్తులను వాటికున్న అపార శక్తి కారణంగా ఆరాధించబూనుకుంటే  ఎక్కడో సూర్య గోళం ఎందుకు?  ప్రతి అణువు,పరమాణువు లో కూడా అనంతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఇన్ని కోట్ల కోట్ల పరమాణువులను కూడా పూజిద్దామా?" అని కూడ నాస్తికులు సలహానిస్తారు 

           అవును. ప్రతి అణువులోను శక్తి ఉండనే వుంటుంది. పరాకాష్ట శక్తి ఎటూ అవగతమయ్యేది కాదని,  అణు సముదాయమైన విగ్రహన్నో, సూర్యుణ్నో పూజించి సామాన్య మానవుడు సరి పెట్టుకుంటాడు. పోతే, ప్రకృతిని చేదించి, విజయాలు సాదించాడని, నాస్తికులు చెబుతున్న విశిష్ఠ మానవులకు అణువణువునకు పూజలర్పించే  సామర్థ్యం ఉంటుందేమో. కనుక్కోవాలి.    

15    మానవుడే మహా నాయకుడని భావింఛి నాస్తికులు మరింతగా గొప్పలు పోతూ యిలా అంటారు. "ప్రకృతి శక్తులు మానవుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తిమంత మైనవని బెదిరి పోవాల్సిన పని లేదు.మానవుడు.  ఆ ప్రకృతి శక్తుల రహస్యాలను భేదిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. ఆ క్రమంలో అక్కడక్కడా ఎదురుదెబ్బలు సహజం.ఒక క్రమ పద్ధతిలో ప్రకృశక్తి తి శక్తులపై విజయాలు సాధిస్తూ ఎంతటి శక్తినైనా తన అదుపాజ్ఞలలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు మానవుడు."

         ఎలా బెదరడు?  మానవుడు చేదిస్తూ పోతున్నాడు, ప్రకృతిపై విజయం సాధించాడు అని పురెక్కించినా ప్రయోజనం లేదు. కేవలం బస్సు దొరక్క పోయినా  నీరసిస్తాడు మానవుడు. సునామిలోచ్చినా, భుకంపాలోచ్చినా...వాటిని అదుపు ఆజ్ఞల్లో ఉంచే  మానవ మొనగాళ్ళు లేరని మాననవునికి బాగా  తెలుసు. మతమేదయినా, అదేదో మానవునికి అలివిగాని శక్తి పరాకాష్టగా వుందని మాత్రం, మానవునికి తెలుసు.తర్కానికి అందని విషయమనికుడా అతనికి తెలుసు. 

         సంశ యాలకు ఆయా శోధనులను/ శోధకులను   అడగవలసిందే.  విడిగా తర్కిన్చినా, విమర్శించినా అనుగుణంగా వుండదు. ప్రస్తుతమున్న శక్తి, ప్రక్రియలు సుర్యున కెలా వచ్చాయి , ఎవరిచ్చారు అన్న అన్వేషనే ముఖ్యం. "దైవ కణం " కనుగొనబడడం మహత్తర విషయం. అయినా ప్రస్తుత విశ్లేషణకు, అన్వేషణకు అనువుగా లేదుగదా. దైవకణాన్ని వాకబు చేసినా దేవుడి గూర్చి సమాచారం ఇవ్వలేదు.

16      పరాకాష్ట శక్తిని, నాస్తికులు కేవలం ఒక పదార్థంగా చూపాలని ఇలా చెబుతారు:   " యొక్క అణువణువులోనూ శక్తి నిక్షిప్తమై ఉన్న మాట వాస్తవం. అందుకే కొందరు అపార శక్తిమంతమైన ఆ పదార్థాన్ని' బ్రహ్మ పదార్ధం' అంటున్నారు. పోనీ, ఆ శక్తినే మనం భగవంతుడు అందామా? మరి, భగవంతుడికి ఉండాల్సిన స్వంత చైతన్యం,యుక్తాయుక్త విచక్షణ,పాప పుణ్యాల పరిజ్ఞానం,జీవులకు కర్మ ఫలాలను ప్రసాదించే సామర్థ్యం అణువులు, పరమాణువు లలో  నిక్షిప్తమైవున్న ఆ శక్తికి ఉన్నదా? లేదే?"

       బ్రహ్మ పదార్థ మంటే బ్రహ్మకు చెందిన పదార్థ మని, వస్తువని మాత్రమే. వస్తువే బ్రహ్మ,పరాకాష్ట శక్తి అని ఎవరు నిర్వచించరు.....

17      జీవ మెలా ఏర్పడిందని నాస్తికులు ఇలా నిరూపించ జూస్తారు   "ఆ పరమాణు సంఘాతం కారణంగా ఏర్పడిన పదార్ధం ఒక క్రమ పరిణామం చెంది,జీవ పదార్ధం ఏర్పడి,ముందుగా ఏకకణ జీవులుగా, అవి మరింత పరిణామం చెంది బహుకణ జీవులుగానూ , బుద్ధిజీవులుగానూ  రూపొందడం జరిగింది".

          జీవ పదార్ధం ఏర్పడినది అన్నంత మాత్రాన ఎలా సమన్వయ మౌతుంది? సులభమేమీ కాదు గదా . " జివ పదార్థానికి జీవమేలా, జీవ చైతన్యమెలా కలిగింగి? మూల  శక్తి ఏది? అన్న విషయాలు అన్వేషింప బడి, అంతిమ నిర్ణయం జరుగ లేదు గదా.

18     బుద్ధిజీవులలోకెల్లా అంతిమంగా యుక్తాయుక్త  విచక్షణ, వివేచన, హేతు దృష్టి కలిగిన  సర్వోత్కృష్ట జీవి అయినట్టి 'మానవుడు' ఏర్పడ్డాడు.పరిణామ క్రమంలో ఆ మానవుడు కూడా రోజురోజుకీ మరింతగా తన విజ్ఞానాన్నీ,వివేకాన్నీ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. విచక్షణ లేనివాడిని మనం 'పశువు' అంటున్నాం.అంటే మానవుడు పశువుకంటే విచక్షణలో మెరుగ్గా ఉంటాడనే కదా?చైతన్యం,స్పందన, ఆర్ద్రత లేని మానవుడిని 'వాడొక బండరాయి' అంటాం. అంటే బండరాయి కంటే మానవుడు మెరుగైన చైతన్యం కలిగి ఉన్నాడనే కదా? తిరిగి ఆ బండరాయిలోనూ,ఆ పశువులోనూ కూడా శక్తి దాగి ఉంది కాబట్టి,ఆ శక్తిని భగవంతుడు అనడం,ఆ భగవంతుడే మనల్ని నియంత్రిస్తున్నాడు అనడం ఎంతమేరకు శాస్త్రీయ దృక్పథం ? అనేది  ఒకసారి ఆలోచించండి.అన్నిట్లోనూ భగవంతుడు ఉంటే ఈ పరిణామానికి అర్థం, విలువ ఏమైనా ఉన్నట్లా? లేనట్లా? యోచించండి.విచక్షణ లేని శక్తి పరిణామ క్రమంలో విచక్షణను, వివేకాన్నీ సంతరించుకుంటే అది మునుపటి దశ కంటే మెరుగైన దశా? కాదా?

     ఆదేవుడి సంగతి అవసరం లేదు. పక్కనబెట్టి, అ కోణంలో, అలోచేనే మానేయవచ్చు.. రాయి రప్పల సంగతి వదిలేయోచ్చు.    మరి. మానవుడు తనకు తానే  శరీరాన్ని, బుద్ధినీ ఏర్పరచుకున్నాడని నిర్విమర్శగా  ఏ సై న్స్ రుజు పరచింది? . యీ సంశయం తీరితే అపార ప్రగతిని చేరినట్లే. 

          ముగింపుగా   యీకొద్ది యోచనలు: .                                                                    

          "మనకున్న శాస్త్రీయ" గరిమ ఎంతనే విషయం ముఖ్యం. మానవునికున్న"జ్ఞానా"న్నుపయోగించే, అదివరలో మనమెరుగకుండా మరుగునున్నవిషయాలను కనుగొన్న ప్రక్రియల సముదాయమే మనకవగతమైన శాస్త్రమని గమనించ వలసివున్నది. జ్ఞామన్నది శాస్త్రానికన్న బలీయం. 

           దేవుడో, ఆ మూలశక్తో లేదుపో అనేస్తే ఎలా పూర్తవుతుంది? విశ్వమంతటిని శోధించేశాము, ఇంకేమి మిగల్లేదు . ..దేవుడు లేడు. .. అనే వారు అలా శోదించామనడానికిగాని, దేవుడో ఆపరాకాష్ట శక్తో లేదుపో అనడానికిగాని ఋజువులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనడం సబబుకాదు. 

 జనావళిలో ' దేవుడున్నాడా, లేడా ' అనే విషయాలేవీ పట్టనివారే ఎక్కువ శాతం. "బుద్ధిజీవులమైనందున ఎలాంటి విచారణ చేయకుండానే దేవుడున్నాడనో లేక లేడనో నిర్ధారణకు వచ్చేసెయ్యడం సబబు కాదు అని ఓవేపు చెబుతూనే, ఇదమిత్థంగా చెప్పలేనట్టి, దైవం అనే ఒకటి ఉన్నదని మొండిగా భావించడం కంటే, లేడని భావించడమే సబబనే" అభిప్రాయం నాస్తికులు వెలిబుచ్చితే, అది  స్వయం వ్యతిరేఖమౌతుంది.  

           మానవుడెరిగిన శాస్త్రీయ దృష్టితోనో, సామాన్య దృష్టితోనో చూసినంతనే "ఆ పరాకాష్ట శక్తి" అవగతమవ్వాలని ఎవ్వరాసించినా విజ్ఞతకు దూరమే. 

           ఖ్యాత వేదాంతి ఒకరు సముద్రపొడ్డున వ్యహాళికి వెళ్లారట. అక్కడొక గుంపును, మధ్యలో ఒకవ్యక్తిని చూచాడట. ఆ వ్యక్తి ఇసుకలో ఓచిన్న గొయ్యి తవ్వి, చిన్న బొక్కెనతో సముద్రంనుండి నీరు తీసుకొచ్చి ఆగుంటలో పోస్తున్నాడట. " ఎం చేస్తున్నావ్" అని వేదాంతి ప్రశ్నిస్తే, "సముద్రాన్ని యీ గుంటలో వేస్తా"నని బదులిచ్చాడట. ఎప్పుడూ నవ్వని ఆవేదాంతి పక్కున నవ్వి, " పిచ్చివాడా, అంత గొప్పా సముద్రాన్ని యీ చిన్న గుంటలో ఎలావేస్తావ"ని అడిగాడట. ఆ వ్యక్తి, " ఏం, అంతటి గొప్ప విశ్వాన్నే నీ చిన్ని బుర్రలో యిముడ్చుకుందామని నీవు నమ్ముతుంటే, యి మాత్రం నే చేయలేనా? అని చిన్నగా నవ్వాడట. అవును. మానవుడు అల్పుడేమీ కాదు. కాని యీ బ్రహ్మాండ విశ్వంలో ...స్వల్పుడే.

           అపారమైన ఆ పరాకాష్ట శక్తికి, దాని కాలచక్రానికి, మానవుని పూర్వం, ఆధునికం అనేవి కేవలం లిప్త మాత్రం.  ఎలాంటి విచారణ చేయకుండానే దేవుడున్నాడనో లేక లేడనో నిర్ధారణకువచ్చేసెయ్యడం సబబు కాదు. సరే,నిజమే. కానీ, అట్టి అభిప్రాయం వేలిబుచ్చుతూనే, 'దేవుడు లేడని,అదే సబబు ' అనే అభిప్రాయం ఇచ్చేస్తే ,అదో అభిప్రాయం మాత్రమే ఔతుంది. 'దేవుడు లేడు' అనే నిర్ధారణకాలేదు గదా! 

           అలాగే భౌతిక, ఖగోళాదిశాస్త్రాలెన్నివున్నా,ఎన్నెన్ని సూత్రాలు కనుగొన్నా, ఆభగవంతుడనే ఆ పరమ శక్తిని మానవుడు ఇంతవరకు కనుగొనలేదు, తెలిసికోలేదు. కనీసం, మన పుట్టుక మరణాల కిటుకు తెలిసినా కొంత ప్రగతి సాధించినట్లే. కేవలం అలాటి శక్తి ఏదీలేదని తేలికగా వాక్రుచ్చితే, అది ఒక అభిప్రాయం మాత్రమే. నిర్ధారణ కాదు.

             "ఇదంతా ఎవరో తెలివైన భగవంతుడు చేసిన సృష్టి కానేకాదని శాస్త్ర విజ్ఞానం ఎప్పుడో రుజువుచేసేసింది" అని గట్టిగ చెప్పేయడం కూడ సరిపోదు. మానవుడెరిగిన శాస్త్రీయ దృష్టితో " ఆ పరాకాష్ట శక్తి" అవగతమవ్వాలని ఎవ్వరాసించినా, శాస్త్ర విజ్ఞానం ఎప్పుడో రుజువు చేసిందని చెప్పినా, సంపూర్ణ అన్వేషణజరిగిన రుజువులతో మరి అన్ని మతాలవారికి,దేవాలయాలకు విస్తృతంగా ఇంతవరకు ఎందుకు ప్రచారం చేయలేదు? క్లుప్తంగానైనా చెప్పకపోతే అది మృగ్యంగా మిగిలిపోతుంది.

           ఒక న్యాయవాది పోకడతోనే యోచించదమనేది సంశోధన కాదు. పరాకాష్ట శక్తినే దేవుడని అన్వయిన్చుకుని దేవుడున్నాడు, కాదు కాదు. అది అసంబద్దం దేవుడు లేడు. అనే ధోరణులు రెండు వుండగా, రెండు యోచనలు అవసరమే. చర్చకు మించిన ఆలోచనా పంధా చాల అవసరం.స్వార్థ చింతనతోనో మరేదో కారణంతో దేవుడున్నాడనే మతాలు వచ్చాయనో , అలాగే, అందుకు వ్యతిరేక చింతనతోనో మరేదో కారణాలతో దేవుడు లేడని వేరుమాతాలు వచ్చాయనో అనే అభిప్రాయాలు అవసరమైనవి కాదు. అవి జొరబడితే, "దేవుడున్నాడా" అన్నఅన్వేషణా ఆలోచనలు అసలు బాధ్యతను పంధాను కోల్పోతవి. చర్విత చరణాలైన ఉపన్యాసాలను ఎందరో వింటారు. విషయాలు కొలిక్కిరావు. మరచిపోబడతవి. భావ ప్రవాహానికి తావు లేకుండా, ఆలోచనలోనే చర్చా తర్కాలు పరిశ్రమించ బడితేనే, జిజ్ఞాసు మార్గం సుకరం, ఉత్తమం. ఏ ఏ తాత్విక వాదులు ఎలాటి తప్పిదాలు చేసారనో, అవతలివారు ఎమాలోచించారానో, వారిది ఏమతమనో, ఏనమ్మకమనో,...అనే ఆతురతకన్న, ఏది చదివినా ఎదివిన్నా, తమకు తాముగా ఆకళించుకొన్న పరిజ్ఞానమే ప్రభావితం చేస్తుంది. అంతటా,అన్నిటా ఆవరించిన దేవుడనబడే ఆపరాకాష్ట  శక్తి  ఏదని స్పురణకు చేరుస్తుంది.

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech