సిలికానాంధ్రుల సంబరాలు

"తెలుగులో గజళ్ళ జల్లులు"

2000 వేలమందికి పైగా జనం మధ్య, సిలికానాంధ్ర సారధ్యంలో తల్లాప్రగడ, మానాప్రగడల సం యుక్త సారధ్యంలో విడుదలైన "అంతా సోహం" అనే CD ఎన్నో ప్రశంసలనందుకుంది. CD ఆవిష్కరణ అయిన 24 గంటలలో అన్ని కాపీలూ అమ్ముడుపోవడం కార్యనిర్వాహకులను ఆశ్చర్యచకితులను చేసింది. జయదర్శినీ హౌసింగ్ వారి సౌజన్యంతో ఈ ఆవిష్కరణ కూచుభోట్ల ఆనంద్ గారి ఆధ్వర్యంలో విస్సమ్రాజు శ్రీఫణిగారి చేతిలో జరిగింది. ఈ సందర్భలో మాట్లాడుతూ తెలుగులో గజల్ ప్రాచుర్యం ఇంకా పెరగాలని అదీ మన సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతుందని కూచిభోట్ల ఆనంద్ అభిప్రాయపడ్డారు.

తెలుగులో గజల్ సాహిత్యభవిష్యత్తు గురించి ఈ CD గజల్ రచయిత శ్రీ తల్లాప్రగడ ప్రస్తావిస్తూ , "ఉర్దూ సాహిత్యంలో గజల్ అతి ప్రాచీనమైన, ప్రాముఖ్యమైన సాహిత్యం. ఈ గజళ్ళను తెలుగులో వ్రాయాలని, పాడాలనీ ఎందరో ప్రయత్నించారు కానీ, ఇప్పటికీ ఈ కళ తెలుగులో అంత ప్రాముఖ్యతను సంతరించుకోలేకపోయింది. దీనికి కారణం, ఉర్దూ భాష గజల్ క్రమనియమాలకు అనువుగా ఉండే పదజాలతో అభీవృద్ధిచెందటమే. కానీ తెలుగులో ఇటువంటి పదాలు లేవు కాబట్టి కాఫియా, రదీఫులు తెలుగులో కష్టతరమవుతాయి. దానితో కవికున్న భావ స్వాతంత్ర్యం తగ్గుతుంది. అందుకని గజల్ నియమాలను, తెలుగుకు అనువుగా మార్చుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని" అభిప్రాయపడ్డారు.

అంతా సోహం అనే ఈ CD లో తన ముందు మాటలో శ్రీ ఆనంద్ కూచిభొట్ల ఈ రచనలను ప్రోత్సాహిస్తూ ఇలా అన్నారు. "ఉర్దూసాహిత్యప్రక్రియ ఐనటువంటి ఈ గజల్ తెలుగుకి కొత్తదే. నిజానికి గజల్ లో ఎన్నో ఘరానాలు వారి వారి సొంత సంప్రదాయ క్రమాలను నిర్మించుకున్నా, వాటన్నిటిలోను ముఖ్యమైనవి, అందమైన భావవ్యక్తీకరణ, మేలిమి హాస్యధోరణి, షేర్ లో చివరి మాట వినగానే "వహ్ వా" అని అనిపించే మెలికలున్న మెళుకవలునూ. వీటికి ప్రాధాన్యతనిస్తూ అవసమైతే గజల్ చందస్సులో పెద్దలచే నిర్దేశింపబడిన తగిన మార్పులను అన్వయించుకుంటూ, తెనుగీకరణ చేయబడ్డ పద్దతిలో, వ్రాస్తే గజళ్ళకు అందం వస్తుందని" అన్నారు. ఇవే గజళ్లతో సిలికానాంధ్ర నిర్వహించిన గజల్ గాంధర్వ కార్యక్రమంలో ప్రేక్షకులను తల్లాప్రగడ ఆనంద డోలలాడించారనీ, దీనికి కారణం ఈ సరికొత్త రచనా విధానమే ననీ ప్రదర్శకులు అభిప్రాయపడ్డారు.

ఇందులో మక్తాలో రామచంద్ర అనే "తబ్లస్" లేక మకుటంతో తల్లాప్రగడ రచించిన ఈ గజళ్ళకు శ్రీసాయి మానాప్రగడగారు స్వరకల్పన చేయడమేకాకుండా, అద్భుతంగా పాడారు. గజల్ కి రచన ప్రాణం అయితే వాటిని ధరించేది, గానం. గానం లేకుండా గజల్ కి అందం లేదు. అంతా సోహం గజళ్ళకు సంగీతం సమకూర్చిన మానాప్రగడ మాట్లాడుతూ "గజల్ పాడే విధానం సామాన్యం గా తబలా, హార్మొనియంల సహకారం తోటీ జరుగుతుందనీ, వీటికి క్రొత్త వాయిద్యాల సహకారంకూడా అందించి అధునీకరిస్తే అవి సామాన్యులకూడా ఆకట్టుకోకలుగుతుందనీ" అభిప్రాయపడ్డారు. ఈలా ఒక కొత్త రచనా ప్రక్రియకు, ఆధునిక సంగీతసహకారం సమకూరితే వీనులకు విందయి, అందులో భావము అర్థమయి, షేర్ లోని చివరి మాట వినేటప్పటికి అందులోని హాస్యరసం అకస్మాత్తుగా బయటికి వస్తే, అందులో శ్రోతలకు అనిర్వచనీయమైన ఆనందం వస్తుందని అభిప్రాయపడ్డారు.

తల్లాప్రగడ, మానాప్రగడ ఈ క్రొత్తభావాలతో నిర్మించిన ఈ ప్రయోగాత్మక సమర్పణే "అంతా సోహం" గజళ్ళు. సిలికాన్ వేలీలో లభించిన ఈ స్పందనను తీసుకొని, ఆంధ్రదేశంలో కూడా వీటిని ఆవిష్కరించడానికి యుద్ధప్రాతికపదిన సన్నాహాలు సాగుతున్నాయని వీరు వివరించారు. మానాప్రగడ శాయిగారు, ప్రముఖ నేపద్యగాయకులు, జానపదబ్రహ్మ కీ.శే. మానాప్రగడ నరసిమ్హమూర్తిగారి ప్రథమ సంతానం. సంగీతం వీరి ఊపిరి అయితే, వారు కట్టిన పాటలు అమెరికాలోని తెలుగువారికి సుపరిచయాలే. జానపద గేయాలు ప్రస్తుతకాలంలో వింటే వీరి నోటనే వినాలి అనటం అతిశయోక్తి కాదు. తల్లాప్రగడ సిలికాన్ వేలీ లోని ప్రముఖ రచయిత. వీరు వాసిన కవితలు, పద్యాలు, గజళ్ళు, నాటకాలు అతిప్రాచుర్యంపొందాయి. వీరు సుజనరంజనికి సంపాదకత్వభాధ్యతలను వహిస్తూ, సిలికానాంధ్రకు కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తల్లో...1
ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తల్లో...2

"ఆనందమానందమాయెనే..."

మూడువారాల క్రితం జరిగిన 'ఆంధ్ర సాంస్కృతికోత్సవం' లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కార్యక్రమం - 'ఛాయా <-> రంగం'. కొండిపర్తి దిలీప్ ప్రయోగాత్మకమైన అంశంతో, కిడాంబి మాధవ పట్టుసడలని హాస్యరచనతో, కార్యదీక్షుడైన అయ్యగారి శాంతివర్దన్ దర్శకత్వంలో నిర్వహింపబడ్డ ఈ విన్నూత్న ప్రయోగం అందరి మన్నలను పొందింది. ఈ సందర్భంగా 'ఛాయా <-> రంగం'లో కథానాయకునిగా నటీంచిన దశిక సూరజ్ గారి స్వగృహంలో విందు జరిగింది. నటీనటవర్గం మరియూ సాంకేతికవర్గం పాల్గొని ఆనందాన్ని పంచుకొన్నారు.

"చిన్నారికి స్వాగతం!"

శాయి మానాప్రగడ గారు సిలికాన్ వేలీలో తెలుగువారందరికి పేరున్న సంగీత కళాకారులుగా పరిచయమే. వారు సిలికానాంధ్ర నిర్వహించే కార్యక్రమాలకు క్రమం తప్పకుండా వీనులవిందైన సంగీతం సమకూరుస్తారు. అక్టోబర్ 4న శాయి మరియు లక్ష్మి దంపతులకు ద్వితీయ కుమార్తె, హిమరీ స్వర జన్మించింది. ఈ సందర్భంగా 'సుజనరంజని ' మానాప్రగడ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నది.