సిలికానాంధ్ర విశేషాలు

ఘనంగా సాగిన ఉత్సవ సంబరాలు!!

సిలికానాంధ్ర ప్రత్యేకతను చాటుతూ అక్టోబర్ 6న కన్నుల పండుగగా జరిగిన ఏడవ 'ఆంధ్ర సాంస్కృతికోత్సవం'లోని కొన్ని ముఖ్యాంశాలు:.

- ఏడు గంటలకు పైగా నూరుశాతం తెలుగుతనాన్ని నింపిన, ప్రేక్షకులను కట్టిపడేసిన మనోరంజకమైన కార్య్క్రమాలు

- మూడువందలకు పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులు

- రెండు వేలకు పైగా హాజరై ఆనంద డోలికలూగిన ప్రేక్షకులు

- పెద్ద అండగా నిలిచిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ 'సత్యం కంప్యూటర్స్ '

- రంగస్థలంపై నటులు, చలనచిత్రంలోని నటీనటులు పరస్పరం మారుతూ హాస్యప్రధానంగా సాగి అందరిని అబ్బురపరచిన విన్నూత్న ప్రయోగం, 'ఛాయా <-> రంగం'

- పురాణాల్లో నిర్వచించిన ఏదుగురు తల్లులను (కన్నతల్లి, భూమాత, రజమాత... మొదలగువారు) ప్రశంసిస్తూ వోలేటి పార్వతీశం రచించిన గేయాల సంగీత నాట్య రూపకల్పన, 'జగమంత జననీ'

- సరిక్రొత్త ప్రయోగాలు చేసే కొండిపర్తి దిలీప్ నటించి, దర్శకత్వం వహించిన గొప్ప చారిత్రాత్మక నాటకం, 'చాణక్య శపథం'

- శ్రావ్యమైన త్యాగరాజ కీర్తనలకు మనోరంజకంగా కూచిప్డి అభినయయం, 'స్వరాభినయ స్వారస్యం'

- పంచతంత్ర కథల ఆధారంగా రూపొందించిన 'బొమ్మలు చెప్పిన కథ ' (పప్పెట్ షో)

- తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకత్వంలో వెలువడిన 'సుజనరంజని ' ప్రత్యేక సంచిక, 'కుటుంబ కాదంబరి '

- నోరూరించే పదహారణాల పసందైన తెలుగు భోజనం

- ఈ బృహుత్కార్యాన్ని ముందుండి నడిపించిన రథసారథులు, నూకల సిద్ధార్థ, చివుకుల రవి అవిరామ కృషి

- ఎన్నెన్నొ... ఇంకెన్నెన్నొ...