పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

ఆధారాలు :

నిలువు:

1. శివలింగ పీఠము (4)

2. మాయగాడు, మోసగాడు (3)

3. ధృతరాష్ట్రునికి నూరుగురు, పాండురాజుకి ఐదుగురు ఉన్నారు (3)

5. అన్యాభిప్రాయాన్ని మార్పు లేకుండా ప్రస్తావించుట (5)

6. సరిగమల వరుస కూర్పు లేక ఆడతగిన లేక పాడతగిన ధ్వనుల కూర్పు (2)

7. అస్సలు మొహమాటం లేనివాడు (3)

9. పాము, కుక్క, పక్షి ఈ మూడింటికి సాధారణంగా ఉన్నది (2)

12. ఎంత పెద్ద మొత్తంలో ఉన్న 'చెక్కు ' అయినా ఇది లేందే చెల్లదు (3)

14. పొగ త్రాగటం నేరమని తెలిసినా దీన్ని కొంతమంది వదలరు (2)

15. స్త్రీ (2)

17. వార్థక్యం (3)

18. చర్మంతో తయారయిన ఒక రకమైన వాయిద్యం (6)

19. పూర్వం పొగబండికి దీన్ని వాడేవారు (2)

20. ఒక తిండి పదార్థం... మొక్కజొన్నలు లేక బియ్యంతో తయారుచేస్తారు... బొరుగులు (3)

22. ఛాయాసూర్యుల పుత్రుని ప్రతాపం (6)

23. చాలా తక్కువ వెల (5)

24. మనకా ముచ్చట లేదుకదా (2)

26. పలుపుతాడు, మొలతాడు ఏదైనా ఇదిలేందే నిలవదు (2)

27. బూడిదగుమ్మడి, లేదా సగ్గుబియ్యంతో కూడా వీటీని తయారుచేస్తారు... తినే వంటకం (4)

28. ఉత్తమస్త్రీ (4)

30. పత్రం (2)

అడ్డం:

1. ప్రస్తుతం పిలబడుతున్న పాట్నాకి ఒకప్పటి పేరు (5)

5. కొంత నీటిలో కలిసే తేలికైన వాయువు (4)

8. జంబుకం (2)

9. అనుకూలమైన (2)

10. వేపకాయంత 'వెర్రి ' ఉన్నట్లు (2)

11. పంటపొలాలు (4)

13. తగులు, అవమానించు (3)

16. బంధువు (3)

18. సూత్రధారుడు దారాలతో తెరవెనుక నుండి ఆడిస్తూ ప్రేక్షకులకు వినోదం కలిగించే ప్రక్రియ (6)

21. దిక్కు (2)

23. మంచంకోడు (2)

24. స్త్రీ (3)

25. పశుపక్ష్యాదుల అరుపు (3)

27. సన్నని బట్ట (4)

29. ఉప్పుకారాలు లేని పదార్థాలు, గుడి తేడాతో (5)

30. వెలుగు లేక కాంతి. ఎక్కువగా సాగింది అంతే (2)

31. మర్రిచెట్టే (2)

32. మెలకువగా ఉంతే కోయిల ధ్వనికి అనుకరణ ఉంటుంది (2)

33. అందరితో కలిసి మెలిసి ఉండటం (8)

ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారిని కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరిగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
నవంబరు 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత పదవిన్యాసం సమాధానాలు:అక్టోబరు మాసపు పదవిన్యాసంలో ఒక అచ్చుతప్పు ఉన్నందుకు చింతిస్తున్నాము. అయితే చాలా తక్కువ తప్పులతో సమాధానాలు పంపిన పోలంరెడ్డి శ్రీలక్ష్మి (పిట్స్ బర్గ్, అమెరికా) మరియు రెండుచింతల ప్రసాద్ (న్యూఢిల్లీ) కృషిని సిలికానాంధ్ర అభినందిస్తున్నది.