ప్రధాన సంపాదకులు:
తల్లాప్రగడ రావు
తాటిపాముల మృత్యుంజయుడు
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
పుల్లెల శ్యామ్ సుందర్
అక్కుల కృష్ణ
శీర్షిక నిర్వాహకులు:
మువ్వల సుబ్బరామయ్య
ప్రఖ్యా మధు
విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్యులు
ఈరంకి కామేశ్వర్
రాగధేను స్వరూప కృష్ణమూర్తి
జి.బి.శంకర్ రావు
గరికిపాటి నరసింహారావు
డా||బి.వి.పట్టాభిరాం
చొక్కాపు వెంకటరమణ
ఎం.వి.ఆర్.శాస్త్రి
చీకోలు సుందరయ్య
భండారు శ్రీనివాసరావు
తల్లాప్రగడ రామచంద్రరావు
తాటిపాముల మృత్యుంజయుడు
కూచిభొట్ల శాంతి
కస్తూరి ఫణిమాధవ్
అక్కుల కృష్ణ
వనం జ్వాలానరసింహా రావు
సరోజా జనార్ధన్
యండమూరి వీరేంద్రనాథ్
సాంకేతిక సహకారం:
మద్దాలి కార్తీక్
తూములూరు శంకర్
వక్కలంక సుబ్రహ్మణ్యం
లొల్ల కృష్ణ కార్తీక్
పుల్లెల శ్యాంసుందర్
ముఖచిత్రం:
స్వర్గీయ పొట్టిశ్రీరాములు
చిత్రకారుడు: సంజీవ అప్పడు, మారిషస్.
వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ
 

 

 

 

తే.గీ.|| సమ్మోహనముల ముంచిరే సఖులు నడుమ

సాహితీభారతి బిరుదు శాలువాతొ!

ఎంత భారమో భారతీ సంతసంబు,

రావె నీదనే మోస్తుంటి రామచంద్ర!

 

ముందుగా సిలికానాంధ్రులందరికీ ధన్యవాదాలు. మీరు నాకిచ్చిన "సిలికానాంధ్రసాహితీభారతి " అన్న బిరుదుకీ, సన్మానసత్కారానికీ, ఆదరఆప్యాయతలకీ, గౌరవమర్యాదలకీ నా సాదరప్రణామాలు సమర్పించుకుంటున్నను. అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా పత్రికాముఖంగా అందించుకుంటున్నాను.

సుజనరంజని ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న సిలికానాంధ్ర అధ్యక్షులు చమర్తి రాజు, శాన్ హోసే సిటీ కౌన్సిలర్ యాష్ కాలరా, మాడభూషి విజయసారధి, తాటిపాముల మృత్యుంజయుడు, రావు తల్లాప్రగడ

ఆంధ్రసంప్రదాయ విలువలకు అద్దంపడుతూ సిలికానాంధ్ర నడిపె కార్యక్రమాలు, వాటి విన్నూత్న శైలి అందరికీ తెలిసినవే కానీ సంవత్సరం అక్టోబర్ 3 తారీఖున సిలికానాంధ్ర జరుపుకొన్న 9 ఆంధ్రసాంస్కృతికోత్సవంలో భారతీయత, ప్రతి అంశంలోనూ ప్రతిబింబించింది.భాష మాత్రం తెలుగులో నడచినా, వివిధ రాష్ట్రాలకు సంబందించిన వేషధారణలను సంస్కృతులను, వారి సంగీతాలనూ ఉపయోగిస్తూ చేసిన ఒక విన్నూత్న ప్రయోగం 'ప్రియ భారతం ' అనే నృత్య రూపకం, నాటి హైలైట్ గా నిలిచింది. నాటి కార్యక్రమాన్ని మీ అందరికీ పరిచయం చేయడం   వ్యాసపు ముఖ్య ఉద్దేశ్యం.

 

దాదాపు 2000 మంది వీక్షించిన కార్యక్రమంలో 200 మదికి పైగా కళాకారులు పాల్గొన్నారు. సిలికాన్ వేలీనుంచె కాకుండా అమెరికాలోని పలుప్రాంతాలనుంచీ అనేకమంది కళాకారులువచ్చి ప్రదర్శించడం సిలికానాంధ్ర ఎదుగుదలకు ఒక చిహ్నం. భారతదేశంలోని పొరుగురాష్ట్ర  కళాకారులుకూడా అనేకులు సిలికానాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంస్థ పురోగతికి ఒక ఉదాహరణ.

 

ఫ్రతి సంవత్సరములాగే సంవత్సరంకూడా ఒక ప్రత్యేక సుజనరంజనిని సందర్భంగా ప్రచురించి ఆవిష్కరించడం జరిగింది. తెలుగు నాటకాలపై రూపుదిద్దుకున్నా ప్రత్యేక సుజనరంజని ప్రతులను కార్యక్రమంలో భాగంగా అథిదులందరికీ పంచిపెట్టడం జరిగింది.

 

మధ్యాహ్నం ఒంటిగంటకి సిలికానాంధ్రులు చేసిన లలిత సంగీత కార్యక్రమంతో మొదలయ్యింది ఆతరువాత రామాచారిగారి సంగీత దర్శకత్వంలో రావు తల్లాప్రగడ రచించిన జగదానందం అనే నృత్యప్రదర్శన వివిధ రకాలైన ఆనందాలను వర్ణిస్తూ జనరంజకంగా సాగింది. గీతాలకు నృత్య దర్శకులుగా స్వేత వెలమూరి, అనుపమ మహాభాష్యం, రంజని మండ, పద్మజ ప్రఖ్య, మానస రావులు వివిధ ప్రాంతాలలోని పిల్లలకు తర్ఫీదునిచ్చి అలరింపచేసారు

 

తరువాత భాగవతుల సేతురాం గారి దర్శకత్వంలో గిరిజా కళ్యాణం కూచిపూడి నృత్యం అందరినీ మైమరపింపజెసింది. సమిధాసత్యం, హిమబిందు చల్లాల  నృత్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సిలికాన్ వేలీలోని అన్ని రెస్టారెంటులూ కలసి అందించిన విందుభోజనం కూడా ఒక నూతనోత్సాహన్ని పంచింది. భోజనానంతరం హబీబ్ ఖాన్ బృందంచేసిన సితార్ వాదనం హిందుస్తాని శాస్త్రీయ సంగీతానికి అమెరికన్ల వాధ్య సహకారంతో మరొక సాంస్కృతిక సంగమంగా రూపుదిద్దుకొంది. రఘుపతి రాఘవ రాజారాం వంటి గీతాలను సితార్, సాక్షోఫోన్, మృదంగం వంటి వాయిద్యాలపైన వాయించడంలో వారికి డేవిడ్, మాత్యూస్, రమేష్ శ్రీనివాసన్లు సహకారం అందించారు.

 

తరువాత దిలీప్ కొండిపర్తి దర్శకత్వంలో గొర్తి బ్రహ్మానందం రచించిన శ్రీఆంజనేయం  అనే నాటకం అందరినీ సుందరకాండలో ముంచెత్తింది. రావు తల్లాప్రగడ పద్యాలు, రవి కూచిభట్ల, సరిపల్లె శ్రీనివాస్, అమిత్ పల్ల, కాత్యాయని, దీనబాబు కొండుభట్ల నటనాచాతుర్యాలు, కార్యక్రమానికి హైలట్స్. అనేక స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ తో  నడచిన పౌరాణిక నాటిక అందరికీ పాతరోజులను గుర్తుచేసాయి. నాటకానికి ఉదయ్ కొండిపర్తి సాంకేతిక సహకారం అందించారు.

 

దాదాపు అన్ని కార్యక్రమాలకు గీతరచనలను చేసిన రావు తల్లాప్రగడ కూసిలికానాంధ్ర సాహిత్య భారతి 'బిరుదును ఇచ్చి సిలికానాంధ్ర కార్యవర్గం సత్కరించింది. అలాగే ' సిలికానాంధ్ర సంగీత భారతి 'గా సాయి మానాప్రగడను బిరుదుతో సత్కరించారు తరువాత రావు తల్లాప్రగడ రచించగా, సాయి మానాప్రగడ స్వరకల్పన చేసిన 'ప్రియ భారతం ' అనే ఛ్డ్  ని కూపర్టీనో మేయర్ చేతులమీదుగా ఆవిష్కరించారు.

 

కార్యక్రమంలో చివరి అంశంగా ' ప్రియ భారతం ' ఛ్డ్ లోని గీతాలకు నృత్య రూపకల్పనచేసి  ప్రదర్శించారు. గీతాలన్నీ తెలుగులోనే వున్నా అందులో ఒక పాట గుజరాతి గర్భా బాణీలో, మరొకటి పంజాబీ బాంగ్డా బాణీలో, మరొకటి, గోవా కోంకిణీ పాటలా, ఇంకొకటి మళయాళ ఓనం పాటలా, ఇంకొకటి ఒరియా జానపదంలా వుంటే, మరొకటి తెలుగు జానపదంలా ధ్వనిస్తాయి. పాటలకు నృత్య దర్శకత్వం ఆదిత్య పటేల్, ఉమా ధన్పాల్ అనూషా కూచిభట్ల, స్వేహా వేదుల అందించారు. ప్రయోగాత్మక కార్యక్రం అందరిచేతా స్టెప్పులు వేయించి రంజింపచేసింది.

 

కార్యక్రమం మొత్తానికీ రూపకల్పన నాయకత్వపు బాధ్యతలను కొండిపర్తి దిలీప్ చేపడితే, కార్యక్రమ అధ్యక్షులుగా శ్రీ భుద్దవరపు, సంచాలకులుగా యోగేంద్ర శృంగారం వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా సిలికానాంధ్ర నడిపే మనబడి అధ్యాపకులను ఉద్దేశించి  సిలికానాంధ్ర అధ్యక్షులు రాజు చమర్తి తన అధ్యక్షోపన్యాసం చేసారు. వివిధ మనబడి శాఖల ఉపాధ్యాయులను అన్ని రాష్ట్రాలనుంచీ పిలిపించి వారందరితో మరునాడు ఆదివారం మరొక ప్రత్యేక వర్క్ షాపును నిర్వహించారు. సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సిలర్ ఆవుల మంజులతగారు కూడా తమ స్పూర్తిని అందజెస్తూ ప్రసంగించారు. సమావేశనంతరం రెండురోజులుగా జరిగిన వేడుకలను విజయవంతంగా నడపిన అందరు స్వచ్చంద సేవకులను, సాంస్కృతిక సైనికులనూ అభినందిస్తూ  ఒక విజయోత్సవాన్ని  జరుపుకున్నారు.

 

కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దూరంగా వున్నా, మాతో కలిసి ఆనందం పంచుకుంటున్న మిగితా తెలుగువారి అందరికీ కూడా మరొక్క సారి  కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

 

 

మీ

రావు తల్లాప్రగడ

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech