1.             ఆమె కనులు కలువరేకులు
            చూపు మాత్రం మహాచురుకు
            ఆమె మనసు మల్లెపూవు
            మాటమాత్రం మహా కరుకు

2.            చంద్రమండలంలోని స్థలాలు
            రిజర్వు చేసుకుంటాడట మానవుడు
            తన స్వభావాన్ని మాత్రం పాతాళాన్ని దాటి
            పైకి రానివ్వడేమి?

3.            తలలో తురుముకోని
            గోరింటపూలకంత సువాసనా?
            తురుముకునే ముళ్ళ గోరింటలు
            తావిలేనిపూలా?

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం