నమస్కారము. నా పేరు సుశీల కేదారిశెట్టి. అమెరికాలో అడుగు పెట్టిన మరుక్షణము, నాకు మాత్రుభాష విలువ తెలిసినది. నేను ఉత్తర ఫ్రీమాంటు (బే ఎరియా కాలిఫొర్నియా) మన బడిలో 2008-09 ప్రవేశము తరగతికి తెలుగు చెప్పాను. నా తరగతిలో పదకొండు మంది చిన్నారులు ఉన్నారు - అఖిల్ గంటి, భార్గవ చిట్టెపు, భవ్య లంకిపల్లి, సాయి బాంధవి ముట్టె, లయ ముట్టె, గణేశ్ చండిక, పావని చండిక, కామేశ్వరి పోతరాజు, నిఖిత దొడ్డ్ల, నితిన్ నూతికట్టు, మరియు సాకేత్ దర్బ. వీరందరికి తెలుగు అంటే చాలా ఇష్టము. కొంతమంది చిన్నారులు తెలుగు తేలికగా మాట్లాడేవారు. మరి కొందరు కష్టపడి ముద్దు ముద్దుగా మట్లాడేవారు.  

వీరందరు మొదటి క్వార్టెర్లో అక్షరాలు వ్రాయటము నేర్చుకున్నారు. అంకెలు, పండ్లు, పక్షులు, జంతువులు పేర్లు, రంగులు, శరీర భాగములు వగైరా నేర్చుకున్నారు. రెండవ క్వార్టరులో వేగముగా అక్షరాలు వ్రాయటము వచ్చింది. పిల్లలు తెలుగులో కబుర్లు కూడా చెప్పడము మొదలుపెట్టారు. సుమతీ పద్యములు కూడా సులభంగా చెప్పసాగారు. గుణింతాలు వ్రాయటము కూడా నేర్చుకున్నారు.  

మూడవ క్వార్టరులో వత్తులు, చాలా కొత్త పదాలు నేర్చుకున్నారు. నెమ్మదిగా తెలుగు వాఖ్యాలు చదవసాగారు. 2009 జనవరి వార్శికోత్సవములో చిన్న నాటిక ప్రదర్శించారు. చిన్నారులు బోర్డుపై వ్రాయటానికి చాలా ఆశక్తి చూపేవారు. వీరికి విరామ సమయము అంటే చాలా ప్రీతి. అందరము కలిసి మెలిసి, ఆడుతూ పాడుతూ, ఒక సంవత్సరము చాలా సరదాగా ఇట్టే గడిపేసాము. తెలుగులో పిల్లలు సంభాషణ చేస్తుంటే తల్లిదండ్రులకు, తాతయ్యలకు, అమ్మమ్మ, నానమ్మలకు వచ్చే సంతోషము వర్ణింపరానిది కదా!

నా విద్యార్ధుల అభిప్రాయాలు (వారి మాటలలో):

గణేశ్: మనబడిలో నేను చాల నేర్చుకున్నాను. పావని: నేను మన బడిలో చాలా నెర్చుకున్నాను.

అఖిల్: మనబడికి వెళ్ళడం చాల ఆనందంగా ఉండింది. నాకు తెలుగు నెర్చుకొవడం, మాట్లాడం చాల గర్వంగా ఉంది.

కామేశ్వరి: మనబడి నాకు మాతృభాష నేర్చుకోవటానికి ఒక మహా అవకాశము ఇచ్చింది. ఇప్పుడు నాకు తెలుగు మాట్లాడటము కాకుండ చదవటము, రాయటము వచ్చింది. అందుకే మనబడి అంటే చాలా ఇష్టము.

భవ్య: నాకు మనబడి అంటే చాలా ఇష్టము. మా మనబడి టీచరు కథలు, పద్యాలు నేర్పింది. నేను ఇప్పుడు తెలుగు బాగ మాట్లాడుతాను.

సాయి బాంధవి: నాకు మనబడి అంటే చాలా ఇష్టము.

నాగమల్లేశ్వరరావు చండిక, మహలక్ష్మి ముకాల (పావని, గణేశ్ తల్లిదండ్రులు): మనబడిలో మాపిల్లలు పావని మరియు గణేశ్ చండిక ప్రవేశం క్లాసులో తెలుగు చాలా అద్బుతంగా నేర్చుకున్నారు. తల్లి తండ్రులుగా మేము చాలా సంతోషించాము. మేము మిగతా తల్లి తండ్రులకు కూడా రికమెండ్ చేస్తున్నాము. ఇది తల్లి తండ్రులకు ఒక అద్భుతమైన అవకాశం. సిలికాన్ ఆంధ్ర వారు చేస్తున్న సేవలకు మా ధన్యవాదములు.

 
 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech