సర్వేంద్రియాలె

సంగీతం: రామాచారి
రచన: రావు తల్లాప్రగడ
 

          ఈ గీతం వినడానికి:  
          (బటన్ నొక్కాక పాట వినడానికి అవసరమైతే కొంచెం వేచి ఉండగలరు)

 

పల్లవి

సర్వేంద్రియాలె సరిచూచినా, ఆనందమేలా మనసునందునే? (2)

సర్వ శరీరము పరవశించినా, సిసలు శర్మమా మనసునందునే !

చరణం-1

ధారుణి ధృతిలోకల రూపము ప్రతినామము, తప్పని గను మానసంబే

చూచిన ప్రతిదానిని చూడని ప్రతిదానిని చూచును పరమాత్మతానై

బీజా పదం- రేఖా గణం - విలోచనం విమో హనం, నిరతరం (2)

ప్రణవ ప్రమద ప్రదిమలా, జ్ఞాన ప్రతతి ప్రతిమలా

మనోజ్ఞాన మహానంద మానసియై .............

సర్వేంద్రియాలె స్పందించినా, ఆనందమేలా మనసునందునే?

సర్వ శరీరము పరవశించినా.......

చరణం-2

అందము ఆనందమె, జ్ఞానము ఆనందమె, శూన్యము ఆనందమేనూ

మానస ప్రతిపాదనె, మానవ ప్రతిసాధనె, దేవుని నిజరూపమేను

దీక్షామనం - ఆనందము - అదే జపం, ప్రతీ క్షణం ప్రతిక్షణం, (2)

కామ క్రోధ ధ్వంసినై, శాంతి కాంతి అద్భుతై

ఒకేధ్యాస మహాధ్యాన తాపసియై......

సర్వేంద్రియాలె స్పందించినా, ఆనందమేలా మనసునందునే?

సర్వ శరీరము పరవశించినా.................

సర్వేంద్రియాలె సరిచూచినా , ఆనందమేలా మనసునందునే? (2)

సర్వ శరీరము పరవశించినా, సిసలు శర్మమా మనసునందునే !

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech