బోట్ల ద్వారా
వచ్చువారు
వేయు వేటు కన్నా

ఓట్ల ద్వారా
వచ్చువారు
చేయు చేటు మిన్న

బుల్లెటు చేయు
గాయం కన్నా
బ్యాలెట్ చేయు
అన్యాయం మిన్న

సునామీ కన్నా
బినామీల వల్ల
ఎకానమీకి కలుగు
ప్రమాదం మిన్న

రాజ దర్బారు (Assembly) కన్నా
చౌకబారు
సారాబారు మిన్న

జంకుగా రంకు చేయు
సాని పలుకుల కన్నా
రాజకీయ దొరసానుల
పలుకులు అతినీచమన్నా

ఎన్నికలు లేనప్పుడు
ఎవడిదెంత సొత్తని
మొత్తు కొందురు

ఎన్నికలప్పుడు
చెత్త "నా"యకులు
కొత్తగా గమ్మత్తుగా
పొత్తులని హత్తుకొందురు

ప్రజల బాధలు వినుట
కాదు వారి విధులు
దేశ నిధులు తినుట
ప్రజా ప్రతినిధుల విధులు

మనం ఎన్నికలలు కన్నా
ఎన్నికల వలన
మనకు మిగులు సున్న

ఒకటి మాత్రం నిజం
అది అతి సహజం
మారదు మన సమాజం

పేదవాడికి తప్పవు పస్తులు
ఉద్యోగి చెల్లించు సిస్తులు
నీతి వల్లించు నేత
పెంచు ఆస్తులు

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం