ఖగోళంలో నవగ్రహములు జగతికి కేంద్రమానం
రాహు కేతువులు తటస్తం
సప్త గ్రహములే రోజులకు ప్రతిరూపం

సిమ్హాధిపతి సూర్యుడు
ఆరోగ్య భాగ్యమునులను ఒసగునేని దినకరుడు శుభప్రదుడు
ఈ ఆధిత్యుని ప్రభవానలమే ఆదివారం

కటకాధిపతి చంద్రుడు
బుద్ధిప్రధాత సోముడు
ఈ ప్రభాస సోముని ప్రభవానలమే సోమవారం

మేష, వృశ్చికాధిపతి కుజుడు
మంగళప్రదాయుడు కార్తికేయుడు గణాధ్యషుడు
సౌర్యసాహసలతో శత్రు వినాసనంగావించు
ఈ మంగళాకరుని ప్రభవానలమే మంగళవారం

మిధున కన్యాధిపతి బుధుడు
ఒసంగు వినయ విధ్య బుద్ధి కుసలం
రాష్ట్ర ఆరాధన చైతన్యం కల్గించునేని బుధప్రభావం
ఈ శు బుధుని ప్రభవానలమే బుధవారం

ధనుర్ మీనాధిపతి బృహశ్పతి
జ్ఞాన వర్చశ్సుల తోడ ఆర్ధికాబివృద్ధి కావించును గురువు
ఈ గురు ప్రభవానలమే గురువారం

వృషభ తులాధిపతి శుక్రుడు
వికాస పురోగతికి తోడ్పడు శుక్రుడు ఒసంగునేని ఇహలోక సుఖములు
ఈ శుక్ర ప్రభవానలమే శుక్రువారం

మకర కుంభాధిపతి శని యోగప్రధుడు
వృత్తి వనరులు సమకూర్చునేని శనీశ్వరుడు
ఈ శని ప్రభవానలమే శనివారం

ఈ దిన వార నక్షత్ర రాశుల సమ్మేళనం
చరా చర శృష్టి మనుగడకు మూలాదారం
సాగునేని మానవ జీవన కాలచక్రం

ఈ దిన రాశుల జ్ఞాన బండాగారం
దెల్పునేని పంచమ వేందాంగం జ్యోతిషం

వందే భారతీయం!


 


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం