ఆమె
పూలు కోస్కెళ్ళింది
తుమ్మెద లేట్ కమ్మర్

అతనికి
స్టీలుగిన్నెలో
తన ప్యాంటు కన్పిస్తోంది

నీ పాదముద్రల మీంచి
జ్ఞాపకాలు
నడిచొస్తాయి

వేదికపైన
పాదముద్రల దొంతర్లు
నాట్యం

దూరంగా కొండలు
పాప
గీత గీసినట్టు

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం