సుజనరంజని / కవితా స్రవంతి   / తెలుగు తల్లిని నేను

తెలుగు తల్లిని నేను
 

                                          రచన :    పి. వాణి

 

తెలుగు తల్లిని నేను
వెలుగు జిలుగుల వన్నెల దొరసానిని
ఎదురులేని భాషను
కోనసీమ కొబ్బరిని, రాయలసీమ రత్నాన్ని,
తెలంగాణా తెలుగుని, బాసరలో వాణిని,
ఒరవడిలో సైతం ఒద్దికనేర్పే గోదారిని
కృష్ణవేణిలో ఉరకలు వేసే ఉత్సాహాన్ని
 
వసంతపు వెల్లువను
శరత్కాలపు వెన్నెలను
సమరయోధుల పౌరుషాన్ని, త్యాగశీలుల స్వప్నాన్ని
మహాకవుల మనసుని, మధురమైన భాషను,
రాయలు మెచ్చిన తెలుగుని, పోతనామాత్యుని కావ్యాన్ని,
రామదాసు కీర్తనని, అన్నమాచార్య సంకీర్తనని,
కొటిభావాల కలయికని, శతకోటి రాగాల మాలికను,
అనంత సంధానాల అవధానికను, అంతులేని అపూర్వ సంపదను.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech