సుజనరంజని / కవితా స్రవంతి   / గాంధీజీ, నిను కూల్చలేరు...


గాంధీజీ, నిను కూల్చలేరు...

                                         రచన :  రావి రంగారావు

 

బతుకు విలువ పెంచు పంటలు పండించు
సత్య వాక్కు గొప్ప సార భూమి,
సాగు చేయు డనుచు సందేశ మిచ్చును. l
వీధు లందు గాంధి విగ్రహాలు.
 
కళ్ళ జోడు పైన, కాళ్ళ జోడును క్రింద
కలిపి ఉంచి నాడు కర్ర తోడ,
నడచి వచ్చు చున్న నా తాత అనిపించు
హృదయ మందు మనకు  ఎవరి కైన.
 
మనుషు లందు నేడు మనసులు ధ్వంసమై
పచ్చి పగల ఇరులు పెచ్చరిల్లె,
అర్థ రాత్రి కొంద రతి మత్త మృగములై
విరగ గొట్టి నారు విగ్రహమ్ము...
 
పౌరు లేడ్చి నారు పాప కార్యము చూచి
గాలి పశువు లేడ్చే, కాకు  లేడ్చే....
ధర్మ హాని గాంచి ధరణీతలం బేడ్చే..
పాప కార్య మనుచు ప్రకృతి ఏడ్చే...
 
నరుల ఎదల గాంధి నాటిన మొక్కలు
ఎండబోవు - పూయు చుండు సతము,
విరుగ గొట్టి నట్టి విమల క్షేత్రమునందు
కొత్త గాంధి తాత  కొలువు తీరె
 ( మచిలీపట్టణం భాస్కరపురం సెంటరులో గాంధి విగ్రహం కూల్చిన తరువాత హుస్సేను మాస్టారు ఆధ్వర్యంలో కొత్త విగ్రహం నెలకొల్పిన సందర్భంగా...)
 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech